పాడైన రొయ్యలు

  • కిచెన్‌లో బొద్దింకలు ఫుడ్‌సేఫ్టీ విభాగం తనిఖీల్లో వెలుగు చూసిన నిజాలు

సిటీబ్యూరో, జూలై 2 (నమస్తే తెలంగాణ): పేరుకే పెద్ద పెద్ద రెస్టారెంట్లు. వంద ల కొద్దీ బెస్ట్‌ రివ్యూలతో మంచి పేరు పొందుతాయి. కానీ అసలు విషయమంతా కిచెన్‌ రూంలోకి వెళ్లి చూస్తే మేడిపండు మేలిమి రహస్యాలన్నీ బయటపడతాయి. ఫుడ్‌సేఫ్టీ విభాగం నిర్వహిస్తున్న తనిఖీల్లో ఆయా రెస్టారెంట్ల చేదు విషయాలన్నీ వెల్లడవుతున్నాయి. మంగళవారం అధికారులు నానక్‌రాం గూడ తబలా రసా లో 12 కిలోల రొయ్యలు, పాల గడువు ముగిసి ఉన్నాయని గుర్తించారు. అయినా సిబ్బంది వాటిని వినియోగదారులకు విక్రయిస్తున్నారని తేలింది. వంటగది అపరిశుభ్రంగా ఉన్నట్టు, నిల్వ చేసిన ఆహార వస్తువులకు సరైన కవర్లు లేవన్న విషయాన్ని గుర్తించారు. ఈ తనిఖీల్లో భాగంగా గచ్చిబౌలిలోని హకునా మరాఠా కిచెన్‌లో ఫుడ్‌ హ్యాండ్లర్లు తలపాగా, గ్లౌజులు, అప్రాన్‌ ధరించకుండా ఉన్నట్లు గుర్తించారు. బొద్దింకల నియంత్రణ కూడా లేదు. కాగా సంబంధిత నిర్వాహకులపై చర్యలు తీసుకున్నట్లు ఫుడ్‌ సేఫ్టీ అధికారులు పేర్కొన్నారు.

2024-07-02T20:22:44Z dg43tfdfdgfd