తోటకూర తింటే షుగర్ కంట్రోల్ అవుతుందా..

ఆకుకూరల్లో తోటకూర కూడా ఒకటి. దీనిని తినడం వల్ల చాలా లాభాలే ఉంటాయి. అవేంటో తెలుసుకోండి.

ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచివి. అందులో బచ్చలికూర, మెంతి కూర, తోటకూర, గోంగూర చాలానే ఉంటాయి. ఇందులో తోటకూర గురించి తెలుసుకుందాం. దీనిని తినడం వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకోండి. తోటకూర..

తోటకూర చాలా రుచిగా ఉంటుంది. అంతే హెల్దీ కూడా. ఇది ఎరుపు, ఆకుపచ్చ, ఊదా రంగుల్లో కూడా కనిపిస్తుంది. దీనిలో కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఐరన్, విటమిన్ ఎ వంటి అవసరమైనన్నీ పోషకాలు ఉన్నాయి. దీనిని తీసుకోవడం వల్ల రక్త ఉత్పత్తి పెరిగి ఎముకలు దృఢంగా మారతాయి. అంతేకాకుండా షుగర్ వ్యాధి కంట్రోల్‌లో ఉంటుంది.

ఆకుకూరలు తింటే కలిగే లాభాలు..​ ​

ఎముకలకి బలం..

ఎముకల్ని బలాన్ని అందించంలో, కీళ్ళనొప్పులని దూరం చేయడంలో ఆకుకూరలు హెల్ప్ చేస్తాయి. మరీ ముఖ్యంగా, కాల్షియం, మెగ్నీషియం, జింక్, కాపర్ వంటి ఖనిజాలు ఎముకల్ని దృఢంగా చేసి సమస్యల్ని తగ్గిస్తుంది. ​Also Read : 60లో యూరిక్ యాసిడ్ లెవల్స్ పెరగొద్దొంటే ఇలా చేయండి..

షుగర్ లెవల్స్..

రక్తంలో షుగర్ లెవల్స్‌ని తగ్గించడంలో మెంతులు హెల్ప్ చేస్తాయి. ఈ ఆకుల్లోని పదార్థాలు శరీరంలో ఇన్సులిన్‌ని సరైన మొత్తంలో బ్యాలెన్స్ చేస్తాయి. చక్కెర జీవక్రియని మెరుగ్గా చేస్తాయి. దీని వల్ల రక్తంలోని అదనపు చక్కెర శరీరంలోని కణాల్లోకి వెళ్ళి షుగర్ లెవల్స్‌ని ఒక్కసారిగా పెంచదు. దీంతో షుగర్ పేషెంట్స్‌ రక్తంలో చక్కెర కంట్రోల్ అవుతుంది.

రక్తహీనత..

తోటకూరలో ఐరన్, విటమిన్ సి, బి9 వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది రక్త హీనత సమస్యని దూరం చేస్తుంది. దీనిని రెగ్యులర్‌గా తీసుకుంటే అలసట, బలహీనత, కళ్ళు తిరగడం, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలు తగ్గుతాయి. ​Also Read : Diabetes : షుగర్ ఉంటే బరువు తగ్గుతారా.. నిజాలివే..

జీర్ణ వ్యవస్థకి..

ఈ తోటకూరని తీసుకుంటే జీర్ణక్రియ మెరుగవుతుంది. దీనిని తినడం వల్ల కడుపు నొప్పి, అజీర్ణం, మలబద్ధకం, గ్యాస్, గుండెల్లో మంట, విరోచనాలు, యాసిడ్ రిఫ్లక్స్ వంటి అనేక జీర్ణ సమస్యలు దూరమవుతాయి. ఇది జీర్ణ వ్యవస్థని బలంగా చేసి పోషకాలను అందిస్తుంది. దీంతో పాటు గ్యాస్ట్రిక్ సమస్యని కూడా దూరం చేస్తుంది.

గుండె ఆరోగ్యం..

తోటకూర ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ గుండెని ఆరోగ్యంగా ఉంచి గుండె సంబంధిత సమస్యల్ని దూరం చేస్తాయి. రక్తపోటుని కంట్రోల్ చేస్తుంది. గుండె కండరాలని బలంగా చేసి రక్త కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుంది. దీంతో గుండెపోటు, రక్తం గడ్డకట్టే ప్రమాదం తగ్గుతుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఇవి పాటించడం వల్ల ఫలితాలు అనేవి వ్యక్తిగతం మాత్రమే. వీటిని పాటించే ముందు డైటీషియన్‌ని సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Read More : Health News and Telugu News

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-06-24T05:45:08Z dg43tfdfdgfd