ఉచిత సుదర్శన యోగా తరగతులు.. ఎక్కడంటే..?

ప్రస్తుతం జీవన విధానంలో చాలా మార్పులు వచ్చాయి. ఆ మార్పులకు అనుగుణంగానే మనిషిలో శాంతి, ప్రేమ కరువైంది. వీటి స్థానంలో కోపం, పగ, అసూయలు ఏర్పడి.. అనారోగ్య బారిన పడేలా చేస్తున్నాయి. మరో పక్క జీవన విధానంలో తేడాలు రావటంతో తీవ్ర ఉద్వేగానికి లోనై... మానసిక ఒత్తిడికి గురై పతనానికి దగ్గర అవుతున్నాడు. వీటి అన్నింటిని నియంత్రించుకోవాలంటే మనిషిగా మొదటగా తన గురించి తాను ఆలోచించుకునే శక్తి కావాలి. తను ఏం చేస్తున్నానో తెలియాలి. తను ఈ మానసిక రుగ్మతల నుంచి ఎలా బయటపడాలో ఆలోచించాలి. అందుకే ఇప్పుడు మన చూట్టూ మెడిటేషన్ సెంటర్లు వెలిశాయి. తద్వారా కాస్త అయినా మానసిక రుగ్మతలనుంచి బయటపడచ్చు. అందుకే ఓ వ్యక్తి యోగా సెంటర్ ని నడిపిస్తున్నారు. ఆ వివరాలేంటో చూడండి.

శ్రీకాకుళంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారి ఆధ్వర్యంలో ప్రత్యకంగా మనిషి సంతోషంగా ఉండటానికి, నిత్యజీవితంలో ఉండే ఒత్తిడిని ఎదుర్కొవడానికి ఆరు రోజులు పాటు ఉచితంగా యోగా శిక్షణ అన్ని వయసుల వారికి ఇస్తున్నారు. ఎక్కడ, ఆ వివరాలేంటో లోకల్ 18 ద్వారా తెలుసుకుందాం పదండి. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారికి వారి వయసుకు తగ్గట్టుగా ఏదో ఒక భయాలు, అపోహలు బాధలు ఇబ్బందులు శారీరకంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులతో బాధపడుతున్నారు. ఇప్పటి ఆధునిక జీవన విధానం ఒత్తిడిని ఎదుర్కోవాలి అంటే ఆర్ట్ ఆఫ్ లివింగ్ వారి హ్యాపీనెస్ యోగాభ్యసన ఎంతో బాగా పనిచేస్తుందనే చెప్పాలి.

---- Polls module would be displayed here ----

ప్రస్తుత ఆధునిక జీవన విధానంలో ఏ టైంకి భోజనంచేస్తున్నామో ఎప్పుడు పడుకుంటున్నామో ఎప్పుడు తింటున్నామో ఒక పద్ధతి లేకుండా ఉంటుంది ఈ జీవన విధానం. వీటి అన్నింటి వలన వచ్చే దీర్ఘకాల వ్యాధులు వీటి బారిన పడకుండా ఉండాలి అంటే యోగాసనాల్లో ప్రాణాయామం, ధాన్యం, సుదర్శన క్రియ మొదలగునవి నిజ జీవితంలో రోజు అభ్యసించడం వల్ల ఒత్తిడిని జయించవచ్చు అని ఆర్ట్ ఆఫ్ లివింగ్ సభ్యుడు మూర్తి తెలియజేసారు.

శ్రీకాకుళంలో పీ.ఎన్ కాలనీలో ఉన్న మూర్తి గత 20 సంవత్సరాలుగా సుదర్శన క్రియ అనే యోగ ప్రక్రియ ద్వారా తనలో ఉన్న ఒత్తిడిని, బీపీ, ఆయాసం వంటి వ్యాధులు కొంత వరకు తగ్గించుకున్నామని లోకల్ 18 కు తెలిపారు. ప్రతి ఆదివారం ఉచితంగా సుదర్శన క్రియ యోగాను తన తోటివారికి ఉచితంగా నేర్పిస్తు జీవితంలో ఉండే భయాలు, ఒత్తిడి తగ్గించుకోవడం.. శరీర ఆరోగ్యం ఎలా మెరుగు పరుచుకోవటంలో ఆర్ట్ఆఫ్ లివింగ్ హ్యాపీనెస్ అనే ప్రోగ్రాం ద్వారా తెలియజేస్తున్నారు.

2024-07-01T11:53:45Z dg43tfdfdgfd