వినాయకుడి వాహనం ఎలుక.. ఎలా మారిందో తెలుసా..

హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏ దేవుడికి పూజించినా అక్కడ తలపెట్టిన కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగాలని ముందుగా వినాయకుడికి పూజలు నిర్వహిస్తుంటారు. ఆ గణనాథుడి అనుగ్రహం పొందితేనే ఏ కార్యక్రమం అయినా విజయవంతంగా పూర్తి అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి. హిందూ సాంప్రదాయాల ప్రకారం అలాగే పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. అందుకే వినాయక చవితి కుల మత తేడా లేకుండా ఘనంగా నిర్వహించుకుంటారు. వినాయక చవితి ఘనంగా నిర్వహించుకునే భక్తులకు సాధారణంగా వచ్చే డౌట్ ఇంత పెద్దగా ఉండే వినాయకుడికి ఎలుక వాహనం ఎలా అయ్యింది. ఎలా మీద ఎలా ఊరేగాడు, ఇది ఎంత వరకు వాస్తవం అని అనుకుంటారు అయితే విషయంపై భక్తుల అనుమానాలపై పూర్తిగా క్లుప్తంగా లోకల్ 18 ద్వారా వివరణ ఇచ్చారు ఆలయ అర్చకుడు వామన శర్మ. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము.

పెద్దపల్లి జిల్లా పర్మనెంట్ టౌన్ షిప్ వినాయకుడి ఆలయ అర్చకుడు వామన శర్మ వినాయకుడి భక్తులకు వచ్చే సందేహాల పై పూర్తి వివరణ ఇచ్చారు. ఆనాటి కాలం లో దేవతా మూర్తులు అందరు కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని మాట్లాడుకునేందుకు సభను ఏర్పాటు చేస్తారు. ఆ సమావేశం జరగకుండా క్రౌంచుడు చేస్తాడు. అప్పుడు అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది.

---- Polls module would be displayed here ----

దీంతో వినాయకుడి తన ప్రసిద్ధ ఆయుధమైన పాశాన్ని ముషికంపై ప్రయోగిస్తాడు. అప్పుడు ఆ పాశం క్రౌంచుడు మెడకు చుట్టుకుని వినాయకుడి వద్దకు వస్తాడు. వచ్చిన వెంటనే క్రౌంచూడు భయంతో క్షమించమని వేడుకుంటాడు. అతని భయాన్ని గ్రహించిన వినాయకుడి దయా హృదయంతో క్షమించి మరో సారి ఇలాంటి పొరపాట్లు చేయొద్దు అని హెచ్చరిస్తాడు. ఎలుక రూపంలో ఉన్న క్రౌంచుడు వినాయకుడి మాటలకి ఒప్పుకుంటాడు.

అయినా ఎలుక సంతోషంగా లేదు ఎందుకంటే ఇంద్రుడి శాపం వల్ల క్రౌంచుడు ఎలక లాగా మారాడు. దీంతో ఆ శాపం నుండి విముక్తి కలిగించి క్రౌంచుడి లా మార్చాలని వేడుకుంటాడు. కానీ ఆ అధికారం వినాయకుడి వద్ద లేకపోవడంతో ఎలాగైనా ఆశీర్వదించాలని భావించాడు. ఆయన ఆలోచన ప్రకారం ఏ దేవుడినీ ముందుగా పూజలు నిర్వహిస్తారో అని ఆది దేవుడు వినాయకుడికి ముందుగా పూజలు నిర్వహించడం ఆనవాయతీ కాబట్టి వినాయకుడితో పాటు పూజలు అందుకునేలా ఎలుక రూపంలో ఉన్న గంధర్వుడైన క్రౌంచూడుకి వరాన్ని ప్రసాదించాడు. ఈ కారణంగానే వినాయకుడుకి వాహనంలా ఎలుక వాహనం లాగ మారిందని ఆలయ పూజరి వామన శర్మ తెలిపాడు.

ఎలుకపై ఎలా ఉరేగాడు..

వినాయకుడి బరువు చాల అధికం. మరి ఎలక బరువు చాలా తేలిక. మరి ఎలక పై వినాయకుడు ఎలా ఊరేగాడు అనే సందేహాలు కూడా భక్తులకు కలుగుతుంది. వినాయకుడి ఎలుక పై ఊరేగటానికి ఎలుక రూపంలో ఉన్న క్రౌంచూడికి వినాయకుడు ఒక వరాన్ని ప్రసాదిస్తాడు. వినాయకుడి ఎప్పుడైతే ఊరేగుతాడు ఆ సమయంలో ఆ బరువును మోసే అనుగుణంగా ఉండాలని వరాన్ని ప్రసాదిస్తాడు. అప్పటి నుండి వినాయకుడి ఎలుకను వాహనంగా మార్చుకుని ఎన్నో విజయాలను అందుకున్నాడు అని పూజారి తెలిపాడు.

2024-07-02T09:57:23Z dg43tfdfdgfd