మామిడికి మంచిరోజులు

  • క్లస్టర్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాంకు పైలట్‌ ప్రాజెక్టుగా ఉమ్మడి జిల్లా ఎంపిక
  • మెగా క్లస్టర్‌గా రూ.200 కోట్లతో కార్యాచరణ
  • నాలుగేండ్లపాటు నిర్వహణ
  • విదేశాలకు ఎగుమతులపై ప్రత్యేక దృష్టి
  • దేశంలో 11 ప్రాంతాల వారీగా గుర్తింపు
  • కొల్లాపూర్‌, వనపర్తి మామిడి రైతులకు లాభాలే..

మామిడి పేరు చెబితేనే టక్కున గుర్తొచ్చేది కొల్లాపూర్‌, వనపర్తి.. ఇక్కడి రైతులు తోటలను విస్తారంగా పెంచుతుంటారు. ఇక్కడ పండే మామిడి పండ్లను చూస్తే నోరూరాల్సిందే.. రుచికరమైన ఫ్రూట్స్‌కు ఈ ప్రాంతం పేరొందింది. ఈ రెండు నియోజకవర్గాల్లో ఎక్కడ చూసినా మామిడి తోటలే కనిపిస్తాయి. ఈ ప్రాంతంలో పండే పండ్ల కోసం ఎందరో ఎదురుచూస్తుంటారు. విదేశాలతోపాటు జాతీయ స్థాయిలో ఇక్కడి పండ్లు గుర్తింపు పొందాయి.

అయితే ఈ తోటలు సాగు చేసిన రైతులకు మంచి రోజులు రాబోతున్నాయి. క్లస్టర్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం (సీడీపీ)కు ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లా పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపికైంది. దేశంలోని 11 రాష్ర్టాల్లో బాగా పండించే పంటలను గుర్తించి వాటిని విదేశాలకు ఎగుమతి చేసేలా కేంద్ర ప్రభుత్వం కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. గతేడాది నవంబర్‌ చివరి వారంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ ప్రాజెక్టు జిల్లాలో ప్రారంభం కావాల్సి ఉండగా.. ఎన్నికల కోడ్‌తో అమలుకు నోచుకోలేదు.

ఏడు ఉద్యాన పంటలకు గుర్తింపు

దేశంలోని 53 ఉద్యాన సమూహాలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం మొదటి దశగా పైలట్‌ బేసిన్‌లో ఏడు ఉద్యాన పంటలను ఎంపిక చేసింది. దేశ వ్యాప్తంగా 11 రాష్ర్టా ల్లో ఎంపిక చేసిన 12 జిల్లాల్లో పండే యా పిల్‌, మామిడి, అరటి, ద్రాక్ష, పైనాపిల్‌, దానిమ్మ, పసుపునకు కేంద్రం ఈ పథకం అమలు చేయాలని నిర్ణయించింది. ఇందు లో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జి ల్లా (మహబూబ్‌నగర్‌, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, గ ద్వాల, నారాయణపేట) మామిడిని ఎంపిక చేసి మె గా క్లస్టర్‌గా గుర్తించింది.

అయితే ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 57 వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉ న్నట్లు ఉద్యాన శాఖ రికార్డులు చెబుతున్నాయి. కా గా, వీటికి అదనంగా మరో 20 వేల ఎకరాల్లో మామిడి తోటలున్నట్లు అనధికార అంచనా.. అధికంగా వనపర్తి, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లోనే మామిడి తోటలు విస్తారంగా సాగు చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏటా 2.30 లక్షల టన్నుల మామిడి దిగుబడి ఉంటుందని ఉద్యాన శాఖాధికారుల అంచనా.

రూ.200 కోట్లతో అభివృద్ధి..

కేంద్ర ప్రభుత్వం మామిడి రైతులను ప్రోత్సహించి అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో సీడీపీ (క్లస్టర్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం)కు అడుగులు వేస్తున్నది. ఇందుకోసం కేంద్రం రూ.100 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. ఈ పథకం అమలుకు ప్రసాద్‌ సీడ్స్‌ ఏజెన్సీని ఎంపిక చేయగా.. ఈ కంపెనీ సైతం మరో రూ. 100 కోట్లను మామిడి అభివృద్ధికి జత చేయనున్నది.

ఇలా ఈ ప్రాజెక్టు అప్రూవల్‌ అయిన పలు దఫాలు శి క్షణలు సైతం పూర్తి చేశారు. అయితే, ఉమ్మడి జిల్లా లో మామిడి తోటలను పెంచిన దాదాపు 18,800 మంది రైతులను ఈ పథకంలో భాగస్వాములను చేయనున్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘం (ఎఫ్‌పీవో) ద్వారా దేశంలోని ఏడు రకాల పంటల సాగు విస్తీర్ణం.. దిగుబడులను పెంచడం, విదేశాలకు ఎగుమతులు.. సదుపాయాలు కల్పించి మంచి ధర వచ్చే లా ప్రోత్సాహం అందించనున్నారు.

నాలుగేండ్లపాటు ప్రాజెక్టు..

నూతనంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టు కాలపరిమితి నాలుగేండ్లుగా నిర్ణయించారు. గతంలో మామి డి సాగు చేసిన తోటలను పునరుద్ధరించడంతోపాటు కొత్త తోటల ఏర్పాటును సబ్సిడీతో ప్రోత్సహించనున్నారు. స్థానికంగానే మామిడి నర్సరీలు ఏర్పాటు చేయడం, కోల్డ్‌ స్టోరేజ్‌, మామిడి పండ్ల శుద్ధి యూనిట్‌, ప్రత్యేక ప్యాకింగ్‌ సిస్టం, కాయలను మాగబెట్టేందుకు గదులు, వేడినీటితో మామిడిని శుభ్రం చేసే ట్రీట్‌మెంట్స్‌ జరిగేలా చర్యలు తీసుకోబోతున్నా రు. వీటితోపాటు రైతులకు మామిడి సా గులో మెళకువలు, దిగుబడులు సాధించే చర్యలు, విదేశాలకు ఎగుమతి చేసేందుకు అవసరమైన మెళకువలను రైతులకు నే ర్పించేలా ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.

కొ త్తగా మొక్కలు నాటేందుకు కూడా రైతుల కు రాయితీలు ఇచ్చి నాలుగేండ్లపాటు ప్రో త్సాహం అందించనున్నారు. అంతర్జాతీ య మార్కెట్‌లో పోటీతత్వాన్ని పెంచి, మౌ లిక వసతులను అభివృద్ధి చేయడం, ఆధునిక పద్ధతులను అవలంభించేలా రైతులకు ప్రోత్సా హం అందిస్తారు. ప్రస్తుతం వస్తున్న నష్టాలను నివారించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం, విరివిగా రాయితీలను అందించడంతో రైతులకు సహకరిస్తారు. ప్రపంచ మార్కెట్లో ఎగుమతుల పోటీనీ పెంచడం కోసం నూతన విధానాలను వివరిస్తూ ఆదాయం పెంచేలా శిక్షణ ఇచ్చి తీర్చిదిద్దుతారు.

మామిడి మహారాజే..

అన్ని పండ్లకంటే మామిడి మహారాజు. మ్యాంగో సీజన్‌ వచ్చిందం టే, మిగతా పండ్ల వ్యాపారం తగ్గిపోతుంది. దేశంలోని ఇతర ప్రాంతా ల్లో ఉన్న మామిడికంటే ఉమ్మడి పా లమూరు మామిడికి ఏదీ సాటిరాదు. అందుకే ఈ ప్రాంత పండ్లను ప్రత్యేకంగా గుర్తించారు. ఉన్న తోటలను అభివృద్ధి చేయడం.. కొత్త వాటిని ఏర్పాటు చేయడం, మామిడికి అవసరమైన అన్ని చర్యలు తీసుకొని రైతులను ప్రోత్సహించాలన్నదే సీడీపీ పథక లక్ష్యం. ప్ర ధానంగా విదేశాలకు ఎగుమతులను చేపట్టి మంచి ధరలను వచ్చేలా నాలుగేండ్లపాటు రైతులకు అండగా ఉండి లా భాలను చేతికి అందిస్తారు. మామిడి తోటలను తొలగించవద్దు.. మంచి ఫలితాలు ఉంటాయి..

– సురేశ్‌,ఉద్యానశాఖ జిల్లా అధికారి, వనపర్తి

2024-07-14T23:23:55Z dg43tfdfdgfd