మార్కెట్లో దొరికే ఫ్రోజెన్ వెజిటబుల్స్‌ను తింటున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి

Frozen Vegetables:  సాధారణంగా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు వంటివి ఎక్కువ కాలం నిల్వ ఉండవు. అందుకే వీటిని ఫ్రిజ్‌లో పెట్టి స్టోర్ చేస్తారు. అయితే పూర్తిగా పండకముందే కోసిన కూరగాయల్లో పోషక విలువలు తగ్గవచ్చు. అందుకే అవి పూర్తిగా పక్వానికి వచ్చిన తర్వాతే కోసి, నిల్వచేయడానికి ఫ్రీజింగ్ చేయవచ్చు. అంటే అతిశీతల ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేస్తారు. వాటిని ప్యాకింగ్ చేసి అమ్ముతారు. ఇప్పుడు ఇలాంటి ఫ్రోజెన్ వెజిటేబుల్స్‌ (Frozen vegetables) కూడా మార్కెట్లలో లభిస్తున్నాయి.

తాజా కూరగాయల ధర కాలానుగుణంగా మారుతుంది. ఫ్రోజెన్ ఐటమ్స్‌ ధర స్థిరంగా ఉంటుంది. వీటిని ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు, దీనివల్ల వృథా తగ్గుతుంది. అయితే తాజా, ఫ్రోజెన్ వెజిటేబుల్స్ మధ్య ఐదు ముఖ్యమైన తేడాలు తెలుసుకుందాం.

పోషకాలు

ఫ్రోజెన్ వెజిటేబుల్స్‌ను ప పోషక విలువలు బాగా పెరిగిన స్థితిలో కోస్తారు. పోషకాలను నిలుపుకోవడానికి వాటిని త్వరగా వేడి నీటిలో ముంచి ఫ్రీజ్ చేసి ఉంచుతారు. ఫ్రోజెన్ వెజిటేబుల్స్‌లో పోషక విలువ తాజా కూరగాయల కంటే ఎక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. గడ్డకట్టే ప్రక్రియ విటమిన్లు, ఖనిజాలను సంరక్షిస్తుంది.

రుచి

తాజా కూరగాయల రుచి బాగుంటుంది, వంటకాలకు క్రిస్పీనెస్ వస్తుంది. అయితే ఫ్రోజెన్ వెజిటేబుల్స్‌ ఉడికించిన తర్వాత వాటి ఆకృతి మారిపోతుంది, సాఫ్ట్‌గా తయారవుతాయి. అయితే సరిగా వండితే ఇవి కూడా టేస్టీగా ఉంటాయి. టేస్ట్ విషయంలో తేడా సాధారణంగా చాలా తక్కువగా ఉంటుంది.

కన్వీనియన్స్

తాజా కూరగాయలను వండే ముందు కడగడం, తోలు తీయడం, ముక్కలుగా కోయడం అవసరం. వాటికి షెల్ఫ్ లైఫ్ తక్కువగా ఉంటుంది, చెడిపోకుండా ఉండటానికి వాటిని త్వరగా తినాలి. అయితే ఫ్రోజెన్ వెజిటేబుల్స్‌ ఆల్రెడీ కడగి, ముక్కలుగా కోసి, వండడానికి సిద్ధంగా ఉంటాయి. ఇవి బిజీగా ఉండే వ్యక్తులకు బెస్ట్ ఆప్షన్ అవుతాయి. వాటికి షెల్ఫ్ లైఫ్ ఎక్కువగా ఉంటుంది. వాటి పోషక విలువను కోల్పోకుండా నెలల తరబడి నిల్వ చేయవచ్చు. ఈ కన్వీనియన్స్ ఫుడ్ వేస్టేజీని తగ్గిస్తుంది.

పర్యావరణ ప్రభావం

తాజా కూరగాయలకు రవాణా, నిల్వ కోసం ఎక్కువ వనరులు అవసరం కావచ్చు. అవి చెడిపోయే అవకాశం కూడా ఎక్కువ, ఫలితంగా ఫుడ్ వేస్టేజీ పెరిగిపోతుంది. ఫ్రోజెన్ వెజిటేబుల్స్‌ ఎక్కువ షెల్ఫ్ లైఫ్ కలిగి ఉండటం వల్ల, ఫుడ్ వేస్టేజీని తగ్గిస్తాయి. ఇవి ఎకోఫ్రెండ్లీ ఫుడ్ ఆప్షన్స్ అవుతాయి. అయితే గడ్డకట్టే ప్రక్రియ, నిల్వకు శక్తి అవసరం.

ధర, లభ్యత

తాజా కూరగాయల ధర ఎక్కువగా ఉండవచ్చు. అన్‌సీజన్‌లో అయితే కాస్ట్ మరీ ఎక్కువగా ఉంటుంది. అవి అన్ని ప్రాంతాలలో సులభంగా అందుబాటులో ఉండకపోవచ్చు. కొన్ని రకాల వెజిటబుట్స్‌ను ఇతర ప్రాంతాల నుంచి లేదా దేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి. అయితే ఫ్రోజెన్ వెజిటేబుల్స్‌ సాధారణంగా తక్కువ ధరల్లో లభిస్తాయి. సంవత్సరం పొడవునా అందుబాటులో ఉంటాయి. సీజన్‌తో సంబంధం లేకుండా హెల్తి ఫుడ్ తినాలనుకునే వారికి ఇవి బడ్జెట్-ఫ్రెండ్లీ ఆప్షన్ అవుతాయి.

ఏది మంచిది?

ఈ రెండింటిలో దేని ప్రత్యేకతలు దానికి ఉంటాయి. అయితే తాజా కూరగాయలు వండితే ఫుడ్ టేస్ట్, టెక్చర్ బాగుంటుంది. ఫ్రెష్‌గా తిన్న ఫీల్ వస్తుంది. కాకపోతే వీటి ధర ఎక్కువ. ఫ్రోజెన్ వెజిటేబుల్స్‌లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి, కాకపోతే టేస్ట్ కొంచెం తగ్గవచ్చు. ధర కూడా తక్కువే ఉంటుంది. ఇవన్నీ పరిశీలించి మీకు ఏది మంచిదనేది మీరే నిర్ణయించుకోవచ్చు.

2024-07-04T14:20:48Z dg43tfdfdgfd