డిగ్రీ చదివారా.. మీకు అదిరిపోయే శుభవార్త, ఈ ఛాన్స్ మిస్ అవ్వొద్దు!

విద్యా వజ్రాయుధం లాంటిది. ప్రభుత్వాలు విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నాయి. ప్రతి ఒక్క విద్యార్థికి మెరుగైన విద్యను అందించాలనే ఉద్దేశంతో ముందుకు వెళుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు,గురుకుల పాఠశాలలు, కస్తూరిబా గాంధీ, మోడల్ స్కూల్స్ వంటి పాఠశాలల్లో అనేకమంది విద్యార్థులు ఉచిత విద్యను అభ్యసిస్తున్నారు.

ఇటు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3,గ్రూప్ 4, ఎస్సై, కానిస్టేబుల్ ఇతర పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ,ఎస్సీ,స్టడీ సర్కిల్స్ ఆధ్వర్యంలో అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందజేస్తున్నారు. ఈ స్టడీ సర్కిల్స్ ద్వారా ఎంతో మంది అభ్యర్థులు ఉచితంగా శిక్షణ పొందుతున్నారు. ఎంతోమంది అభ్యర్థులు సైతం ఇందులో శిక్షణ తీసుకుని మెరుగైన ఫలితాలు పొంది ఉద్యోగాలను కూడా సాధించారు.

ఈ బిజినెస్‌తో నెలకి రూ.లక్ష సంపాదించొచ్చు.. డబ్బుల వర్షం కురిపించే ఐడియా..

అయితే రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి సంస్థ అధ్యయన కేంద్రంలో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యుపిఎస్సి) సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశానికి సంబంధించిన నిర్వహించే ప్రిలిమినరీ పరీక్షకు ఎస్సీ,ఎస్టీ, బీసీ,మైనార్టీ వర్గాల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లా ఎస్సీ స్టడీ సర్కిల్ రీజినల్ కోఆర్డినేటర్ జగన్మోహన్ ఒక ప్రకటన విడుదల చేశారు. డిగ్రీ ఉత్తిర్ణులై వార్షిక ఆదాయం రూ:3 లక్షలు మించకుండా ఉన్నవారు ఇందుకు అర్హులు అన్నారు. ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థులు tsstudycircle.co.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జులై 10వరకు ఇందుకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ఉందన్నారు.

మీరు తాగే పాలు మంచివేనా? యూరియా, డిటర్జెంట్ కలిపారేమో క్షణాల్లో తెలుసుకోండిలా!

గతంలో కూడా తమ స్టడీ సర్కిల్ ద్వారా పలు పోటీ పరీక్షలకు సన్నదమయ్యే ఎంతోమంది అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించామని తెలియజేశారు. ప్రతి సంవత్సరం వందలాది మంది అభ్యర్థులు ఇందులో శిక్షణ తీసుకొని ఉత్తమ ఫలితాలు సాధించి ఉద్యోగాలను పొందారు. ఎందరో ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ లుగా రాణించారని పేర్కొన్నారు. యూపీఎస్సీకి నిర్వహించే ఉచిత శిక్షణకు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు తమ సంబంధిత వెబ్సైట్లో చూడాలన్నారు అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.

2024-07-04T04:49:22Z dg43tfdfdgfd