PERIODS IN SPACE: స్పేస్‌లో పీరియడ్స్ వస్తే మహిళా వ్యోమగాములు ఏం చేస్తారు..?

ఒక వయసుకు వచ్చిన తర్వాత మహిళలకు పీరియడ్స్‌ రావడం కామన్. నెలసరి కారణంగా నెలలో మూడు నుంచి ఏడు రోజుల వరకు ఇబ్బందిగా ఫీల్ అవుతారు. బ్లీడింగ్ వంటి శారీరక అసౌకర్యాన్ని మాత్రమే కాకుండా, మానసిక మార్పులు, ఆందోళన, చిరాకు వంటివి ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి అంతరిక్షంలోకి వెళ్లిన మహిళలకు పీరియడ్స్ వస్తే జరుగుతుంది అని ఎప్పుడైనా ఆలోచించారా? ఈ రోజుల్లో చాలామంది మహిళలు అంతరిక్షానికి ప్రయాణిస్తున్నారు. ఇక్కడే నెలల తరబడి ఉంటున్నారు. మరి స్పేస్‌లో మహిళా వ్యోమగాములకు పీరియడ్స్ వస్తే ఏం జరుగుతుంది? ఈ పరిస్థితిని వారు ఎలా ఎదుర్కొంటారు?

సోవియట్ కాస్మోనాట్ వాలెంటీనా తెరేష్కోవా 1963లో అంతరిక్షంలోకి వెళ్లి ఆ ఘనత సాధించిన మొదటి మహిళగా అవతరించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 60 మందికి పైగా మహిళలు అంతరిక్షయానం చేశారు. అయితే వారు అంతరిక్షంలో పీరియడ్స్ ఎలా మేనేజ్ చేసుకున్నారనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్‌గా మిగిలిపోయింది. గతంలో మహిళలు అంతరిక్షంలోకి వెళ్లకుండా ఆపడానికి పీరియడ్స్‌ను ఒక కారణంగా ఉపయోగించారు.

1964లో కొంతమంది పరిశోధకులు ఈ విషయంపై స్పందించారు. మైక్రోగ్రావిటీ మెన్‌స్ట్రువల్ బ్లడ్‌ను శరీరంలోకి వెనుకకు ప్రవహించేలా చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళా మద్దతుదారులు మాత్రం ఆడవారికి కూడా అంతరిక్షంలోకి వెళ్లే అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నాసా మొదటి మహిళా వ్యోమగాములలో ఒకరైన రియా షెడ్డోన్ మాట్లాడుతూ, "ఇది సమస్యగా మారే వరకు సమస్య లేనిదిగా పరిగణించమని మేం వారికి చెప్పాం. స్పేస్‌లో ఎవరికైనా హెల్త్ ప్రాబ్లమ్ వస్తే, వారిని తిరిగి తీసుకురావచ్చు. భూమిపై చికిత్స తీసుకోవచ్చు." అని వివరించారు.

* స్పేస్‌లో పీరియడ్స్‌ను ఎలా ఎదుర్కొంటారు?

1983లో సాలీ రైడ్ స్పేస్‌లోకి వెళ్లిన మొదటి అమెరికన్ మహిళగా రికార్డు సృష్టించారు. అయితే అప్పటి వరకు స్పేస్‌లో టాంపోన్లు, శానిటరీ నాప్‌కిన్ల వాడకం గురించి నాసా ఆలోచించలేదు. అయితే అంతరిక్షంలో ఉన్నప్పుడు కూడా మహిళా వ్యోమగాములకు పీరియడ్స్‌ వస్తాయి, బ్లీడింగ్ అవుతుంది. పీరియడ్స్ సమయంలో రక్తం ఫెలోపియన్ ట్యూబ్‌ల ద్వారా వెనక్కి ప్రవహించి కడుపులోకి వెళ్లదు. ఇప్పటివరకు స్పేస్ ట్రావెలర్స్ మైక్రోగ్రావిటీలో ఎలాంటి పీరియడ్స్ సమస్యలను హైలెట్ చేయలేదు.

* ఉమెన్ స్పేస్ ట్రావెలర్ల ఇష్టం

స్పేస్‌లో ఫిమేల్ ఆస్ట్రోనాట్స్‌ తప్పనిసరిగా పీరియడ్స్‌ ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిన అవసరం లేదు. తమ మిషన్ సమయంలో పీరియడ్స్‌ రాకుండా మందులు వాడొచ్చు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ISS)లో కొన్ని వేస్ట్ డిస్పోజల్ సిస్టమ్స్ రక్తాన్ని మేనేజ్ చేయగలవు, కానీ వాటిని మూత్రం కోసమే డిజైన్ చేశారు. అయితే ట్యాంపాన్లు, శానిటరీ ప్యాడ్ల లాంటివి అంతరిక్షానికి తీసుకెళ్లడం వల్ల స్పేస్ క్రాప్ట్ బరువు ఎక్కువవుతుంది. అంతేకాకుండా, అంతరిక్షంలో క్లీనింగ్‌కు నీరు పరిమితంగా ఉంటుంది. అలానే గాల్లో తేలియాడుతూ ఉండగా ప్యాడ్లు లేదా టాంపోన్లు మార్చుకోవడం కష్టం.

* ఇతర మార్గాలు

పీరియడ్స్‌ రాకుండా ఉండాలని నిర్ణయించుకుంటే, గర్భనిరోధక మాత్రలు వాడవచ్చు. చాలామంది మహిళలు స్పేస్ జర్నీలో పీరియడ్స్‌ రాకుండా ఉండేందుకు "కంబైన్డ్" కాంట్రాసెప్టివ్ పిల్స్ ఉపయోగిస్తారట. ఈ మాత్రలు మూడు వారాల పాటు వరుసగా తీసుకుంటారు, దీనివల్ల నాలుగో వారంలో పీరియడ్స్‌ వస్తుంటాయి. కానీ, ఆస్ట్రోనాట్స్‌ రక్తస్రావం ఆగిపోవడానికి వరుసగా తీసుకోవచ్చు.

---- Polls module would be displayed here ----

ఆరోగ్యంగా ఉండే మహిళలకు ఇలా చేయడం వల్ల ఎలాంటి హానికరమైన దుష్ప్రభావాలు ఉండవు. మెన్‌స్ట్రుయేషన్ అయ్యే ఆస్ట్రోనాట్స్ అంగారక గ్రహం లాంటి ఎక్కువ కాలం ఉండే ప్రయాణాలకు 1100 మాత్రలు వరకు తీసుకోవాలి. పిల్స్ తీసుకెళ్తే టాబ్లెట్స్ ప్యాకింగ్‌ను పారవేయడం, ఎక్స్‌ట్రా వెయిట్ భరించడం వంటి సవాళ్లు ఉంటాయి. వీటి వల్ల ఖర్చు పెరుగుతుంది.

పీరియడ్స్‌ రాకుండా ఉండే మరో మార్గం "LARCs". అంటే లాంగ్-యాక్టింగ్ రివర్సబుల్ కాంట్రాసెప్టివ్స్‌. ఇవి ఎక్కువ కాలం పనిచేసే, తిరిగి ఉపయోగించగలిగే గర్భనిరోధకాలు. కానీ, అవి అంతరిక్షంలో ఎంత సురక్షితంగా పనిచేస్తాయో తెలుసుకోవడానికి మరిన్ని పరిశోధనలు అవసరం. అంతరిక్షంలో గర్భనిరోధక మాత్రలు వాడటం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మైక్రోగ్రావిటీ వల్ల మగ, ఆడ అంతరిక్ష యాత్రికులు ఎముకల దృఢత్వాన్ని కోల్పోతారు. గర్భనిరోధక మాత్రలలో ఉండే ప్రధాన ఔషధం "ఈస్ట్రోజెన్" ఎముకల దృఢత్వానికి అవసరమవుతుంది. స్పేస్ జర్నీలలో మహిళలకు ఇది మంచిది.

2024-07-02T02:41:15Z dg43tfdfdgfd