కొత్తగా పెళ్లైంది.. అత్తవారింట్లో అడుగు పెట్టగానే విగత జీవుడిగా భర్త.. ఏం జరిగిందంటే?

Wedding Tragedy: ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది అత్యంత మధురమైన ఘట్టం. యువతీ యువకులు ఎన్నో కలలు, ఆశలతో ఈ బంధంలోకి అడుగు పెడతారు. వివాహ వేడుక ముగియగానే కొత్త దంపతులు ఆనందకరమైన క్షణాలు గడపాలని ఆశపడతారు. అయితే ఇటీవల ఒక వధువుకు మాత్రం పెళ్లి ముగిసిన కొంత సేపటికే పెను విషాదం ఎదురైంది. ఆమె మెడలో తాళి కట్టిన భర్త వెడ్డింగ్ సెలబ్రేషన్స్ ముగిశాక ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో వధువు గుండెలవిసేలా రోదిస్తోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ఇటావా జిల్లా, రత్నపుర గ్రామంలో ఈ విషాదకరమైన సంఘటన జరిగింది.

బుధవారం, జులై 3న వరుడు సూసైడ్ చేసుకున్నాడు. వేడుక ముగిసిన తర్వాత, యువకుడు ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లి, ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది.

వివరాలు

చనిపోయిన వరుడి పేరు సతేంద్ర కుమార్‌ అని గుర్తించారు. అతడు పెళ్లి చేసుకున్న అమ్మాయి పేరు వినీత కుమారి. వరుడు వయసు కేవలం 24 ఏళ్లే. పెళ్లి ముగిసి, బరాత్‌తో ఊరికి చేరుకున్నాక వరుడు ఒక్కడే తన ఇంట్లోని ఒక గదిలోకి వెళ్లాడు. ఆ సమయంలో నవ వధువుని ఇంట్లోకి ఆప్యాయంగా ఆహ్వానించడానికి ప్రిపరేషన్ జరుగుతున్నాయి. కాసేపటికి వరుడు కనిపించట్లేదని కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే ఫోన్ చేశారు కానీ లిఫ్ట్ చేయలేదు. చివరికి ఒక గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడని తెలుసుకున్నారు. తలుపు తీసి చూడగా గదిలో సతేంద్ర ఉరి వేసుకుని విగత జీవిగా కనిపించాడు. పెళ్లి బట్టల్లోనే అతడలా చనిపోవడం చూసి కుటుంబ సభ్యులకు గుండె పగిలేలా ఏడ్చారు.

ఈ వార్తతో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఇరు కుటుంబాలు, అతిథులు కంటతడి పెట్టుకుంటున్నారు. ఉస్రాహార్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ మన్సూర్ అహ్మద్ తెలిపిన వివరాల ప్రకారం, పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఈ విషాద ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే సతేంద్ర మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

ఆత్మహత్యకు కారణాలు ఏంటి?

సతేంద్ర సూసైడ్ చేసుకోవడానికి గల కారణమేంటనేది ప్రస్తుతానికైతే తెలియ రాలేదు. భార్యతో నిండు నూరేళ్లు కలిసి ఉంటారని ప్రమాణం చేసిన కొంతసేపటికే అతడు ఆమెను వదిలేసి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం చాలా బాధాకరం. వధువు వినీతా కుమారి, ఆమె కుటుంబ సభ్యులు ఈ నిజాన్ని జీర్ణించుకోలేక కుమిలిపోతున్నారు. సమాధానం లేని ప్రశ్నలతో దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. ఈ శుభకార్యం హఠాత్తుగా విషాదాంతం కావడం వల్ల వారు తల్లడిల్లిపోతున్నారు. సతేంద్ర ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో తెలుసుకునేందుకు అధికారులు విచారణ జరుపుతున్నారు.

బాధల్లో సాయం కోరవచ్చు

మానసిక బాధలు తీవ్రమైనప్పుడు క్షణికావేశంలో, లేదంటే ఏదో ఒక సందర్భంలో ప్రజలు ఆత్మహత్య చేసుకోవడానికి మొగ్గుచూపుతారు. అయితే ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి ముందు వారిలో ఏదో ఒక దిగులు కనిపిస్తుంది. ఇలాంటి సంకేతాలను ఎప్పటికప్పుడు గుర్తించాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులకు ఉంది. మన అనుకున్న వాళ్లందరినీ తీవ్ర విషాదంలో ముంచేసి వెళ్లడం వల్ల వచ్చేది ఏమీ ఉండదని సూసైడ్ థాట్స్ వచ్చేవారు అర్థం చేసుకోవాలి.

మరీ నిస్సహాయక పరిస్థితుల్లో ఉంటే ఆస్రా (ముంబై) 022-27546669, స్నేహ (చెన్నై) 044-24640050, సుమైత్రి (ఢిల్లీ) 011-23389090, కూజ్ (గోవా) 0832- 2252525, జీవన్ (567) 048-42448830, మైత్రి ( కొచ్చి) 0484-2540530, రోష్ని (హైదరాబాద్) 040-66202000, లైఫ్‌లైన్ 033-64643267 (కోల్‌కతా) హెల్ప్‌ లైన్స్‌కి కాల్‌ చేయవచ్చు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్‌కి సహాయం చేయడానికి కూడా ఈ నంబర్లకు ఫోన్ చేయవచ్చు.

2024-07-05T13:54:49Z dg43tfdfdgfd