TEA COFFEE SIDE EFFECTS: టీ-కాఫీలు తాగితే లివర్ పాడవుతుందా లేదా, వైద్యులేమంటున్నారు

Tea Coffee Side Effects: టీ-కాఫీ అనేది రోజువారీ జీవితంలో భాగంగా మారిపోయింది. ఎంతగా అంటే ఫ్రెండ్స్ లేదా కొలీగ్స్‌తో చిట్‌చాట్ చేసేటప్పుడు, రిలాక్స్ సమయంలో ఇలా సందర్భం ఏదైనా సరే టీ తాగడం మాత్రం కామన్. అయితే ఇలా తరచూ టీ, కాఫీలు తాగడం వల్ల లివర్ ఆరోగ్యంపై దుష్ప్రభావం పడుతుందంటారు.. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

టీ- కాఫీల్లో కెఫీన్ అనే పదార్ధం ఉంటుంది. ఇది మనల్ని ఉత్తేజితం చేస్తుంది. అంతేకాకుండా తేయాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, కాఫీలో ఉండే పోషకాలు శరీరానికి లాభం చేకూరుస్తాయి. లివర్ అనేది శరీరంలో అతి ముఖ్యమైన అంగం. లివర్ ఎంత ముఖ్యమైందంటే ఇందులో ఏ చిన్న సమస్య తలెత్తినా మొత్తం శరీరంలోని అన్ని వ్యవస్థలపై ప్రభావం పడుతుంది. అందుకే లివర్ ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలి. టీ విషయానికొస్తే గ్రీన్ టీ చాలా ప్రయోజనకరం. గ్రీన్ టీలో కెటేచిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి లివర్‌ను హెల్తీగా ఉంచుతాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడుతుంది. కానీ మిల్క్ టీ ఎక్కువగా తాగితే కడుపులో ఎసిడిటీ పెరుగుతుంది. అది కాస్తా లివర్ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. అలాగని కేవలం మిల్క్ టీ ఒక్కటే కాదు...హెర్బల్ టీ కూడా లివర్‌ను పాడు చేస్తుంది. 

ప్రతి మనిషి లివర్‌లో ఫ్యాట్ 5 శాతముంటుంది. ఈ ఫ్యాట్ 5 శాతం కంటే ఎక్కువైతే శరీరానికి ప్రమాదకరం. ఈ క్రమంలో టీ లేదా కాఫీ ఎక్కువగా తాగితే శరీరంలో విష పదార్ధాలు పెరిగిపోతాయి. ఫలితంగా లివర్ స్వెల్లింగ్ సమస్య తలెత్తుతుంది.

కాఫీతో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇందులో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్లు లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. నిర్ణీత పద్ధతిలో కాఫీ తాగడం వల్ల లివర్ సిరోసిస్, లివర్ కేన్సర్ వంటి లివర్ సంబంధిత వ్యాధుల ముప్పు తగ్గుతుంది. అయితే కెఫీన్ అధికమైతే ఆరోగ్యానికి హాని చేకూరుతుంది. కెఫీన్ ఎక్కువైతే నిద్ర కూడా పాడవుతుంది. గుండె వేగం పెరుగుతుంది. అందుకే కాఫీ పరిమితికి మించి తాగకూడదు. కాఫీ మితంగా తాగితే లివర్‌కు ఉపయోగకరం కాగా అతిగా తీసుకుంటే అనర్ధాలు కలుగుతాయి. కానీ పరగడుపున మాత్రం టీ లేదా కాఫీ తాగకూడదు. 

టీ లేదా కాఫీనే కాదు ఏదీ అతిగా సేవించకూడదు. టీ లేదా కాఫీ రోజుకు 2 కప్పుల కంటే అధికంగా తాగకూడదు. ఎక్కువైతే మాత్రం కడుపు సంబంధిత సమస్యలు, ఇన్‌సోమ్నియా, అధిక రక్తపోటు వంటి సమస్యలు ఉత్పన్నమౌతాయి.

Also read: Prostate Cancer Signs: బాడీలోని ఈ 3 భాగాల్లో సమస్య ఉంటే ప్రోస్టేట్ కేన్సర్ కావచ్చు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

2024-07-04T09:27:35Z dg43tfdfdgfd