SHIV LINGAM: శ్రావణంలో ఇలా లింగం తయారు చేసి పూజించండి.. శివపురాణం ప్రకారం తయారీ విధానమిదే

పవిత్రమైన సావన్ మాసం ప్రారంభం కాబోతోంది. ఈ నెల మొత్తం శివుడి ఆరాధనకు అంకితం చేయబడ్డ మాసం. హిందూ మతాన్ని విశ్వసించే శివ భక్తులు ఆయనను భక్తి శ్రద్ధలతో ఈ నెలంతా పూజిస్తారు. శ్రావణంలో శివుణ్ని ప్రార్థిస్తే కోరిక కోరికలన్నీ తీరతాయని నమ్ముతారు. శివారాధనలో భాగంగా భక్తులు అనేక ఆచార నియమాలు పాటిస్తారు. ఉపవాసాలు ఉంటారు. అయితే అలాంటి ఆచారాల్లో ఒకటి శివలింగ ఆరాధన. చేతితో తయారు చేసిన పార్థివ శివలింగం వల్ల శుభం జరుగుతుందని నమ్ముతారు. దాని గురించి తెల్సుకుందాం.

పార్థివ శివలింగం:

పార్థివ శివలింగం అంటే మట్టితో చేసిన శివలింగం అని అర్థం. శ్రావణ మాసంలో శివలింగాన్ని పూజించడం ద్వారా శివుడు సంతోషించి భక్తుడి కష్టాలన్నీ తొలగిస్తాడు. అయితే దీన్ని ఇంట్లోనే తయారు చేసుకోడానికి ఒక విధానం ఉంది. దీనికోసం కొద్దిగా మట్టి అవసరం. ఎటువంటి మురికి లేని మట్టిని శివలింగం తయారీకి ఉపయోగించాలి. ఒకవేళ మీ ఇంటి చుట్టు పక్కలా అలాంటి మట్టి దొరక్కపోతే కుండలు తయారు చేసే వాళ్ల దగ్గర నుంచి కాస్త మట్టి సేకరించవచ్చు.

లింగం తయారీ:

సేకరించిన మట్టితో లింగం తయారీకి గంగా జలాన్ని ఉపయోగించాలి. పుణ్య క్షేత్రాలకు వెళ్లినప్పుడు తెచ్చి ఇంట్లో పెట్టుకున్న జలాల్ని దీనికోసం వాడుకోవచ్చు. శుభ్రమైన మట్టి తీసుకుని అందులో గంగాజలం కలపాలి. లింగం మృదుత్వం కోసం కొద్దిగా ముల్తానీ మట్టి జతచేయవచ్చు. కొద్దిగా ఆవుపాలు, పెరుగు, నెయ్యి వేసి లింగం తయారీ మొదలుపెట్టాలి. ఒక బిల్వ పత్రం తీసుకుని దాని మీద లింగం తయారీ మొదలుపెట్టండి. మట్టితో సరైన ఆకారం రాకపోతే అందులో కొద్దిగా దూది వేసుకోవచ్చు. దాంతో లింగం చేయడం సులువవుతుంది. చేతులతో నెమ్మదిగా లింగం ఆకారం దిద్దుకుని శివలింగం తయారు చేసుకోవాలి. అంతే లింగం తయారీ పూర్తయినట్లే. మీకు ఆసక్తి ఉంటే లింగానికి పాము పడగలాగా కూడా ఆకృతిని తీర్చిదిద్దండి.

పూజ కోసం:

మీ శివలింగం సిద్ధమైన తర్వాత, దానిని ఒక ప్లేట్ లో ఉంచి పూజా మందిరంలో ప్రతిష్ఠించండి. శ్రావణ మాసం అంతటా దీనిని ఆరాధించండి. గంధం మరియు అక్షింతల సహాయంతో శివలింగాన్ని అలంకరించండి. సావన్ మాసంలో పార్థివ శివలింగ ఆరాధనకు విశేష ప్రాముఖ్యత ఉంది. దీన్ని మీ స్వంత చేతులతో తయారు చేసుకోండి. తయారు చేసేటప్పుడు శివుడిని జపిస్తూ ఉండండి.

2024-07-16T00:53:39Z dg43tfdfdgfd