BAEL PLANT | మారేడు చెట్టు కింద ఆ పనిచేస్తే నిరుపేద కూడా సంపన్నుడవుతాడట..!

Bael Plant : హిందూధర్మంలో చెట్టును దైవంగా పూజిస్తారు. కొన్ని వృక్షాలు దేవతా వృక్షాలుగా కీర్తించబడుతాయి. ఇలా దేవతా వృక్షాలుగా కీర్తించబడే వాటిలో మారేడు చెట్టుకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. మారేడు చెట్టుని సంస్కృతంలో బిల్వ వృక్షం అంటారు. బిల్వ వృక్షం శివునికి అత్యంత ప్రీతికరమైనది. అందుకే మారేడు దళాలతో శివయ్యను పూజిస్తాం. బిల్వ పత్రంలోని మూడు ఆకులు శివుని మూడు కళ్ళకు ప్రతీకగా చెబుతారు.

లక్ష్మీదేవి తన కుడి చేతితో మారేడు చెట్టును సృష్టిందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే మారేడు వృక్షాన్ని శ్రీ వృక్షమని, మారేడు కాయలు శ్రీఫలాలని అంటారు. మారేడు చెట్టు ఎక్కడ ఉంటుందో లక్ష్మీదేవి అక్కడ ఉంటుందనేది చాలమంది విశ్వాసం. మన పురాణాల్లో చెప్పబడ్డ ఐదు లక్ష్మీ స్థానాల్లో మారేడు దళం కూడా ఒకటి. పువ్వులు పూయకుండానే కాయలు కాయడం మారేడు విశిష్టతగా చెప్పవచ్చు. అందుకే దీన్ని వనస్పతి అని కూడా పిలుస్తారు.

ముళ్ల చెట్లను ఇంట్లో పెంచుకుంటే శత్రు బాధలు ఎక్కువవుతాయని వాస్తు శాస్త్రం చెబుతుంది. కానీ ఈ దేవతా వృక్షానికి అటువంటి పట్టింపు ఏమీలేదు. ఇంటి ఆవరణలోని ఖాళీ ప్రదేశంలో తూర్పు, దక్షిణ దిక్కుల్లో మారేడు చెట్టును పెంచుకోవచ్చు. అంతేకాదు ఈ చెట్టు కింద ఓ పరిహారం చేస్తే కటిక పేదవాడు కూడా ధనవంతుడు అవుతాడట. ఇంట్లో లక్ష్మీదేవి తిరగాడుతుందట. పట్టిందల్లా బంగారమే అవుతుందట.

ఇంతకూ ఆ పరిహారం ఏమిటంటే.. చెట్టు మొదట్లో శుభ్రంచేసి మొదలుకు పసుపు అలంకరించి చుట్టూ తొమ్మిది ప్రదక్షిణలు చేయాలట. ఇలా చేస్తే కోటి మంది దేవతలకు ప్రదక్షిణ చేసిన పుణ్యఫలం లభిస్తుందట. అదేవిధంగా ఆ చెట్టు కింద పీటవేసి ఒక యోగ్యుడికి భోజనం పెడితే కోటి మంది దేవతలకు పూజ చేసిన పుణ్యం దక్కుతుందట. ఇలా మారేడు వృక్షాన్ని పూజించే ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందట. దాంతో కటిక పేదవాడు కూడా క్రమంగా సంపన్నుడిగా మారిపోతాడట.

కాగా, మారేడు దళాలతో శివునికి పూజ చేసేటప్పుడు ఈనెలను తీయాల్సిన అవసరం లేదు. ఈనెలను పట్టుకుని శివార్చన చేస్తారు. అయితే మారేడు దళాలను ఎప్పుడు పడితే అప్పుడు కోయకూడదట. దీనికి కొన్ని నియమాలు ఉన్నాయట. బుధ, శనివారాల్లో మాత్రమే మారేడు పత్రాలను కోయాలట. చతుర్దశి, అమావాస్య, పూర్ణిమ, అష్టమి తిథుల్లో కూడా బిల్వాలను కోయకూడదట. సంధ్యా సమయం, రాత్రి వేళళ్లో, శివరాత్రి రోజున కూడా మారేడు పత్రాలను కోయవద్దని చెబుతారు.

2024-07-07T11:40:43Z dg43tfdfdgfd