MUTTON CURRY FOR BONALU : పండుగ ఏదైనా ముక్క పడాల్సిందే.. మటన్ తినాల్సిందే బోనాలు స్పెషల్ రెసిపీ

పండుగైనా, ఏ అకేషన్​ అయినా.. తెలంగాణ వాసులు వండే వంటల్లో కచ్చితంగా మటన్ ఉంటుంది. ముక్క, చుక్కా కచ్చితంగా ఉండాలని చూస్తారు. ఏ దావత్​కి అయినా ఈ కాంబినేషన్ ఉండాల్సిందే. అందుకే బోనాలకు కూడా మటన్​ను బాగా వండుకుంటారు. మరి ఈ టేస్టీ రెసిపీని ఏ విధంగా వండాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటి? రైస్, బగారా రైస్, రోటీ, చపాతీలలోకు కాంబినేషన్ వచ్చేలా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

కావాల్సిన పదార్థాలు

మటన్ మారినేషన్ కోసం

మటన్ - అరకిలో

పసుపు - పావు టీస్పూన్

ఉప్పు - రుచికి సరిపడా

కారం - 1 టీస్పూన్

నూనె - 1 టేబుల్ స్పూన్

నిమ్మరసం - 1 టీస్పూన్

గ్రేవీ కోసం

కొబ్బరి తురుము - 2 టేబుల్ స్పూన్లు

దాల్చిన చెక్క - రెండు ఇంచులు

అనాస పువ్వు - 1

యాలకులు - 2

లవంగాలు - 4

బిర్యానీ ఆకు - 1 

మిరియాలు - అర టీస్పూన్

ధనియాలు - రెండు టీస్పూన్లు

జీలకర్ర - అర టీస్పూన్ 

గసగసాలు - 1 టీస్పూన్

నువ్వులు - 2 టీస్పూన్లు 

జీడిపప్పు - 5

ఎండుమిర్చి - 5

కర్రీ కోసం

నూనె - రెండు టేబుల్ స్పూన్లు

జీలకర్ర - అర టీస్పూన్

పచ్చిమిర్చి - 2

కరివేపాకు -  1 రెబ్బ

ఉల్లిపాయలు - రెండు మీడియం సైజువి

అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు

కొత్తిమీర - ఒక చిన్న కట్ట

పుదీనా - పది ఆకులు

తయారీ విధానం

ముందుగా మటన్​ను బాగా శుభ్రం చేసుకుని.. దానిని మిక్సింగ్​ బౌల్​లోకి తీసుకోవాలి. దానిలో పసుపు, ఉప్పు, కారం, నిమ్మరసం, నూనె వేసుకుని.. బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిని బాగా కలిపి ఓ అరగంట పక్కన పెట్టుకోవాలి. అప్పుడు ఈ మిశ్రమాలన్నీ మటన్​కి బాగా పట్టుకుంటాయి. ఇప్పుడు మసాలా కోసం.. ఓ మిక్సీ జార్ తీసుకోండి. ఇది గ్రేవీ, మసాలాగా కలిసి వస్తుంది. ఇప్పుడు దానిలో కొబ్బరి తురుము, దాల్చిన చెక్క, అనాస పువ్వు, యాలకులు, లవంగాలు, బిర్యానీ ఆకు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, నువ్వులు, జీడిపప్పు, ఎండి మిర్చి వేసి మిక్సీ చేయాలి. దానిలో కాస్త నీరు వేసి.. మెత్తని పేస్ట్​గా చేసుకోవాలి. 

మారినేట్ చేసిన మటన్ వేయాలి

ఇప్పుడు కుక్కర్ తీసుకుని స్టౌవ్ వెలిగించి దానిపై పెట్టాలి. దానిలో నూనె వేసి.. జీలకర్ర వేయాలి. పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేయాలి. కరివేపాకు వేసి వేపాలి. ఇప్పుడు దానిలో ఉల్లిపాయలు వేసి ఓ రెండు నిమిషాలు వేయించుకోవాలి. దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా తిప్పాలి. ఇప్పుడు దానిలో మారినేట్ చేసుకున్న మటన్ వేసుకోవాలి. వాటిని బాగా కలిపి.. కుక్కర్ మూత పెట్టేయాలి. పది నిమిషాలు దీనిని ఉడికించాలి. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. పది నిమిషాలు ఉడికించిన తర్వాత దానిలో కొత్తిమీర, పుదీనా వేసి మరోసారి కలపాలి. 

పచ్చివాసన పోయేలా

ముందుగా తయారు చేసుకున్న పేస్ట్​ని  కర్రీలో వేసి కలపాలి. ఇప్పుడు దానిని 5 నిమిషాలు తిప్పుతూ కలపాలి. మసాలా కాస్త.. నూనెలు ఫ్రై అవుతూ ఉడుకుతుంది. ఇలా చేయడం వల్ల పచ్చి వాసన పోతుంది. గ్రేవీ ఉడికి ఆయిల్ పైకి తేలేవరకు ఉడికించాలి. మసాలా పేస్ట్ వేగిన తర్వాత దానిలో కాస్త నీరు వేయండి. దానిని బాగా కలిపి.. దానిలో సాల్ట్ వేసి కలిపి.. అది సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి దానిని 8 నుంచి 10 విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి. కుక్కర్ ప్రెజర్ అంతా పోయేవరకు వేచి చూడాలి.

ఏ కాంబినేషన్​కి అయినా..

కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత  మూత తీసి చూస్తే.. దానిలో నీరు ఎక్కువగా ఉందని అనిపిస్తే దానిని మరో రెండు నిమిషాలు మూత లేకుండా ఉడికించుకోవాలి. పర్​ఫెక్ట్​గా ఉంది అంటే మీరు స్టౌవ్ ఆపేసుకోవచ్చు. అంతే టేస్టీ టేస్టీ మటన్ గ్రేవీ కర్రీ రెడీ. దీనిని చపాతీలు, పూరీలు, రోటీలు, రైస్, బగారా రైస్ ఇలా దేనితోనైనా కాంబినేషన్​గా తీసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం. ఈ బోనాలకు మీరు కూడ ఈ టేస్టీ మటన్ కర్రీని ట్రై చేసేయండి. ఇది మీకు మంచి రుచిని అందిచడంతో పాటు.. బోనాలకు మంచి టేస్టీ ఎక్స్​పీరియన్స్ ఇస్తుంది. 

Also Read : లంచ్ బాక్స్ స్పెషల్ వెజిటేబుల్ బిర్యానీ.. కుక్కర్​లో టేస్టీగా, ఈజీగా ఇలా చేసేయండి

2024-07-06T07:56:17Z dg43tfdfdgfd