ఈ అమ్మవారిని ఆషాడమాసంలో దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరాల్సిందే..!!

అమ్మవారి నవరత్రి పూజలను ఎక్కువగా మనం దసరా నవరాత్రుల్లో చూస్తుంటాం..కానీ కరీంనగర్, జిల్లా నగునూర్ గ్రామములో ఉన్న శ్రీ పరివార సమేత దుర్గ భవాని అమ్మవారికి మాత్రం ఆషాడం మాసంలో నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు .శృంగేరి శ్రీ శారదా పీఠం వారి ఆధ్వర్యంలో పరివార సమేత శ్రీ దుర్గా భవాని నవరాత్రులు ఆషాడ మాసంలో 15 రోజుల పాటు అమ్మవారి ఉత్సవాలు చేస్తారు.

ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు రోజుకో రూపంలో భక్తులకు దర్శనం ఇస్తుంది. పవన్ లక్ష్మణ్ అనే వ్యక్తులకు అమ్మవారు కలలో కనిపించి ఆలయం కట్టించమని అడిగితే తన మిత్ర బృందంతో కలిసి ఈ ఆలయ నిర్మాణం చేపట్టారు.ఈ నిర్మాణం అంతా శృంగేరి శ్రీ శారదాపీఠం వారి ఆధ్వర్యంలోని వాళ్ళ సలహా సూచనల ప్రకారమే నిర్మించి దుర్గ దేవి అమ్మ వారితో పాటు సరస్వతి,గాయత్రి, ఎల్లమ్మ తల్లి పార్వతి దేవి..ఇలా అందరు దేవుళ్ళు మొత్తం ఒకే ఆలయంలో ఉండే విధంగా ఈ ఆలయాన్ని నిర్మించారు.

రూ.26 వేల జీతం.. SBIలో ఖాళీగా సెక్యూరిటీ గార్డుల ఉద్యోగాలు, అప్లై చేసుకోండిలా!

ఈ ఆలయ ప్రతిష్ట ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు ఆషాడ మాసం నవరోతోత్సవాలు బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలకు పాత్రలవుతున్నారన్నారు. ఆలయ ధర్మధికారి పురాణం మహేశ్వర శర్మ లోకల్ 18 తెలిపారు..ఈ ఆలయం అంతా శృంగేరి శ్రీ శారదా పీఠం వారి సలహా సూచన మేరకు ఆలయ ఫౌండర్ ఛైర్మన్ వంగల లక్ష్మణ్, వేములవాడ ద్రోణాచారి, ప్రభాకర్, శానగొండ మధుసూదన్, విజయేందర్ రెడ్డి. మిత్రులతో కలిసి ఈ ఆలయాన్ని నిర్మించారన్నారు. అప్పటి నుండి ఈ ఆలయంలో పూజలు దేదీప్యమానంగా చేస్తున్నారు. ఈ అమ్మవారిని దర్శించుకుంటే సకల కోరికలు తీరుతాయని కోరుకున్న వారికి కొంగుబంగారంగా అమ్మవారు కరుణిస్తున్నారని ఈ అమ్మవారి ఉత్సవాలు 15 రోజులు జరుగుతాయని గురు పౌర్ణమితో ఈ ఉత్సవాలు ముగుస్తాయని ఆలయ అధికారులు తెలిపారు.

2024-07-13T10:26:02Z dg43tfdfdgfd