ఇంట్లోనే మాయిశ్చరైజర్‌!

వేసవి కాలం, చలికాలంలోనే కాదు.. వానల వేళా చర్మం రకరకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటుంది. వర్షకాలంలో చర్మం పొడిబారుతూ ఉంటుంది. దీనికి పరిష్కారం మాయిశ్చరైజర్‌ అప్లయ్‌ చేయడమే! మాయిశ్చరైజర్‌ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.

  • బాదం నూనె, జోజోబా నూనె రెండిటినీ సమపాళ్లలో తీసుకుని బాగా మిక్స్‌ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రాత్రి పడుకునే ముందు ముఖానికి, కాళ్లకు, చేతులకు రాసుకుని సున్నితంగా మసాజ్‌ చేసుకోవాలి.
  • ఒక టేబుల్‌ స్పూన్‌ ఆలివ్‌ ఆయిల్‌లో రెండు టేబుల్‌ స్పూన్ల షియా బటర్‌ కలపాలి. దీనిని మాయిశ్చరైజర్‌గా ఉపయోగిస్తే పొడి చర్మం సమస్య తగ్గుముఖం పడుతుంది.
  • గ్లిజరిన్‌, రోజ్‌ వాటర్‌, కలబంద గుజ్జు సమానంగా తీసుకుని బాగా మిక్స్‌ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి అప్లయ్‌ చేస్తూ ఉండాలి. దీంతో చర్మం హైడ్రేటెడ్‌గా మారడమే కాకుండా నిగనిగలాడుతూ ఉంటుంది.
  • రెండు టేబుల్‌ స్పూన్ల కొబ్బరినూనె, ఒక టేబుల్‌ స్పూన్‌ ఆర్గాన్‌ ఆయిల్‌, మందారపూల పొడిని కలిపి మిశ్రమంలా చేసుకోవాలి. ఈ మిశ్రమంలో రోజ్‌ వాటర్‌ కలిపి ముఖానికి రాసుకుంటే మంచి గుణం కనిపిస్తుంది.

2024-07-04T19:27:32Z dg43tfdfdgfd