రాత్రిపూట ఏం రాస్తే.. ఉదయానికి ముఖం మెరుస్తుందో తెలుసా..?

మీరు రాత్రి పడుకునే ముందు కొన్ని మీ ముఖానికి అప్లై చేస్తే.. ఉదయం కల్లా.. మీ ముఖం కాంతి వంతంగా మెరిసిపోతుంది. మరి.. ఈ అద్భుతం జరగాలంటే.. రాత్రి పడుకునే ముందు ఏం అప్లై చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

రాత్రికి రాత్రి ఎలాంటి అద్భుతాలు జరిగిపోవు అని చాలా మంది చెబుతూ ఉంటే మీరు వినే ఉంటారు. ఒక్క రాత్రిలో నిజంగా అద్భుతాలు జరగకపోవచ్చు.. కానీ.. మన ముఖంలో మార్పులు మాత్రం ఈజీగా చూడొచ్చు. అది కూడా అందంగా మార్చుకోవచ్చు . నమ్మసక్యంగా లేదా కానీ ఇది నిజం. మీరు రాత్రి పడుకునే ముందు కొన్ని మీ ముఖానికి అప్లై చేస్తే.. ఉదయం కల్లా.. మీ ముఖం కాంతి వంతంగా మెరిసిపోతుంది. మరి.. ఈ అద్భుతం జరగాలంటే.. రాత్రి పడుకునే ముందు ఏం అప్లై చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

1.బాదం నూనె..

బాదం నూనెను చాలా మంది.. జుట్టుుకోసం అప్లై చేస్తూ ఉంటారు. ఎందుకంటే.. దీనిలో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. అయితే.. దానికి మాత్రమే కాదు.. ముఖంలో గ్లో తేవడానికి కూడా సహాయపడుతుంది. మీరు రోజూ రాత్రి పడుకునే ముందు.. కొన్ని చుక్కల బాదం నూనె తీసుకొని.. మంచిగా ముఖానికి మసాజ్ చేయాలి.  ఇలా రాయడం వల్ల.. మీ ముఖం మాయిశ్చరైజ్డ్ గా ఉంటుంది. డ్రై స్కిన్ సమస్యను తగ్గిస్తుంది. చర్మానికి తెలియని ఓ గ్లో తీసుకువస్తుంది.  రెగ్యులర్ గా బాదం నూనెతో మసాజ్ చేస్తూ ఉంటే... ఫలితాలు మీకు క్లియర్ గా కనపడతాయి.

2.కలబంద గుజ్జ..

చాలా మంది జట్టు, చర్మ సౌందర్య సాదనల్లో భాగంగా.. కలబంద గుజ్జు రాస్తూ ఉంటారు. అయితే.. ఎక్కువగా పగలు దీనిని అప్లై చేస్తూ ఉంటారు. కానీ.. రాత్రిపూట రాయడం వల్ల ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి. రాత్రి పడుకునే ముందు.. ఈ గుజ్జు రాసి సున్నితంగా మసాజ్ చేసి.. అలానే వదిలేసి పడుకోవాలి. ఉదయం చూసే సరికి.. మీ చర్మంలో గ్లో వచ్చేస్తుంది. రెగ్యులర్ గా ట్రై చేయడం వల్ల.. మరింత మంచి ప్రయోజనాలు ఉంటాయి. చర్మం చాలా మృదువుగా మారుతుంది. మంచి అందాన్ని అందిస్తుంది.

3.పెరుగు..

పెరుగులో కాల్షియం, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. పెరుగు మన గట్ హెల్త్ ని ఇంప్రూవ్ చేస్తుంది. అయితే.. అవి మాత్రమే కాదు.. మన చర్మానికి అందాన్ని తీసుకురావడంలోనూ సహాయపడుతుంది. అందుకే.. రాత్రి పడుకునే ముందు.. కొంచెం పెరుగు తీసుకొని ముఖానికి రాసుకొని.. మంచిగా చర్మంలోకి ఇంకి పోయేలా మసాజ్ చేసుకోవాలి. అలానే పడుకోవాలి.. ఉదయానికి మంచి గ్లో తెస్తుంది.

4.రోజ్ వాటర్, చందనం..

చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడంలో చందనం, రోజ్ వాటర్ మనకు సహాయపడతాయి. మంచి  గ్లో కూడా తీసుకువస్తాయి, ఈ రెండూ మంచిగా కలిపి.. ముఖానికి పేస్ ప్యాక్ లా వేసుకోవాలి. తర్వాత శుభ్రం చేసుకొని.. పడుకుంటే.. ఉదయానికి క్లియర్ రిజల్ట్స్ తెలుస్తాయి.

5.పచ్చి పాలు..

పచ్చి పాలు కూడా మన సౌందర్యాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. దాని కోసం.. మనం రాత్రి పడుకునేముందు... పాలను టోనర్ లా వాడితే సరిపోతుంది. ట్యాన్ తొలగించడంలో  సహాయం చేస్తుంది. ఉదయానికి మంచి గ్లో కూడా రావడంలో సహాయపడుతుంది.

2024-07-02T08:24:24Z dg43tfdfdgfd