RICEFLOUR FACEPACKS : బియ్యంపిండిలో వీటిని కలిపి ప్యాక్ వేస్తే స్కిన్ మెరుస్తుంది..

Riceflour Facepacks : స్కిన్ కేర్ రొటీన్‌ చాలా ముఖ్యం. దీని వల్ల అందంగా కనిపిస్తారు. అందుకోసం బియ్యంపిండిని ఎలా వాడాలో తెలుసుకోండి.

ఫేస్‌మాస్క్‌తో స్కిన్ ప్రాబ్లమ్స్ చాలావరకూ దూరమవుతాయి. దీంతో చర్మం కాంతివంతంగా, అందంగా తయారవుతుంది. దానికోసం ఖరీదైన ఫేస్‌ప్యాక్స్, క్రీమ్స్ వాడకుండా ఇంట్లోనే ఫాలో అవ్వాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. అందులో బియ్యంపిండి ఫేస్‌ప్యాక్స్ ఒకటి. దీనిని ఎలా చేయాలో తెలుసుకోండి. తేనె..

1 టేబుల్ స్పూన్ బియ్యంపిండిలో కొద్దిగా తేనె వేయండి. అవసరమనుకుంటే కొన్ని వాటర్ వేసి ప్యాక్‌లా కలుపుకోండి. దీనిని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకోండి. ఇలా రెగ్యులర్ చేస్తే ముఖం మెరిసిపోతుంది. కాబట్టి, ట్రై చేయండి.

అలోవెరా..

అలోవెరా కూడా అందానికి మేలు చేస్తుంది. దీనిని వాడడం వల్ల చర్మ సమస్యలన్నీ దూరమవుతాయి. అందుకోసం 1 టేబుల్ స్పూన్ బియ్యంపిండిలో అలోవెరా జెల్ వేసి బాగా కలపాలి. ఈ పేస్టుని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత క్లీన్ చేయండి.

గ్రీన్ టీ..

గ్రీన్ టీలో ఎన్నో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవన్నీ చర్మానికి మేలు చేస్తాయి. కాబట్టి, అవన్నీ మీ స్కిన్‌కి అందాలంటే కొద్దిగా బియ్యంపిండి తీసుకుని అందులో గ్రీన్ టీ వేయండి. దీనిని పేస్టులా చేసి ముఖానికి అప్లై చేయండి. తర్వాత క్లీన్ చేసుకోండి.

నిమ్మరసంతో..

1 టేబుల్ స్పూన్ బియ్యంపిండి తీసుకోండి. ఇందులో నిమ్మరసం వేసి బాగా కలపండి. ఇప్పుడు దీనిని ముఖానికి ప్యాక్‌లా వేయండి. 20 నిమిషాల పాటు అలానే ఉంచి ఆ తర్వాత నీటితో క్లీన్ చేయండి. ఇలా రెగ్యులర్‌గా చేస్తే ముఖంపై ఉండే సమస్యలన్నీ పోతాయి.

కొబ్బరిపాలు..

1 టేబుల్ స్పూన్ బియ్యంపిండిలో కొద్దిగా కొబ్బరిపాలు వేసి ప్యాక్‌లా చేయండి. దీనిని ముఖానికి ప్యాక్‌లా వేయండి. 20 నిమిషాల పాటు అలానే ఉంచి తర్వాత క్లీన్ చేసుకోండి.

పసుపు..

1 టేబుల్ స్పూన్ బియ్యంపిండిలో కొద్దిగా పసుపు, కాస్తా నీరు పోసి ప్యాక్‌లా చేసుకోండి. దీనిని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల పాటు ఉండండి. తర్వాత స్క్రబ్‌ చేస్తూ క్లీన్ చేయండి. దీని వల్ల ఫేస్‌పై ఉండే మొటిమలు, మచ్చలు తగ్గిపోతాయి.

పెరుగుతో..

పెరుగు బియ్యంపిండి కలిపి సూపర్ ప్యాక్ తయారుచేసుకోవచ్చు. ఇందుకోసం 1 టేబుల్ స్పూన్ బియ్యంపిండి, పెరుగు వేసి బాగా కలపాలి. దీనిని ఫేస్‌ప్యాక్‌లా అయ్యేవరకూ రెడీ చేయండి. దీనిని ముఖానికి అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాల తర్వాత క్లీన్ చేసుకోండి.

గమనిక: నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Read More : Beauty News and Telugu News

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-07-03T07:20:39Z dg43tfdfdgfd