KASTURI HALDI : ఈ పసుపుతో ఫేస్‌ప్యాక్ వేస్తే ముఖం మెరుస్తుంది..

Kasturi Haldi : పసుపు చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. అందులో కస్తూరి పసుపు మరీ మంచిది.

అందంగా కనిపించేందుకు నేడు మార్కెట్‌లో ఎన్నో క్రీమ్స్ వచ్చాయి. అయితే, వీటి బదులు నేచురల్‌గా స్కిన్ మెరవాలంటే కస్తూరి పసుపు వాడాల్సిందే. దీనిని ఎన్నో రోజులుగా వాడుతున్నారు. చాలా ఔషధ గుణాలున్న కస్తూరి పసుపు చర్మ అందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కస్తూరి పసుపు ఫేస్‌ప్యాక్ ఈ రోజుల్లోని అద్భుత గుణాల వల్ల ఎంతగానో వైరల్ అయింది. దీనిని ఎలా వాడాలి.. వాడితే ఎలాంటి లాభాలున్నాయో తెలుసుకోండి. మచ్చలు దూరం..

కస్తూరి పసుపుని ఫేస్‌ప్యాక్‌లో వాడితే చాలా మంచిది. దీని వల్ల ముఖంపై నల్లమచ్చలు, మొటిమలు దూరమవుతాయి. కస్తూరి పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. దీని వల్ల ముఖంపై మొటిమలు దూరమై మృదువుగా మారుతుంది.

గులాబీ పూరెక్కలతో సీరమ్..​ ​

చర్మ సమస్యలు..

యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబయల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలున్న కస్తూరి పసుపు చర్మ ఇన్ఫెక్షన్స్, సమస్యల్ని దూరం చేస్తాయి. చర్మ రంగుని మారుస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ​Also Read : ఈ టిప్స్ ఫాలో అయితే చర్మ ముడతలు తగ్గి యంగ్‌గా కనిపిస్తారు..

అవాంఛిత రోమాలు..

కొంతమంది ఆడవారికి అన్‌వాంటెడ్ హెయిర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని దూరం చేసేందుకు కస్తూరి పసుపు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. కస్తూరి పసుపులో శనగపిండి, పాలు కలిపి ప్యాక్‌లా చేసి ముఖానికి అప్లై చేస్తే ఆరిన తర్వాత క్లీన్ చేసుకోవాలి.

యవ్వనంగా..

కస్తూరి పసుపులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. ఇవి చర్మానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్‌ని దూరం చేస్తాయి. దీంతో చర్మంపై ముతలు, ఫైన్‌లైన్స్ దూరమవుతాయి. డార్క్ స్పాట్స్ కూడా దూరమై యవ్వనంగా కనిపిస్తారు. ​Also Read : గ్రీన్ టీతో ఇలా ఫేస్‌ప్యాక్ వేస్తే స్కిన్ మెరుస్తుంది..

కాంతివంతంగా..

ముఖం కాంతివంతంగా మెరవాలని కోరుకుంటారు. అలాంటివారు కస్తూరి పసుపుని వాడితే గ్లో పెరుగుతుంది. డార్క్ స్కిన్ ప్రాబ్లమ్ దూరమవుతుంది. కాబట్టి, రెగ్యులర్‌గా వాడండి. దీనిని వాడడం వల్ల పొల్యూషన్ వల్ల కలిగే స్కిన్ డ్యామేజీని కూడా దూరం చేసుకోవచ్చు.

డెడ్ స్కిన్ దూరం చేసేందుకు..

కస్తూరి పసుపులో కొద్దిగా పెరుగు కలిపి ముఖానికి అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేస్తే ముఖంపై ఉన్న మృతకణాలు తొలగిపోయి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ దూరమవుతాయి. గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Read More : Health News and Telugu News

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-06-13T06:19:31Z dg43tfdfdgfd