horoscope today 05 July 2024 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శుక్రవారం రోజున చంద్రుడు మిధున రాశిలో సంచారం చేయనున్నాడు. ఈరోజు ద్వాదశ రాశులపై ఆర్ర్ద నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఇదే సమయంలో అమావాస్య తిథి వేళ కొన్ని శుభ యోగాలు ఏర్పడనున్నాయి. ఈరోజున సర్వార్ధ సిద్ధి యోగం, ధ్రువ యోగం, శివ వాసి యోగం ప్రభావంతో కొన్ని రాశుల వారికి విశేష లాభాలు కలగనున్నాయి. మరికొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా మేషం నుంచి మీన రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది. 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
ఈ రాశి వారికి ఈరోజు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మీరు వాహన సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు. మీరు మీ పిల్లల భవిష్యత్తుకు సంబంధించి కొన్ని శుభవార్తలను వింటారు. మీరు ఈరోజు స్నేహితుల నుండి కూడా మద్దతు పొందుతారు. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు పొందుతారు. ఈరోజు కుటుంబంలో కొంత అసమ్మతి ఉండొచ్చు. ఈ సమయంలో మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. విద్యార్థులు తమ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతారు.ఈరోజు మీకు 88 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.పరిహారం : ఈరోజు పేదలకు సాయం చేయాలి.
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
ఈ రాశి వారు ఈరోజు జీవితంలో ఏదైనా సంబంధానికి సంబంధించి ఏదైనా వివాదం ఉంటే అది ఈరోజుతో ముగుస్తున్నట్లు అనిపిస్తోంది. చర మరియు స్థిరాస్తికి సంబంధించి ఏదైనా వివాదం ఉంటే అది ఈరోజే పరిష్కరించబడుతుంది. ఈరోజు మీ స్నేహితులకు సాయం చేయొచ్చు. మరోవైపు మీ ఆర్థిక పరిస్థితి కూడా బలంగా ఉంటుంది. ఏదైనా ఆశించిన ఫలితాన్ని పొందాలనే కోరిక ఉంటే, అది కూడా ఈరోజు నెరవేరినట్లే. మీరు సాయంత్రం ఏదో ఒక సామాజిక కార్యక్రమంలో పాల్గొంటారు.ఈరోజు మీకు 75 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.పరిహారం : ఈరోజు వినాయకుడికి లడ్డూలు సమర్పించాలి.
మిధున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
ఈ రాశి వారు ఈరోజు కొందరు పాత స్నేహితులను కలవొచ్చు. దీని వల్ల మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. చిన్న సభ్యులు లేదా పిల్లలు కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. అందువల్ల వారి ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. లేకుంటే అజీర్ణం యొక్క ప్రభావం కొనసాగుతుంది. మీ చిక్కులు ముగుస్తాయి. ఈరోజు మీ మధురమైన మాట ప్రభావం వల్ల అన్నీ పొందొచ్చు.ఈరోజు మీకు 95 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.పరిహారం : ఈరోజు శివ జపమాల పఠించాలి.
కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
ఈ రాశి వారిలో వ్యాపారులు ఈరోజు ముఖ్యమైన వ్యక్తులను కలుసుకోవచ్చు. వారి ప్రభావంతో మీ వ్యాపారం ఊపందుకుంటుంది. మరోవైపు ఆర్థిక పరంగా ప్రతికూల ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఉత్సాహంతో, తొందరపాటుతో చేసే పని చెడిపోవచ్చు. సాయంత్రం వేళలో మతపరమైన కార్యకలాపాలపై మీ ఆసక్తి పెరుగుతోంది. దాతృత్వ కార్యక్రమాలపై కొంత ఖర్చు కూడా ఉండొచ్చు.ఈరోజు మీకు 86 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.పరిహారం : ఈరోజు లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించాలి.
సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీకు ఇతరులతో అభిప్రాయ భేదాలు రావొచ్చు. ఇది మీకు ఇబ్బంది కలిగించొచ్చు. ఈరోజు మీరు చేసే పనికి ప్రతికూల ఫలితం ఎదురవుతుంది. మీరు శత్రువులపై విజయం సాధిస్తారు. కుటుంబ సమస్యలకు సంబంధించి మీరు ఈరోజు ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటే, అది మీకు సమస్యలను కలిగిస్తుంది. మీ జీవిత భాగస్వామి మీకు చాలా విషయాల్లో మద్దతు ఇస్తారు. విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు.ఈరోజు మీకు 81 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.పరిహారం : ఈరోజు వినాయకుడికి లడ్డూలు సమర్పించాలి.
కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
ఈ రాశి వారికి జ్యేష్ఠ అమావాస్య వేళ ఎంత కష్టపడితే, అంత మంచి లాభాలొచ్చే అవకాశం ఉంది. ఈరోజు మీ పని ప్రాంతం కోసం కొంత దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. మానసిక సమస్యల వల్ల టెన్షన్ ఉంటుంది. మీరు ఈరోజు కొన్ని పాత అసంపూర్తి పనులను కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. మీ ప్రియమైన వారిని కలుస్తారు. ఈ సాయంత్రం మీ కుటుంబంలోని చిన్న పిల్లలతో కొంత సమయం గడుపుతారు. ఇది మీ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.ఈరోజు మీకు 73 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.పరిహారం : ఈరోజు సరస్వతి మాతను పూజించాలి.
తులా రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
ఈ రాశి వారిలో ఉద్యోగులకు ఈరోజు శుభప్రదంగా ఉంటుంది. వ్యాపారులకు మంచి ఫలితాలొస్తాయి. మీకు మంచి లాభాలొచ్చే అవకాశాలుంటాయి. ఈరోజు మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. ఇది మీ మనస్సులో ఆనందాన్ని కలిగిస్తుంది. ఈరోజు ఉద్యోగస్తులకు కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. మీరు ఈరోజు ఎవరికైనా కొంత డబ్బు ఇవ్వాలని ఆలోచిస్తుంటే, అలా చేయకండి, ఎందుకంటే దానిని తిరిగి పొందే అవకాశాలు తక్కువగా ఉంటాయి.ఈరోజు మీకు 62 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.పరిహారం : ఈరోజు పసుపు వస్తువులను దానం చేయాలి.
వృశ్చిక రాశి ఫలితాలు (Scorpio Horoscope Today)
ఈ రాశి వారు ఈరోజు కొన్ని శుభకార్యాలు నిర్వహించే అవకాశం ఉంది. మీ ఇంటికి అతిథులు వచ్చే అవకాశం ఉంది. మీరు మంచి ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలి. ఈరోజు మీరు ఆశించిన పనులు చేస్తారు. మరోవైపు స్నేహితులు, బంధువుల కారణంగా ఇంట్లో కూడా టెన్షన్ ఏర్పడొచ్చు. మీ తల్లికి బహుమతిని కొనుగోలు చేయొచ్చు.ఈరోజు మీకు 78 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.పరిహారం : ఈరోజు తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోవాలి.
ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ఈ రాశి వారికి ఈరోజు మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. ఈరోజు కొందరు గొప్ప వ్యక్తులను కలిసే అవకాశం ఉంది. ఈరోజు మీకు చాలా రంగాల్లో పురోగతి లభిస్తుంది. మీకు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయితే వాటి నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉంది. ఉద్యోగులకు కార్యాలయంలో సానుకూల ఫలితాలొస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం అవుతుంది. మీ పిల్లలు తమ భవిష్యత్తు కోసం మిమ్మల్ని కొన్ని సలహాలు అడగొచ్చు. ఆర్థిక పరంగా మీరు మంచి ప్రయోజనాలు పొందుతారు.ఈరోజు మీకు 70 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.పరిహారం : ఈరోజు లక్ష్మీదేవిని పూజించాలి.
మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
ఈ రాశి వారికి ఈరోజు మానసిక గందరగోళం వల్ల తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. మీ పిల్లల వైపు నుంచి కొన్ని ఆందోళనలు రావొచ్చు. ఈరోజు మీరు పొరుగువారి వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మీ మాటలను నియంత్రించాలి. మీ వైవాహిక జీవితంలో సంతోషం పెరుగుతుంది. ఈరోజు వ్యాపారం కొత్త పుంతలు తొక్కుతుంది. మీ కుటుంబ వ్యాపారానికి జీవిత భాగస్వామి సలహా ప్రభావవంతంగా ఉంటుంది. ఈ సాయంత్రం మీ జీవిత భాగస్వామితో ఎక్కడికైనా వెళ్లొచ్చు.ఈరోజు మీకు 62 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.పరిహారం : ఈరోజు చేపలకు పిండి పదార్థాలను తినిపించాలి.