Trending:


Green Chilli: పచ్చిమిర్చిని కారం కోసమే వాడతామని పక్కన పడేయకండి.. లాభాలు తెలిస్తే మతిపోతుంది

Green Chilli: పచ్చిమిర్చి కూరకు కారం కోసమే కాదు. దాంట్లో పోషకాలు బోలెడుంటాయి. వాటిని మితంగా వాడితే లాభాలు, ఎక్కువగా వాడితే వచ్చే నష్టాలు ఏంటో వివరంగా తెల్సుకోండి.


Ramayanam: వనవాసంలో 14 ఏళ్లపాటు లక్ష్మణుడు నిద్రపోకుండా ఎలా ఉన్నాడు?

రామాయణం ప్రకారం సీతా-రాముళ్ల వనవాసం సమయంలో వారితో పాటుగా లక్ష్మణుడు కూడా ఉన్నాడని చెబుతాయి. అయితే వీరి వనవాసం 14 ఏళ్ల పాటు సాగింది. ఈ వసవాస సమయంలో లక్ష్మణుడు.. సీతకు రక్షణగా ఉండేందుకు 14 ఏళ్లపాటుగా నిద్రపోకుండా ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి. తాను నిద్ర రాకుండా ఉండేందుకు నిద్రాదేవిని లక్ష్మణుడు ప్రార్థించాడంట. తనకి బదులుగా తన భార్య ఊర్మిలకు నిద్ర ఇవ్వమని దేవతను కోరగా ఆమె దానికి అంగీకరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. నిద్ర దేవత ఇచ్చిన వరం కారణంగా లక్ష్మణుడు.. వనవాస యాత్ర మొత్తంలో ఒక్క క్షణం కూడా నిద్రపోకుండా ఉండగలిగాడంట. నిద్ర దేవి విశ్వం సృష్టికి ముందే ఉద్భవించిందని మార్కండేయ పురాణం చెబుతోంది. అయితే ఈ కాలంలో మధు, కైతబ్ అనే ఇద్దరు రాక్షసులు కూడా జన్మించారంట. వీరు బ్రహ్మ దేవుడిపైకి రావడంతో ఆయన విష్ణువుని సహాయం కోరుతాడు. అయితే ఆ సమయంలో విష్ణువు యోగ నిద్రలో ఉంటాడంట. అప్పుడు బ్రహ్మదేవుడు యోగమయుడిని ప్రార్థించగా.. అది విష్ణువు కళ్ళ నుంచి నిద్రను తొలగిస్తుంది. దీంతో విష్ణువు ఒక్కసారిగా కళ్లు తెరుస్తాడు. దీంతో విష్ణువు నిద్ర నుంచి మేల్కొని రాక్షసులను సంహరించి.. బ్రహ్మ దేవుడి ప్రాణాలు కాపాడుతాడు. దీంతో బ్రహ్మకు సహాయంగా వచ్చిన ఈ యోగమయుడు నిద్ర దేవిగా ప్రసిద్ధి చెందింది. Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.


Lipbalm ingredients: లిప్‌బామ్‌‌‌లో ఇవి లేకపోతే ఎంత వాడినా లాభం లేదు.. అవేంటో చూడండి..

Lipbalm ingredients: రోజూవారీ వాడే లిప్‌బామ్ సరిగ్గా ఎంచుకుంటే పెదాలు మరింత ఆరోగ్యంగా ఉంటాయి. లిప్‌బామ్ కొనేముందు అందులో ఏమున్నాయో చూసి కొంటే సరిపోతుంది.


వర్షాకాలం.. స్పైసీ సమోసాలను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో తెలుసా

వర్షాకాలం.. స్పైసీ సమోసాలను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో తెలుసా రోజంతా పనిలో అలసిపోయినప్పుడు... సాయంత్రం రెండు సమోసాలు తిని, కప్పు చాయ్ తాగితే ఆ మజానే వేరు. గంటలుగా పడిన శ్రమ నిమిషాల్లో మాయమవుతుంది. అయితే బయట దొరికే సమోసాలు రెగ్యులర్ గా తింటే ఆరోగ్యం చెడిపోవచ్చు. అందుకే ఇంట్లోనే తయారు చేసుకుని తింటే రుచితో పాటు ఆరోగ్యమూ బాగుంటుంది. కానీ, ఎప్పుడూ ఒకే...


Raw Mango Chutney: పచ్చిమామిడి పెసరపప్పు చట్నీ, స్పైసీగా చేసుకుంటే నోరూరిపోతుంది

Raw Mango Chutney: పచ్చి మామిడికాయతో రుచిగా చట్నీలు చేసుకోవచ్చు. ఒకసారి పెసరపప్పు పచ్చి మామిడి కలిపి చట్నీ చేసి చూడండి. టేస్ట్ అదిరిపోతుంది.


ఈ పండుతో ఫేస్‌ప్యాక్ వేస్తే ముఖం మెరుస్తుంది..

ముఖాన్ని అందంగా, షైనీగా కనిపించాలని అందరూ కోరుకుంటారు. అలాంటివారు ఇంట్లోనే ఓ బెస్ట్ ప్యాక్‌ని తయారుచేసుకోవచ్చు.


Warangal Zoo: జూలో జంతువుల్ని దత్తత తీసుకోవచ్చు - పులి, నెమలిని కూడా, ఎలాగో తెలుసా?

Warangal Kakatiya Zoological Park: పక్షులు, జంతువుల సంరక్షణ, నిర్వహణలో పాలుపంచుకోవడానికి పక్షులు, జంతు ప్రేమికులకు ఆహ్వానం పలుకుతుంది వరంగల్ లోని జులాజికల్ పార్క్. స్వయంగా పక్షుల ఆలన పాలన చూసుకోలేని వారికి, వాటి సంరక్షణ లో భాగస్వాములు కావాలనుకునే వారికి జూ పార్కు పక్షులను, జంతువులను దత్తత ఇస్తుంది. సంరక్షణ, దత్తత ను మూడు, ఆరు, సంవత్సరం ఎవరి వీలును బట్టి వారు దత్తత తీసుకోవచ్చు. వరంగల్ నగరంలోని హంటర్ రోడ్ లో ఉన్న కాకతీయ జూలాజికల్ పార్క్...


ఒరిజినల్ చేనేత వస్త్రాలు కావాలా? అయితే ఇక్కడికి రావాల్సిందే

పెరుగుతున్న ఆధునిక టెక్నాలజీతో ఉరుకులు పరుగుల జీవితంలో రేడిమేడ్ వస్త్రాల వాడకం ఎక్కువైపోయింది. ఇతర దేశాల తయారయ్యే దుస్తులు, ముఖ్యంగా చైనా వస్తువులతో మన భారతీయ చేనేత, కళాకారులు తయారు చేసిన బట్టలకి డిమాండ్ తగ్గింది. పూర్వ వైవిధ్య సంస్కృతి, సంప్రదాయాలు ఇప్పుడు ఎగ్జిబిషన్ల ద్వారా ప్రదర్శించబడుతున్నాయి. మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఎంతో గొప్పవి. వందల ఏళ్లుగా అవి వారసత్వంగా కొనసాగుతున్నాయి.భారతదేశానికే ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టే చేనేత...


తెలివితేటలు పెరగాలంటే ఏం చేయాలో తెలుసా?

తెలివితేటలు ఎక్కడి నుంచో రావు.. మన రోజువారి అలవాట్లతోనే వస్తాయని నిపుణులు చెబుతున్నారు. మన తెలివితేటలు శరీరం, మనస్సు రెండింటిపై ఆధారపడి ఉంటాయి. కొంతమంది పెద్దలే కాకుండా పిల్లలు కూడా చాలా తెలివిగా ప్రవర్తిస్తుంటారు. వారిని చూస్తే ఎంతటి పెద్దవారికైనా ఆశ్చర్యమేస్తుంది. నీకిన్ని తెలివితేటలు వచ్చాయిరా అని పొగిడేస్తుంటారు. అందుకే తెలివితేటలను పెంచే కొన్ని రోజువారి అలవాట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి. చదివే అలవాట్లు: గొప్ప గొప్ప వాళ్లకు చదివే...


Lemon Ginger Tea: నిమ్మ అల్లం టీ ప్రయోజనాలు తెలుస్తే అసలు వదిలిపెట్టరు..!

Lemon Ginger Tea Benefits: నిమ్మ అల్లం టీ ఒక ప్రసిద్ధ పానీయం. ఇది రుచికరమైనది మాత్రమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఈ టీ జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి శ్వాసకోశ సమస్యలకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది.


రాశిఫలాలు 06 జూలై 2024:ఈరోజు త్రిపుష్కర యోగం, శని దేవుని ప్రభావంతో మిధునం, కన్యతో సహా ఈ 4 రాశులకు విశేష లాభాలు..!

horoscope today 06 July 2024 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు త్రిపుష్కర యోగం వేళ మిధునం, కన్యతో సహా ఈ రాశుల వారికి శని దేవుని ప్రత్యేక ఆశీస్సులు లభించనున్నాయి. ఈ నేపథ్యంలో ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...


కండరాలను బలహీనంగా మార్చే ఆహారాలు!

కండరాలను బలహీనంగా మార్చే ఆహారాల గురించి ఇక్కడ వివరించాం. వీటిని తింటే కండర ద్రవ్యరాశి తగ్గుతుంది.


కళ్లు ఎన్ని రంగులు ఉంటాయో తెలుసా.. ఏవి ఆకర్షణీయంగా ఉంటాయంటే..!

మనుసులో ఉన్నది కళ్లలో కనిపిస్తుందని అంటుంటారు. మనలోని భావాల్ని కళ్లు ప్రదర్శిస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేనా మనలో ఆకర్షణీయంగా కనిపించే భాగాల్లో కళ్లు మొదటి స్థానంలో ఉంటాయి. అయితే ప్రపంచంలో కేవలం నలుపు రంగు, నీలికళ్లే కాదు.. ఇంకా చాలా రంగుల కళ్లు ఉన్నాయంట. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మంది కనుపాపలు నలుపు రంగులో ఉంటాయి. నిజానికి అది నలుపు కాదు.. గోధుమ రంగు. మెలనిన్‌ అనే వర్ణద్రవ్యం ఎక్కువగా ఉన్నవాళ్ల కళ్లు నలుపుగా కనిపిస్తాయి. దాదాపు 70 నుంచి 79 శాతం ప్రజలకు ఈ గోధుమ రంగు కళ్లే ఉన్నాయి. ఆఫ్రికా, తూర్పు ఆసియా, ఆగ్నేయాసియా వాసులకు ముదురు గోధుమ రంగు కళ్లు.. దక్షిణాసియా, అమెరికా, యూరప్‌ ప్రజలకు లేత గోధుమ రంగు కళ్లు ఎక్కువగా ఉంటాయట. ప్రపంచంలో 8 నుంచి 10 శాతం మందికి నీలిరంగు కళ్లు ఉంటాయి. యూరప్‌లో అందులో ముఖ్యంగా స్కాండినేవియాలో వీళ్లు అధికం. కొన్ని వేల సంవత్సరాల కిందట అందరికీ గోధుమ రంగు కళ్లే ఉండేవట. ఆ తర్వాత మనుషుల జన్యువుల్లో మార్పులు వచ్చి, కనుపాప రంగు మారింది. కనుపాప రంగు పాక్షికంగా తల్లిదండ్రుల జన్యువు నుంచి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. నీలిరంగు కళ్లున్న వ్యక్తులు చీకటిలోనూ చూడగలరట. అయితే పగటి పూట సూర్యకాంతిని తట్టుకోలేరని నిపుణులు చెబుతున్నారు. ఆకుపచ్చ, నారింజ, బంగారు వర్ణాల కలయికతో లేత గోధుమ రంగు ఉంటుంది. ఇలాంటి కళ్లున్నవారు ప్రపంచవ్యాప్తంగా 5 శాతం మంది ఉన్నారు. ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాలు, బ్రెజిల్‌, స్పానిష్‌ ప్రజలకు ఈ రంగు కళ్లు ఎక్కువగా ఉంటాయట. పిల్లులకు ఉండే బూడిదరంగు కళ్లు ప్రపంచంలో 3 శాతం మనుషులకు ఉంటాయి. కనుపాప రంగుకు కారణమయ్యే మెలనిన్‌ అనే వర్ణద్రవ్యం తక్కువ మొత్తం ఉండటం, కంటిలోని స్ట్రోమా భాగంలో కొలాజిన్‌ ప్రొటీన్‌ ఎక్కువగా ఉండటంతో కనుపాప నీలిరంగులోకి మారకుండా అడ్డంకి ఏర్పడుతుందట. ఫలితంగా కనుపాప బూడిద రంగులో కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ రంగు కళ్లున్నవాళ్లు ఎక్కువగా ఉత్తర, తూర్పు యూరప్‌లో ఉంటారు. ప్రపంచ జనాభాలో 2శాతం మంది కళ్లు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఉత్తర, మధ్య, పశ్చిమ యూరప్‌లో ఆకుపచ్చ కళ్లు ఉన్న వ్యక్తులు ఎక్కువ. వీరిలో 16 శాతం సెల్టిక్‌, జర్మన్ల వారసులై ఉంటారని అంచనా. ఐర్లాండ్‌, స్కాట్లాండ్‌లో 86 శాతం మంది నీలి, ఆకుపచ్చ రంగు కళ్లున్నవారు ఉన్నారు.


Menu for diabetic: షుగర్ ఉన్నవాళ్లు రెస్టారెంట్‌కి వెళ్తే ఏం ఆర్డర్ చేసుకోవాలి? ఈ టిప్స్‌తో రుచితో పాటూ ఆరోగ్యం

డయాబెటిస్ ఉన్నవాళ్లు చిన్న చిన్న ఆనందాలకు దూరం అయిపోతారు. బయటికి వెళ్లినప్పుడు ఏం తినాలో తెలీక రెస్టారెంట్లకు వెళ్లడం మానేస్తారు. అది మంచిదే. కానీ వెళ్లాలనిపిస్తే అక్కడ ఏం తినొచ్చు, ఎలా ఆర్డర్ చేసుకోవచ్చో చూసేయండి.


Bael Plant | మారేడు చెట్టు కింద ఆ పనిచేస్తే నిరుపేద కూడా సంపన్నుడవుతాడట..!

Bael Plant : హిందూధర్మంలో చెట్టును దైవంగా పూజిస్తారు. కొన్ని వృక్షాలు దేవతా వృక్షాలుగా కీర్తించబడుతాయి. ఇలా దేవతా వృక్షాలుగా కీర్తించబడే వాటిలో మారేడు చెట్టుకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. మారేడు చెట్టుని సంస్కృతంలో బిల్వ వృక్షం అంటారు. బిల్వ వృక్షం శివునికి అత్యంత ప్రీతికరమైనది. అందుకే మారేడు దళాలతో శివయ్యను పూజిస్తాం. బిల్వ పత్రంలోని మూడు ఆకులు శివుని మూడు కళ్ళకు ప్రతీకగా చెబుతారు.


Must Have Gadgets: వర్షంలో కచ్చితంగా జేబులో ఉండాల్సిన గ్యాడ్జెట్స్ ఇవే - చిన్నవే కానీ కాపాడతాయి!

Monsoon Special Gadgets: భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో రుతుపవనాలు ప్రవేశించాయి. కొన్ని చోట్ల తేలికపాటి వర్షం కురుస్తుండగా, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షం ఒక్కోసారి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుంది. వర్షాన్ని నివారించడానికి కొన్ని గాడ్జెట్‌లు ఉన్నాయి. ఇవి వర్షాకాలంలో చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వీటి ధర అందుబాటులో ఉంటుంది కూడా. హెచ్ఎస్ఆర్ రెయిన్‌ప్రూఫ్ ఫిల్మ్ స్టిక్కర్ ఇది గాడ్జెట్ కానప్పటికీ వర్షాల సమయంలో ఇది చాలా ఉపయోగకరంగా...


Panchangam Today: ఈ రోజు అలాంటి పనులకు అసలు మంచిది కాదు

నేడు 5 జులై 2024 బుధవారం, స్వస్తిశ్రీ చంద్రమాన క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ రుతువు, జ్యేష్ట మాసం, బహుళ పక్షం.మాసశివరాత్రి ఇవాళ 5 గంటల 35 నిమిషాలకు సూర్యోదయం. నేడు సాయంత్రం 6 గంటల 37 నిమిషాలకి సూర్యాస్తమయం అవుతుంది. ఇవాళ తిథి బహుళ త్రయోదశీ. ఉదయం 5 గంటల .54 నిమిషాల వరకు కలదు. చతుర్దశి రాత్రి అనగా తెల్లవారుజామున :4 గంటల .58నిమిషాల వరకు తదుపరి: అమావస్య . వారం: బృహస్పతివాసరె నక్షత్రం: మృగశిర రా:3గంటల 54నిమిషాల వరకు తదుపరి: ఆర్ధ్ర.యోగం: గండ ,ఉదయం 6గంటల 59నిమిషాల వరకు. ఉదయం 9 గంటల 1 నిమిషం వరకూ. వృద్ది రాత్రి అనగా తెల్లవారు జామున 5గంటల .13నిమిషాల వరకు. తదుపరి: దృవ .కరణం:వణిజ ఉదయం 5గంటల 54నిమిషాల వరకు తర్వాత భద్ర సాయంత్రం 5గంటల 26నిమిషాల వరకు. తదుపరి శకుని రాత్రి తెల్లవారుజామున :4గంటల 58నిమిషాల వరకు.తదుపరి:చతుష్పాత్ అమృతకాలం రాత్రి 7గంటల 11నిమిషాల నుండి 8గంటల 46నిమిషాల వరకు ఉంది. నిజానికి ఈ అమృత కాలాన్ని శుభ సమయం, అమృత ఘడియలుగా పరిగణిస్తారు. దుర్ముహూర్తం ఉదయం 10గంటల 10నిమిషాల నుండి 11గంటల 2నిమిషాల వరకు. తిరిగిమధ్యాహ్నం:3గంటల 23నిమిషాల నుండి 4గంటల 15నిమిషాల వరకు కలదు. ఇది మంచి ముహూర్తం కాదు. అందువల్ల ఎవరూ ఈ సమయంలో ముహూర్తాలు పెట్టుకోరు. రాహుకాలం మధ్యాహ్నం :ఒంటి గంట 30నిమిషాల నుండి 3గంటల వరకు ఉంది. రాహుకాల సమయంలో చేసే పనులకు ఆటంకం కలుగుతుందని ప్రజలు నమ్ముతారు. కాబట్టి ముఖ్యమైన పనులను ఆ సమయంలో చేయరు. యమ గండకాలం ఉదయం :06 గంటల నుండి 7గంటల 30నిమిషాల వరకు ఉంది. ఈ యమగండ కాలాన్ని శుభ సమయంగా పరిగణించరు. యమగండాన్నే కేతుకాలం అని కూడా అంటారు. అన్నింటికన్నా ముఖ్యమైనది వర్జ్యం. వర్జ్యం అంటే విడువ తగినది, అశుభ సమయం. శుభకార్యాలు, ప్రయాణాలు ఈ సమయంలో చేయకూడదు. ఈ రోజు వర్జ్యం ఉదయం 9గంటల 40నిమిషాల నుండి 11గంటల 15నిమిషాల వరకు కలదు ఉంది. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


Healthy Paratha Recipe: ఇష్టమైన పరాఠాల్ని హెల్తీగా తయారు చేసుకునే విధానం

Healthy Paratha Recipe: పరాఠా అంటే ఇష్టపడనివారుండరు. ముఖ్యంగా ఉత్తరాదిన అత్యంత ప్రీతిపాత్రమైన ఫుడ్ ఇది. అందులోనూ ఆలూ పరాఠా అంటే మరింత క్రేజ్. కానీ పరాఠా తింటే లావెక్కిపోతారనే భయం కూడా వెంటాడుతుంటుంది. మరి ఏం చేయాలి...ఆ వివరాలు మీ కోసం..


ఫరియా నీ కోసం పరితపిస్తారు.. మాములుగా లేవుగా!

ఫరియా అబ్దుల్లా చాలా మారిపోయింది. గ్లామర్ ట్రీట్‌కే ఎక్కువ అవకాశం ఇస్తోంది.


వివాహేతర సంబంధాలు పెరగడానికి కారణాలివే..

ప్రజెంట్ కొంతమంది వివాహేతర సంబంధాలు పెట్టుకుని తమ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. అసలు దీనికి గల కారణాలేంటో తెలుసుకోండి.


Horoscope | 05-07-2024 శుక్రవారం.. మీ రాశి ఫలాలు

Horoscope | జ్యోతిషం అంటే నమ్మకం. మనకు అంతా మంచే జరగాలని కోరుకుంటాం. అందువల్ల ఈరోజు మన రాశి ఫలాలు ఎలా ఉన్నాయని చూసుకునే వారు చాలామంది ఉంటారు. అలాంటివారికోసం నేటి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..


Gutti Dondakaya: గుత్తి దొండకాయ రెసిపీ ఇలా సులువుగా తయారు చేసుకోవచ్చు..!

Gutti Dondakaya Recipe: గుత్తి దొండకాయ కూర తెలుగు వంటకాల్లో ఒక ప్రసిద్ధమైన వంటకం. దీనిని పొట్టి దొండకాయ కూర అని కూడా పిలుస్తారు. ఇది చాలా రుచికరమైనది, పోషకాలతో నిండి ఉంటుంది.


Horoscope: జులై 3 రాశిఫలాలు. ఇవాళ వారు ఆశ్చర్యపరుస్తారు

Rasiphalalu today:పన్నెండు రాశుల్లో ఇవాళ (3 జలై, 2024 బుధవారం) ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎవరికి అదృష్టం కలిసొస్తుంది? ఎవరికి ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి? ఎవరిపై శని ప్రభావం ఉంటుంది? తెలుసుకుందాం. మేష రాశి (Aries):పదోన్నతులు, జీతభత్యాల పరంగా ఉద్యోగులు ఆశించిన శుభవార్తలు వింటారు. వ్యాపారంలో కొన్ని లాభదాయక మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి రంగంలో మార్పులు జరుగుతాయి. ఆస్తి వివాదం ఒకటి అనుకోకుండా పరిష్కారమవుతుంది. కొద్దిగా అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఇంటా బయటా బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థికంగా శుభ ఫలితాలుంటాయి. కుటుంబ పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దాంపత్య జీవితం చాలావరకు అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి (Taurus):వృత్తి, వ్యాపారాలు లాభాల బాటపడతాయి. ఉద్యోగుల మీద అధికారులకు నమ్మకం పెరుగుతుంది. ఒకటి రెండు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. కొద్ది ప్రయత్నంతో అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. రావలసిన డబ్బు చేతికి వస్తుంది. మొండి బాకీలు వసూలవుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలకు వెళ్తారు. తలపెట్టిన పనులు చాలా వరకు సకాలంలో పూర్తవుతాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం చాలావరకు పరవాలేదు. మిథున రాశి (Gemini):ఉద్యోగంలో మీ పనితీరు అధికారులకు బాగా నచ్చుతుంది. వృత్తి, వ్యాపారాలలో కొన్ని మార్పులు చేపడతారు. పోటీదార్లు తగ్గి ఉంటారు. కుటుంబంలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. ముఖ్య మైన వ్యవహారాలను తేలికగా పూర్తిచేస్తారు. ఆర్థిక సమస్యల ఒత్తిడి బాగా తగ్గుతుంది. కొందరు మిత్రులతో అపర్థాలు తొలగిపోతాయి. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రయాణాలు చివరి క్షణంలో వాయిదా పడతాయి. పిల్లల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి. కర్కాటక రాశి (Cancer):ఇంటా బయటా పనిభారం, ఒత్తిడి కాస్తంత ఎక్కువగానే ఉంటాయి. ఉద్యోగ వాతావరణం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. వృత్తి, వ్యాపారాల్లో కార్యకలాపాలు, లావాదేవీలు ఎక్కువవుతాయి. ముఖ్యమైన పనులు ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండడం మంచిది. నిరుద్యోగులు సరైన దిశలో ప్రయత్నాలు చేయడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు చాలావరకు సానుకూలంగా సాగిపోతాయి. ఎవరినీ గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. సింహ రాశి (Leo):వృత్తి, వ్యాపారాల్లో యాక్టివిటీ బాగా పెరుగుతుంది. ఆర్థిక ఒత్తిళ్ల నుంచి చాలావరకు బయటపడతారు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. తలపెట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. అనవసర పరిచయాలకు దూరంగా ఉండండి. ఉద్యోగ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు ఆఫర్లు బాగా అందుతాయి. కుటుంబ జీవితంలో కొద్దిపాటి సమస్యలు ఉండవచ్చు. పనుల ఒత్తిడితో విశ్రాంతి తగ్గుతుంది. కన్య రాశి (Virgo):ఇంటా బయటా అనుకూలతలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో పని ఒత్తిడి బాగా తగ్గుతుంది. బాధ్యతల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తిచేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. ఊహించని విధంగా ఆదాయ వృద్ధి ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి. ఎవరికీ ఎలాంటి వాగ్దానాలూ చేయవద్దు. వ్యక్తిగత సమస్య పరిష్కారమవుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. తుల రాశి (Libra):వృత్తి, ఉద్యోగాల్లో సమస్యలు, ఇబ్బందులు ఉండకపోవచ్చు. ఉత్సాహంగా బాధ్యతలు పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు సాదా సీదాగా సాగిపోతాయి. వ్యాపారంలో లాభాలు నిలకడగా ఉండవచ్చు. కుటుంబంలోనే కాక, సామాజికంగా కూడా ఈ రాశివారి మాటకు విలువ పెరుగుతుంది. ముఖ్యమైన పనులు కొద్ది ఖర్చుతో పూర్తవుతాయి. కుటుంబసమేతంగా ఆలయాలు సందర్శి స్తారు. బంధువులతో మాట పట్టింపులుంటాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. వృశ్చిక రాశి (Scorpio):ఉద్యోగ జీవితంలో కొద్దిగా శ్రమ, ఒత్తిడి ఉండవచ్చు. అధికారులు బాగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో శ్రమాధిక్యత ఉన్నప్పటికీ లాభాలు గడిస్తారు. అనేక విధాలుగా ఆదాయ వృద్ది ఉంటుంది. ఇంటా బయటా కొన్ని అనుకూలతలు పెరుగుతాయి. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కుటుంబ సభ్యుల మీద ఖర్చు పెరుగుతుంది. ఆహార, విహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ధనస్సు రాశి (Sagittarius):వృత్తి, ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. హోదా పెరగడానికి అవకాశం ఉంది. వ్యాపారులకు లాభాలు అంచనాలను మించుతాయి. సోదరులతో ఆస్తి వివాదం ఒకటి చాలావరకు పరిష్కారం అవుతుంది. పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకే కాక, ఉద్యోగులకు కూడా మంచి ఆఫర్లు అందుతాయి. ప్రయాణాల్లో వస్తు నష్టం, ధన నష్టం జరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలకు లోటుండదు. ఆశించిన శుభవార్తలు వింటారు. మకర రాశి (Capricorn):వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో బాధ్యతలు మారడానికి, బాధ్యతలు పెరగడానికి అవకాశం ఉంది. ఆదాయం బాగానే వృద్ధి చెందుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటివి పెట్టుకోవద్దు. స్నేహితుల వల్ల ఇబ్బందుల్లో పడాల్సి వస్తుంది. నిరుద్యోగులకు సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఆరోగ్యం చాలావరకు నిలకడగా సాగిపోతుంది. కుంభ రాశి (Aquarius):నిరుద్యోగులకే, కాక ఉద్యోగులకు కూడా మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. ఉద్యోగంలో అధికారులు ఎక్కువగా ఆధారపడడం వల్ల పనిభారం పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. ఆదాయానికి లోటుండదు. వృత్తి, వ్యాపారాల్లో కొన్ని మార్పులు చేసి లబ్ధి పొందుతారు. ఆర్థిక సమస్యల పరిష్కారం మీద దృష్టి పెట్టడం మంచిది. కొత్త నిర్ణయాలు, ప్రయత్నాలకు ఇది అన్నివిధాలా అనుకూల సమయం. ఆహార, విహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. మీన రాశి (Pisces):పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకోకుండా ఒకటి రెండు శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. పిల్లలు బాగా వృద్ధిలోకి వస్తారు. నిరుద్యోగులకు, ఉద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. బంధువులకు ఆర్థికంగా సహాయం చేస్తారు. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


Tomato Ketchup: టమాటో కెచప్ తినడానికే కాదు, ఇలా ఇంట్లోనే వస్తువులను తళతళ మెరిపించేందుకు వాడవచ్చు

Tomato Ketchup: టమాటో కెచప్ పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో ఉంటుంది. దీన్ని కేవలం తినడానికే కాదు, ఇంట్లోనే కొన్ని వస్తువుల మురికిని వదిలేసి మెరిసేలా చేయడానికి వినియోగించవచ్చు.


Toxic friendship: స్నేహితుల్లో ఈ లక్షణాలుంటే వాళ్లను దూరం పెట్టాల్సిందే..

Toxic friendship: స్నేహితుల్లో కొన్ని చెడు లక్షణాలుంటే వెంటనే వాటిని గమనించాలి. వాళ్లనుంచి దూరంగా ఉండాలి. లేదంటే వాళ్లని మార్చుకునే ప్రయత్నం చేయాలి.


శెనగపిండిలో ఇదొక్కటి కలిపి వాడితే మీ ముఖం ఎంత అందంగా మెరుస్తుందో..!

ఇండియాలో చాలా మంది చర్మాన్ని శుభ్రం చేయడానికి ఎన్నో ఏండ్లుగా శెనగపిండిని ఉపయోగిస్తున్నారు. ఈ పిండితో తయారుచేసిన ఫేస్ ప్యాక్ ను అందాన్ని మెరుగుపర్చడానికి బాగా ఉపయోగిస్తారు. ఈ ఫ్యాక్ ముఖంపై మొటిమలను, మచ్చలను పోగొట్టడానికి బాగా పనిచేస్తుంది. అలాగే ఇది ముఖం అందంగా మెరిసేలా కూడా చేస్తుంది. ఇందుకోసం శెనగపిండిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. చర్మానికి శెనగపిండి శెనగపిండితో ముఖాన్ని శుభ్రం చేయొచ్చు. ఈ పిండి ముఖంపై మురికిని, దుమ్ము, ధూళిని...


మీ పిల్లలకు కూడా తెల్ల జుట్టు వస్తోందా? ఏం చేయాలో తెలుసా?

నేటి కాలంలో పెద్దలకే కాదు చిన్న చిన్న పిల్లలకు కూడా తెల్ల వెంట్రుకలు పెరుగుతున్నాయి. దీనివల్ల పిల్లలే కాదు వారి తల్లిదండ్రులు కూడా బాధపడతారు. అసలు చిన్న పిల్లలకు తెల్ల వెంట్రుకలు రాకుండా ఉండటానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. అమ్మాయిలు, అబ్బాయిలు అంటూ తేడా లేకుండా తెల్ల జుట్టు ప్రతి ఒక్కరికీ వస్తోంది. ముఖ్యంగా 20 ఏండ్లున్న యువతీ, యువకులకు కూడా తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. వీటిని దాచడానికి మెహందీ, కలర్స్ ను జుట్టుకు వేసుకుంటున్నారు....


Neem Oil Benefits: వేపనూనె జుట్టుకు అప్లై చేస్తున్నారా? ఏం జరుగుతుందో తెలుసా?

Neem Oil Benefits: వేప నూనె తరచూ జుట్టుకు పట్టించడం వల్ల జుట్టుకు మాయిశ్చర్‌ అందుతుంది. డ్రై స్కాల్ప్‌ సమస్య తగ్గిపోతుంది. కొంతమంది జుట్టు ఫంగల్‌ ఇన్ఫెక్షన్లతో బాధపడుతుంటారు. మలస్సెజియా గ్లబోసా అనే ఫంగల్ వల్ల కలుగుతుంది.


పరిచయం: అమ్మతో కలిసి..విమానం ఎక్కాలనుకున్నా..

పరిచయం: అమ్మతో కలిసి..విమానం ఎక్కాలనుకున్నా.. ఒక సినిమాలో హీరో, హీరోయిన్, విలన్ కాకుండా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటుంది. అదే సపోర్టింగ్ యాక్టర్ రోల్. వాళ్లు ఆ కథకు ఎంత ఉపయోగపడతారనేది ఫిల్మ్ అవార్డులకు నామినేట్ అయినప్పుడు తెలుస్తుంది. అలాంటి సపోర్టింగ్ రోల్స్తో ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే యాక్టర్లు కొందరే ఉంటారు. వాళ్లలో ఒకరు ఛాయా కదమ్. మరాఠీ, హి...


Mars Transit 2024: జూలై 12వ తేదీ నుంచి ఈ రాశుల వారి ఇల్లు డబ్బుతో నిండిపోబోతోంది..

Mars Transit 2024: జూలై 12వ తేదీన మిధున రాశిలోకి అంగారక గ్రహం సంచారం చేయబోతోంది దీని కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు అనుకున్న పనులు కూడా సులభంగా నెరవేరుతాయి.


ఈ వాసనలకు పాములు సుస్సు పోసుకుంటాయి.. నాగలోకంలో ఉన్నా అవి మీ దగ్గరకు రావు..!

ఎండవేడిమి నుండి ఉపశమనం కోసం ప్రజలు వర్షాకాలాన్ని చాలా ఇష్టపడతారు. అయితే, ఈ సీజన్ ఉపశమనంతో పాటు అనేక సమస్యలను కూడా తెస్తుంది. దీనివల్ల నీటి వల్ల వచ్చే వ్యాధులు, ఫుడ్ పాయిజనింగ్, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉండటమే కాకుండా.. పాములు, తేళ్లు, జర్రిలు మొదలైన కొన్ని చాలా ప్రమాదకరమైన జీవులు ఇంట్లోకి ప్రవేశించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా గ్రామాలు, కొండ ప్రాంతాలు లేదా అటవీ ప్రాంతాలు మరియు గ్రౌండ్ ఫ్లోర్‌లో నివసించే వారు ఎంతో ప్రమాదంలో ఉన్నట్టే. అటువంటి పరిస్థితిలో ప్రమాదాన్ని నివారించడానికి కొన్ని చర్యలు తీసుకోవాలి. వర్షాకాలంలో పాములు, కీటకాలను ఇంటి నుండి దూరంగా ఉంచడానికి 10 మార్గాలను తెలుసుకుందాం. ముఖ్యంగా మీరు గ్రౌండ్ ఫ్లోర్‌లో నివసిస్తుంటే, మీ ఇల్లు కొండ ప్రాంతంలో లేదా అడవి, పార్క్ మొదలైన వాటికి సమీపంలో ఉంటే.. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్షం పడితే తలుపులు, కిటికీలు మూసేయాలి. ఎందుకంటే పాములు ఈ ప్రదేశాల్లో ఎక్కవ సంచరిస్తుంటాయి. పాములంటే ప్రజల్లో భయం నెలకొంది. అందరూ పాములకు దూరంగా ఉండాలని కోరుకుంటారు, అయితే పాములను సురక్షితంగా తరిమివేయడం ఎలా.. పాములను పారిపోయేలా చేసే వాసన ఈ ప్రపంచంలో ఏదైనా ఉందా అంటే సమాధానం అవుననే వస్తుంది. పాములను తరిమిమీరు వేప నూనెను ఉపయోగించవచ్చు. వేపనూనెను నీళ్లలో కలిపి రోజూ ఇంటింటా స్ప్రే చేస్తే దోమదోషాలు తొలగిపోతాయి. ఇంటి తోటలో కూడా ఈ నీటిని పిచికారీ చేస్తూ ఉండండి. పాములను లేదా ఇతర జంతువులను మీ ఇంటికి దూరంగా ఉంచడానికి బ్లీచింగ్ పౌడర్‌ని ఉపయోగించవచ్చు. బయట మరియు తోటలో నిలబడి ఉన్న నీటిపై పిచికారీ చేయండి. ఈ నీటితో ఇంటిని శుభ్రం చేసుకోవచ్చు. కావాలంటే దాల్చిన చెక్క పొడి, వైట్ వెనిగర్ లేదా నిమ్మరసం కలిపి ఇంటి బయట పిచికారీ చేసుకోవచ్చు. పాములు వచ్చే అవకాశం ఉన్న ప్రదేశాలలో క్రమం తప్పకుండా పిచికారీ చేయాలి. పాములు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే కిటికీలకు, తలుపులకు ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలను రాయండి. చాలా పాములు ఈవాసన చూసి పారిపోతుంటాయి. మీ ఇంటి తోటలో వెల్లుల్లి మరియు ఉల్లిపాయలను నాటడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. పాములు కొన్ని మొక్కలకు కూడా భయపడతాయి, అవి పారిపోతాయి. కాక్టస్, స్నేక్ ప్లాంట్, తులసి చెట్టు, నిమ్మ గడ్డి మొదలైనవి వర్షాకాలంలో తప్పనిసరిగా నాటాలి. ఇంటి ప్రధాన ద్వారం, కిటికీల దగ్గర ఈ మొక్కలను ఉంచాలి. ఈ మొక్కల వాసన కారణంగా, పాములు ఇంటి దగ్గరికి రావు. (గమనిక: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది.. న్యూస్ 18 తెలుగు దీనిని ధృవీకరించడం లేదు.)


పట్టపగలే పంటపొలాల్లో ఇదేం పని.. చుట్టూ చీరలు కట్టి మరీ.. ఎవరైనా చూస్తారన్న భయం లేకుండా.. !

పాత సినిమాల్లో చూపించినట్టుగా.. పంటపొలాల్లో పంపుసెట్ల దగ్గర, గడ్డివాముల దగ్గర చాటుగా చేసే పనులు మళ్లీ మొదలయ్యాయి. ఆ పనులు ఏంటో అనుకునేరు.. అదేనండి పేకాట. అచ్చంగా ఆ పాత సినిమాల్లో చూపించినట్టుగానే.. ముస్తాబాద్ మండలంలో పేకాటరాయుళ్లు ఏమాత్రం బెరుకు లేకుండా.. దర్జాగా పంట పొలాల మధ్య చెట్టు కింద.. చుట్టూ చీరలు కట్టుకుని మరీ పని కానిచ్చేస్తున్నారు. దీంతో.. పోలీసులు కూడా అదిరిపోయే స్కెచ్ వేసి.. పేకాటరాయుళ్లను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.


బ్రహ్మముడికి అంటే ఏమిటి? దానికి అంత ప్రాముఖ్యత ఉందా!

హిందువులు వివాహ వేడుకలలో అనేక ఆచారాలు, సంప్రదాయాలతో పాటిస్తుంటారు. తాళిబొట్టు కట్టడం, మెట్టెలు పెట్టడం, ఏడడుగులు నడవడం వంటి సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ ఆచారాల ద్వారా ఇద్దరు వ్యక్తులు పవిత్రమైన అనుబంధంలోకి అడుగు పెడతారు. హిందూ వివాహాల్లో అలాంటి ఒక ముఖ్యమైన సంప్రదాయం బ్రహ్మముడి (గత్‌బంధన్). ఈ ఆచారంలో వధువు దుపట్టాను వరుడు ధరించే పింక్ స్కార్ఫ్‌/కండువా/పంచెతో కలిపి ముడి వేస్తారు. ఇది వారి ఐక్యతను సూచిస్తుంది. జీవితాంతం కలిసి ఉండాలనే కోరికను సూచిస్తుంది. బ్రహ్మముడి ప్రాముఖ్యత : బ్రహ్మముడి అనేది జీవితాన్ని కలిసి గడపాలని నిర్ణయించుకున్న ఇద్దరి వ్యక్తుల మధ్య ఏర్పడిన పవిత్రమైన బంధానికి సింబల్‌గా నిలుస్తుంది. ఈ ఆచారంలో వరుడి కండువా (పొడవైన స్కార్ఫ్), మహిళ దుపట్టాను ఒక పవిత్రమైన దారంతో కలిపి ముడి వేస్తారు. ఈ ముడి ద్వారా తాము లైఫ్ లాంగ్ ఒకటిగా ఉంటామని వధూవరులు ప్రమాణం చేస్తారు. దీని ద్వారా ఒకరినొకరు గౌరవించుకుంటామని, ప్రేమించుకుంటామని కూడా ప్రామిస్ చేస్తారు. ఒక యువకుడు, ఒక యువతి ఒకరితో ఒకరు జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, ఆ బంధాన్ని పవిత్రంగా గుర్తించడానికి ఒక ముడిని కడతారు. ఇది వధూవరుల మధ్య జీవితాంతం నెలకొనే అవినాభావ బంధాన్ని సూచిస్తుంది. హిందూ వివాహాల్లో బ్రహ్మముడి : హిందూ వివాహంలో, వరుడి సోదరి బ్రహ్మముడిని కడుతుంది. ఈ ముడి ద్వారా వధువును కొత్త కుటుంబ సభ్యురాలిగా అంగీకరిస్తున్నామని వరుడు, అతడి కుటుంబ సభ్యులు తెలియజేస్తారు. పెళ్లిలో వధూవరులు తమ మెడల చుట్టూ కండువాలను మార్చుకోవడం ఒక ముఖ్యమైన ఆచారం. ఈ స్కార్ఫ్స్‌ వారి మధ్య ఏర్పడిన శాశ్వత బంధాన్ని సూచిస్తాయి. వరుడు తన భార్యకు కండువాను బహుమతిగా ఇవ్వడం ద్వారా, ఆమెను తన జీవితంలో ఒక భాగంగా స్వీకరిస్తానని, ఎల్లప్పుడూ రక్షిస్తానని, ఆమెను ప్రేమిస్తానని వాగ్దానం చేస్తాడు. వధువు తన భర్తకు తన స్కార్ఫ్‌ను బహుమతిగా ఇవ్వడం ద్వారా, అతడిని గౌరవిస్తానని, అతడికి విధేయురాలిగా ఉంటానని, అతనితో కలిసి జీవితాన్ని పంచుకుంటానని వాగ్దానం చేస్తుంది. మరణం వరకు ఒకరినొకరు ప్రేమించుకోవడానికి, గౌరవించుకోవడానికి, మద్దతు ఇవ్వడానికి వారు ప్రమాణం కూడా చేస్తారు. ఈ ఆచారం జరిగిన తర్వాత, కొత్త దంపతులు తాము మానసికంగా, భావోద్వేగపరంగా, శారీరకంగా ఒకరితో ఒకరు కలిసి ఉంటామని నమ్ముతారు. ఇది ఒకే ఆత్మగా మారిన ఇద్దరి వ్యక్తుల సంబంధాన్ని సూచిస్తుంది. బ్రహ్మముడి ద్వారా, వధూవరులు తమ ఆనందాలు, బాధలు, ఆస్తులు, బాధ్యతలను పంచుకునే జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుంటారు. బ్రహ్మముడి సమయంలో వరుడి పొడవైన కండువాకు ఐదు పవిత్ర వస్తువులు జోడిస్తారు. అవి నాణెం, పువ్వు, బియ్యం, పసుపు, దుర్వా గడ్డి. ఈ వస్తువులు వారి జీవితంలో సంతోషం, శ్రేయస్సు, సమృద్ధిని సూచిస్తాయి. నాణెం డబ్బుపై ప్రతి ఒక్కరికీ సమాన హక్కు ఉందని, అందరి అవసరాలకు అనుగుణంగా దానిని ఉపయోగించాలని సూచిస్తుంది. పూలు, వధూవరులు ఒకరితో ఒకరు సంతృప్తిగా ఉంటారని సూచిస్తాయి. పసుపు, వధూవరులు ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారని సూచిస్తుంది. దుర్వా గడ్డిలాగా వధూవరులు ఇద్దరూ చిర యువ, ఉత్సాహంగా ఉండాలని సూచిస్తుంది. బియ్యం , జంటలో ఎవరూ ఆకలితో బాధపడకుండా ఉండేంతగా తినాలని సూచిస్తుంది. మూడు ముడులు : బ్రహ్మముడిలో మూడు ముడుల్లో ప్రతి ముడికి ఓ ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. మొదటి ముడి హక్కులను సూచిస్తుంది. దంపతులు ఒకరిపై ఒకరు హక్కులు కలిగి ఉంటారని ఈ ముడి అర్థం. రెండో ముడి బంధాన్ని తెలియజేస్తుంది. మూడో ముడి, ప్రపంచాన్ని సూచిస్తుంది. ప్రపంచంలోని అందరినీ గౌరవించాలని ఈ ముడి తెలుపుతుంది. అగ్ని దేవుడు పవిత్రత, శక్తికి చిహ్నం. కొత్త దంపతులు అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేయడం ద్వారా, దేవుడి ఆశీర్వాదాన్ని కోరుకుంటారు.


Crispy Wada Recipe : టేస్టీ టేస్టీ వడలు.. తక్కువ పదార్థాలతో సింపుల్​గా చేసుకోగలిగే రెసిపీ ఇది

Tasty Wada Recipe : ఛాయ్​కి కాంబినేషన్​గా ఏమైనా తినాలనుకుంటే.. లేదా హెల్తీ స్నాక్స్ తీసుకోవాలనుకుంటే కాబూలీ చనాతో వడలు చేసుకోవచ్చు. ఇది పిల్లల నుంచి పెద్దలవరకు అందరికీ నచ్చే రెసిపీ ఇది. పలు రెస్టారెంట్స్​లో కూడా దీనిని చేస్తారు. అయితే ఈ టేస్టీ రెసిపీని చేయడానికి అవసరమయ్యే పదార్థాలు ఏమిటి? ఎలా తయారు చేయాలి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు - 2 చిన్నవి ఉప్పు - రుచికి తగినంత పెద్ద శనగలు - 1 కప్పు బేకింగ్ పౌడర్ - అర...


Gold chain for dog | పెంపుడు కుక్కకు రూ.2.5 లక్షల బంగారు గొలుసు.. బర్త్‌ డే గిఫ్ట్‌ అదిరిందిగా..!

Gold chain for dog | కొందరు పెంపుడు కుక్కలపై అమితమైన ప్రేమ చూపిస్తుంటారు. ఖరీదెంతయినా లెక్క చేయకుండా ఆరోగ్యకరమైన తిండిపెడుతారు. పసిపాపకు చేయించినట్టు స్నానం చేయిస్తారు. అది ఏమాత్రం అస్వస్థతకు గురైనా ఎత్తుకుని ఆస్పత్రికి పరుగులు తీస్తారు. ఆందోళనకు గురవుతారు. పిల్లలకు కొనిపెట్టినట్టే వాటికి కూడా ఆడుకోవడానికి బొమ్మలు కొనిపెడుతారు. ముంబైకి చెందిన ఒక మహిళ మాత్రం ఇంతకు మించే చేసింది.


చాణక్య నీతి ప్రకారం.. చేతినిండా డబ్బులుండాలంటే ఈ చిట్కాలను ఫాలో అవ్వండి

కొంతమంది ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటారు. అయినా చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండదు. అవసరానికి డబ్బు ఉండక తిప్పలు పడుతుంటారు. చాణక్య నీతి ప్రకారం.. మీరు గనుక కొన్ని చిట్కాలను ఫాలో అయ్యారంటే మీ చేతినిండా డబ్బు ఉంటుంది. ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించడానికి ఎంతో కష్టపడతారు. సంపాదించిన దాంట్లో కొంత మొత్తాన్న పొదుపు చేస్తారు. అప్పుడే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు వచ్చినా.. వాటిని ఎదుర్కోగలమనే ధైర్యం ఉంటుంది. నిజానికి మన పొదుపులే మనల్ని అప్పుల నుంచి కాపాడుతాయి. కానీ...


టీ తాగేట‌ప్పుడు వీటిని అస్స‌లు తిన‌కండి!

చాలా మందికి టీ తాగే సమయంలో విభిన్న స్నాక్స్‌ తినే అలవాటు ఉంటుంది. టీతో పాటు స్నాక్స్‌ తింటూ బిజీ లైఫ్ నుంచి రిలాక్స్ అవుతాం. అయితే టీ టేస్ట్‌ను పూర్తిగా ఆస్వాదించాలంటే కొన్ని ఆహార ప‌దార్థాల‌ను ఎట్టి ప‌రిస్థితుల్లో టీతో తీసుకోకూడదు.


నిరుద్యోగులకు శుభవార్త... ఇంటర్వ్యూకి హజరైతే చాలు జాబ్ పక్కా..!!

జాబ్ మేళా అంటేమొదటి ప్రాధాన్యత ఇచ్చేది ఆవ్యక్తి స్కిల్, వే ఆఫ్ స్టైల్, మాట్లాడే తీరు, ఇచ్చే సమాధానం,మాట్లాడే భాష, వారి చదువు సంధ్యలు , పొందిన మార్కులు వీటిని ఆధారం చేసుకొని ఇంటర్వ్యూస్ తీసుకొంటారు. వీరు అడిగే క్రమాన్ని చక్కగా వివరణ ఇస్తే జాబ్ పక్కా... ఒక్కసారి జాబ్ వరిస్తే మంచి సంవత్సర ప్యాకేజ్ తో ను వర్క్ ఎక్సపీరియన్స్ తో ఉన్నత పదవులను కూడ అధికమించవచ్చు.అదేవిధంగా ఎంతో మంది నిరుద్యోగులు ఉదోగ్యం కోసం ఆరాట పడుతుంటారు. వీరి ప్రతిభను బట్టి జాబ్స్...


Saturn Retrograde 2024: కుంభంలో నవంబర్ వరకు శని తిరోగమనం.. ఈ 5 రాశుల వారికి ఆకస్మిక ధన లాభం..!

Saturn Retrograde 2024 జ్యోతిష్యం ప్రకారం, జూన్ 29వ తేదీన శని దేవుడు కుంభరాశిలో తిరోగమనం చెందనున్నాడు. శని ప్రభావంతో 5 నెలల పాటు ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం కలగనుంది. ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో ఇప్పుడే చూసెయ్యండి.


పేరెంట్స్ చేసే ఈ తప్పులు పిల్లల్ని స్వార్థపరుల్ని చేస్తాయి!

తల్లిదండ్రులు చేసే కొన్ని తప్పుల వల్ల పిల్లలు స్వార్థపరులుగా మారతారు. అవేంటో తెలుసుకుని జాగ్రత్తపడండి.


పెళ్లి విషయంపై శ్రీముఖి రియాక్షన్.. అంటే..?

Sreemukhi Marriage శ్రీముఖి తాజాగా తన అభిమానులతో ముచ్చట్లు పెట్టింది. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ వచ్చింది. కొందరు వయసు ఎంత అని అడిగితే.. ఇంకొందరు పెళ్లి ఎప్పుడు అని అడిగారు. ఇంకొందరు డ్యాన్స్ వీడియోలను షేర్ చేయమని అడిగారు.. బుల్లితెరను మత్రం వదిలి పెట్టకు.. నీ ఎంటర్టైన్మెంట్ మాకు కావాలి అంటూ శ్రీముఖిని వేడుకున్నారు. బుల్లితెరపై శ్రీముఖికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలానే నెట్టింట్లోనూ మిలియన్ల ఫాలోవర్లతో...


Smart app for Skin: ఈ మొబైల్ యాప్‌లో ఫోటో తీస్తే చాలు మీ చర్మ సమస్యలు గురించి చెప్పేస్తుంది

Smart app for Skin: కొన్ని మొబైల్ యాప్స్ ఇన్ స్టాల్ చేసుకోవడం ద్వారా జీవితాన్ని సులభతరం చేసుకోవచ్చు. ఈ యాప్ చర్మ సమస్యలు గురించి సులువుగా చెబుతుంది.


Semiya Upma: ఘుమఘుమలాడే సేమియా రెసిపీ ఈ సింపుల్‌ టిప్స్‌తో తయారు చేసుకోండి..!

Semiya Upma Recipe: సేమియా ఉప్మా ఒక సులభమైన, రుచికరమైన వంటకం. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఇది ఫైబర్, ఐరన్ ఇతర ముఖ్యమైన పోషకాలు ఉంటాయి.


తిరుమలలో మహిళలు పూలు పెట్టుకోరు.. ఎందుకో తెలుసా?

సాధారణంగా భక్తులు సంప్రదాయ వస్త్ర ధారణలో ఆలయాలకు వెళ్తారు. ప్రత్యేకించి మహిళలైతే సంప్రదాయ వస్త్రాలు ధరించి.. నుదిటిపై కుంకుమ, తలలో పూలు పెట్టుకుంటారు. ఆలయాలకు వెళ్లేవారిని ఇలాగే చూస్తుంటాం. అయితే, కలియుగ ప్రత్యేక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో మాత్రం మహిళలు పూలు పెట్టుకోరు. ఎందుకో తెలుసా.... ఇల వైకుంఠం తిరుమల. కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే శ్రీ శ్రీనివాసుడు కొలువైన తిరుమల క్షేత్రాన్ని ఏటా కోట్లాది మంది భక్తులు సందర్శిస్తారు....


Shani Bhagwan: శనివారం రోజు ఈ తప్పులు అస్సలు చేయోద్దు.. జ్యోతిష్యులు ఏమంటున్నారంటే..?

Lord shani dev: శనిదేవుడిని కర్మ ప్రభువుగా చెప్తుంటారు. ఆయన మనం చేసిన మంచి, చెడులకు అదే విధంగా ఫలితాలు కూడా ఇస్తుంటారు. ద్వాదశ రాశులపై శనిప్రభావం ఎంతో కీలకంగా ఉంటుందని కూడా జ్యోతిష్యులు చెప్తుంటారు.


Nice Idea: మిద్దెపై తోట.. ఈ స్కూల్ కరెస్పాండెంట్ ఐడియా అదుర్స్..

ఏ ఒక్క ఆహార పదార్థాలు కూరగాయలు కొనాలన్న భయం. ఎటు చూసినా రసాయనాలతో పాటు కాలుష్యంతో కూడిన వాతావరణం, (కూరగాయలు) ఆహార పదార్థాలు నిత్యం తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. వీటిఫలితంగా అనారోగ్యంతో పాటు అనేక ప్రాణాంతక రోగాలను కొని తెచ్చుకుంటున్నామని వైద్యులు చెబుతున్నారు. కొంత కాలంగా వ్యవసాయ రంగంలో కూరగాయల సాగులో కొంత మార్పు కనిపిస్తోందనే చెప్పాలి. రైతన్నలు సైతం సేంద్రియ పంటల వైపు మొగ్గుచూపుతున్నారని వ్యవసాయ శాఖ అధికారులు కూడా చెబుతున్నారు. మరికొందరు గృహిణులు, విద్యావంతురాలు, మహిళలు సుందరమైన ఇంటి చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆరోగ్యమైన జీవితాన్ని ప్రతిఒక్కరూ కోరుకుంటారు.. ఇష్టపడతారు ఆస్వాదిస్తారని చెప్పాలి. అందులో భాగంగానే మహా నగరాల్లో, పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా మహిళమణులు (మిద్దె తోటలను)బంగ్లా పై సాగు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఆలోచింపజేస్తున్నారు. ఖాళీగా ఉన్న మిద్దెపై రూఫ్ గార్డెన్ లను ఏర్పాటు చేసి పండ్లు, పూలు, వెజిటేబుల్స్ (కూరగాయలు) పండిస్తున్నారు. ఎలాంటి రసాయన ఎరువులను వినియోగించకుండా కేవలం సేంద్రియ పద్ధతిలో సాగుచేస్తూ..ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటున్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పద్మనగర్ లో ఓ ప్రైవేటు స్కూల్ కరస్పాండెంట్ బుర్ర రాధాకృష్ణ ప్రసాద్ గౌడ్ తమ ఇంటిపై మిద్దె తోటను ఏర్పాటు చేసి మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారనే చెప్పవచ్చు. మిద్దెతోటల సాగుపై రోజురోజుకు పట్టణ ప్రజల్లో ఆసక్తి పెరుగుతుందనే చెప్పాలి. ఎందుకంటే గతంలో మనం కూడా చాలా వరకు మహానగరాల్లో ఇలాంటి వార్తా కథనాలను చూసాం. రసాయనాలతో పండించిన పంటలు అనారోగ్యాలకు గురిచేస్తున్నాయని, ఈ సమస్యకు మిద్దె తోటలే పరిష్కారమని సిరిసిల్ల పట్టణం పద్మానగర్ కు చెందిన బుర్ర రాధాకృష్ణ ప్రసాద్ గౌడ్ భావించామని లోకల్18కి తెలిపారు. తమకి కావల్సిన వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ ఇంటి మేడపైన పండించవచ్చునని, గత రెండు సంవత్సరాల క్రితమే మిద్దె తోట సాగును ప్రారంభించామని, కరోనా మహమ్మారి విపత్తు విజృంభించిన సందర్భంలో తనకు దొరికిన విలువైన సమయాన్ని బంగ్లా పై( మిద్దెతోట సాగుకు) ఉపయోగించుకున్నట్లు చెప్పారు.ఈ క్రమంలో తన ఇంట్లోకి కావలసిన నాణ్యమైన తాజా ఆకుకూరలు,కూరగాయలు,పండ్లు సాగు చేస్తుండడంతో ఆరోగ్యంతో పాటు ఆహ్లాదాన్ని పొందుతున్నారనే చెప్పాలి. ఆమె తమకున్న కొద్దిపాటి టెర్రస్‌ పై ఏర్పాటు చేసిన గార్డెన్‌లో ఇప్పుడు బీర, సొర, కాకర, టమాటా, బెండ, పచ్చిమిర్చి, వంకాయ, మునగ, చామగడ్డ, దొండ , చిక్కుడు తదితర కూరగాయలతోపాటు.. బచ్చలి కూర, పాలకూర, చుక్కకూర, మెంతి, పుదీనా, కొత్తిమీర, గోంగూర లాంటి ఆకుకూరలు పండుతున్నాయని, దానిమ్మ, సపోటా, జామ, బొప్పాయి, ద్రాక్ష, డ్రాగన్‌ ఫ్రూట్‌ వగైరా, ఆపిల్ ఇలా చాలారకాల ఫ్రూట్స్ పండిస్తున్నామని చెప్పారు. వీటితోపాటు మధుమేహం, కిడ్నీలో రాళ్ళు లాంటి ఎన్నో వ్యాధులకు ఉపయోగపడే రణపాల, తెల్లగజ్జర లాంటి ఔషద మొక్కలను పెంచుతున్నామని, వీటికి రసాయన ఎరువులు కాకుండా తమ ఇంట్లోని బెల్లం, ఆవుపేడ, బియ్యం నీళ్లు, పిండి పదార్థాలు, కుళ్లిన కూరగాయలు, పండ్ల తొక్కల లాంటి వ్యర్థ పదార్థాలను కంపోస్టు చేసి సేంద్రియ ఎరువులుగా వాడుతున్నామని వివరించారు. దాంతో రోజుకి కిలో నిండి రెండు కిలోల వరకు నాణ్యమైన తాజా ఆకుకూరలు, కూరగాయలు వస్తున్నాయని మిద్దె తోటల ద్వారా.. వీటిని నిత్య ఆహారంలో, వంటలకు ఉపయోగించడంతో సంపూర్ణ ఆరోగ్యవంతమైన జీవనాన్ని కొనసాగిస్తున్నామని, రుచికరమైన వెజిటేబుల్స్ కూర సిద్ధమవుతుందని చెబుతున్నారు. చాలామంది మిద్దె తోటలు ఏర్పాటు చేసుకోవాలంటే చాల ఖర్చుతో కూడుకున్నదన్న అపోహలో ఉంటారని, మన ఇంట్లోనే వృధాగా ఉన్న వస్తువులతో పెద్దగా ఖర్చు లేకుండానే సేద్యం చేసుకోవచ్చునని బుర్ర రాధ వివరించారు. కూరగాయల మొక్కల మధ్య సుగంధ ఔషధ మొక్కలు పెంచితే మంచిదని, అన్నింటికీ ఒకే రకమైన సేంద్రియ ఎరువులు కాకుండా మొక్కలకు తగిన సేంద్రియ ఎరువు అందిస్తే మొక్కల ఎదుగుదల బాగుంటుందని, ఔషద మొక్కలు వాడటం వల్ల తన భర్త కిడ్నిలోని 12 మిల్లీమీటర్ల రాయి పూర్తిగా తనకి కరిగిపోయిందని, ఇప్పుడు ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని ఆనందం వ్యక్తం చేస్తూ..లోకల్18కి తెలిపారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం పచ్చటి మొక్కల మధ్య తిరగడం మనసుకు ఉల్లాసాన్ని ఆహ్లాదాన్ని ఉత్సాహాన్ని కలిగిస్తుందని, ఇలాగే మహిళలందరూ మిద్దెతోటలపై మొగ్గు చూపాలని, దాంతో ఎలాంటి రోగాలు దరిచేరవని, నాణ్యమైన తాజా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ సాగు చేసుకోవచ్చని చెప్తున్నారు. మనకున్న ఆసక్తికి కాస్త సృజనాత్మకతను జోడిస్తే మిద్దెతోటల పెంపకానికి ఎలాంటి ఇబ్బంది ఖర్చు ఉండదని చెప్తున్నారు. తోటలను పెంచడం హాబీగా మార్చుకోవాలని, మొక్కలను పెంచడంతోపాటు వాటితో అనుబంధాన్ని పెంచుకోవాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.


Egg Pulusu: గుడ్డు పులుసు తయారు చేయండి.. ఈ సింపుల్ టిప్స్‌తో..!

Egg Pulusu Recipe: గుడ్డు పులుసు అనేది ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక ప్రసిద్ధ వంటకం. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. తయారు చేయడం చాలా సులభం.


కొందరి మూత్రం తెల్లగా పాలలా ఎందుకు ఉంటుంది? ఎర్రగా వస్తే ఏమవుతుంది?

మూత్రం రంగు మనలో ఆరోగ్య సమస్యలను సూచిస్తున్నప్పటికీ, మనం తినే ఆహారాలు, తీసుకునే మందులను బట్టి కూడా రంగు కొన్నిసార్లు మారుతుంటుంది. ముఖ్యంగా మనం తాగే నీటితో మూత్రం రంగు మారొచ్చు.


Astrology 7-7-2024: వారు మనసు మాట వింటే, ఆశ్చర్యపోయే ఫలితాలు చూస్తారు

Rasi Phalalu 7-7-2024:జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. రాశి ఫలాలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. నక్షత్రాల గమనం ఆధారంగా వాటిని జ్యోతిష్య నిపుణులు అంచనా వేస్తుంటారు. జులై 7, ఆదివారం నాడు దిన ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మేషం (Aries):మీరు కొత్త కనెక్షన్‌ని కనుగొనవచ్చు లేదా పాత రిలేషన్‌ని తిరిగి ప్రారంభించవచ్చు. ప్రేమను స్వీకరించండి, వల్నెరబిలిటీకి ఓపెన్‌గా ఉండండి. వర్క్‌లో, మీరు మరింత క్రియేటివ్‌, ఇన్‌స్పైర్డ్‌గా ఫీల్‌ అవుతారు. ఇది కొత్త అవకాశాలకు దారి తీస్తుంది. సెల్ఫ్‌ కేర్‌ ప్రాక్టీస్‌ చేయడం ద్వారా మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ధ్యానం లేదా జర్నలింగ్ వంటి మైండ్‌ఫుల్ యాక్టివిటీలు మీకు శాంతి, స్పష్టతను తెస్తాయి. మెమరబుల్‌ అడ్వెంచర్స్‌ కోసం స్పాంటేనియస్‌ ట్రావెల్‌ ప్లాన్స్‌కి ఓపెన్‌గా ఉండండి. మీ అదృష్ట సంఖ్య 41, అదృష్ట రంగు మణి. చార్మ్‌ లేదా టాలిస్మాన్ కలిగి ఉండటం వల్ల మీకు అదనపు రక్షణ లభిస్తుంది. వృషభం (Taurus):రిలేషన్‌షిప్‌లో స్టెబిలిటీ, కమిట్‌మెంట్‌ హైలైట్ అవుతాయి. మీ భాగస్వామితో దీర్ఘకాలిక లక్ష్యాల గురించి చర్చించడానికి ఇది మంచి సమయం. పనిలో, విజయం కోసం ప్రాక్టికాలిటీ, ఎఫిషియన్సీ పై దృష్టి పెట్టండి. బ్యాలెన్స్‌డ్‌ డైట్‌, ఆనందించే శారీరక శ్రమలతో మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. తోటపని లేదా వంట చేయడం వంటి మైండ్‌ఫుల్ యాక్టివిటీలు మీరు గ్రౌన్దేడ్‌గా భావించడంలో సహాయపడతాయి. ట్రావెల్‌ ప్లాన్స్‌ సాఫీగా సాగేందుకు, అన్నింటినీ ముందుగానే ఆర్గనైజ్‌ చేయండి. అదృష్ట సంఖ్య 2, అదృష్ట రంగు నేవీ బ్లూ. క్రిస్టల్ కీచైన్ లేదా బ్రాస్‌లెట్ కలిగి ఉండటం మీకు అదృష్టాన్ని తెస్తుంది. మిథునం (Gemini):మీనింగ్‌ఫుల్‌ రిలేషన్‌షిప్‌ కోసం మీ చార్మ్‌, తెలివిని ఉపయోగించండి. పనిలో, కమ్యూనికేషన్, నెట్‌వర్కింగ్ కీలకం. కొలాబరేటివ్‌ ప్రాజెక్టులు సానుకూల ఫలితాలను తెస్తాయి. ఆరోగ్యం కోసం, డ్యాన్స్ లేదా పజిల్స్ వంటి మీ బ్రెయిన్‌, శరీరాన్ని ఉత్తేజపరిచే కార్యకలాపాల్లో పాల్గొనండి. లోతైన శ్వాస వ్యాయామాలు లేదా యోగా వంటి మైండ్‌ఫుల్ యాక్టివిటీలు బ్యాలెన్స్‌ కనుగొనడంలో మీకు సహాయపడతాయి. మీకు ట్రావెల్‌ ప్లాన్స్‌ ఉంటే, కొత్త అనుభవాలు, సంస్కృతులకు ఓపెన్‌గా ఉండండి. మీ అదృష్ట సంఖ్య 93, అదృష్ట రంగు స్కై బ్లూ. క్రిస్టల్ లేదా లాకెట్టును కలిగి ఉండటం వల్ల సానుకూల శక్తిని పొందవచ్చు. కర్కాటకం (Cancer):మీకు, మీ భాగస్వామికి సేఫ్‌, లవింగ్‌ స్పేస్‌ని క్రియేట్‌ చేయండి. పనిలో, సరైన నిర్ణయాలు తీసుకోవడానికి మీ అంతర దృష్టిని విశ్వసించండి. మీ ఆరోగ్యం కోసం సెల్ఫ్‌ కేర్‌, మానసిక శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వండి. జర్నలింగ్ లేదా థెరపీ వంటి మైండ్‌ఫుల్ యాక్టివిటీలు స్పష్టత, హీలింగ్‌ అందించగలవు. ప్రయాణం కోసం, సౌకర్యం, పరిచయాన్ని అందించే డెస్టినేషన్లు ఎంచుకోండి. మీ అదృష్ట సంఖ్య 24, అదృష్ట రంగు బేబీ బ్లూ. కుటుంబ వారసత్వం లేదా ఫోటో మీకు భద్రతా భావాన్ని కలిగిస్తుంది. సింహం (Leo):ప్రేమను ఆకర్షించడానికి మీ విశ్వాసం, తేజస్సును ఉపయోగించండి. పనిలో, మీ నాయకత్వ నైపుణ్యాలు ప్రకాశిస్తాయి, ఇది కొత్త బాధ్యతలు లేదా ప్రమోషన్‌లకు దారి తీస్తుంది. మీ ఆరోగ్యానికి ఆనందాన్ని, శక్తిని కలిగించే శారీరక కార్యకలాపాల్లో పాల్గొనండి. పెయింటింగ్ లేదా వాయిద్యం వాయించడం వంటి మైండ్‌ఫుల్ యాక్టివిటీలు మీ క్రియేటివిటీని ఎక్స్‌ప్రెస్‌ చేయడంలో సహాయపడతాయి. మీ ప్యాషన్‌, క్యూరియాసిటీని రేకెత్తించే డెస్టినేషన్స్‌కి ట్రావెల్‌ చేయండి. మీ అదృష్ట సంఖ్య 15, అదృష్ట రంగు రాయల్ బ్లూ. లక్కీ చార్మ్‌ లేదా నాణెం కలిగి ఉండటం వల్ల మీకు సమృద్ధి చేకూరుతుంది. కన్య (Virgo):ఓపెన్ కమ్యూనికేషన్, ట్రస్ట్ ద్వారా మీ రిలేషన్‌లో బలమైన పునాదిని నిర్మించుకోండి. పనిలో, డీటైల్స్‌పై ఫోకస్‌, ఆర్గనైజేషన్‌ స్కిల్స్‌ విజయానికి దారితీస్తాయి. మీ లక్ష్యాలకు కట్టుబడి ఉండండి. ఆరోగ్యం కోసం, హెల్తీ రొటీన్‌ ఏర్పాటు చేసుకోండి. బ్యాలెన్స్‌డ్‌ డైట్‌ మెయింటైన్‌ చేయండి. మీ స్థలాన్ని ఆర్గనైజ్‌ చేయడం వంటి మైండ్‌ఫుల్ యాక్టివిటీలు శాంతిని కలిగిస్తాయి. వ్యక్తిగత వృద్ధిని, సెల్ఫ్‌ రిఫ్లెక్షన్‌ అందించే ట్రావెల్‌ డెస్టినేషన్స్‌ ఎంచుకోండి. మీ అదృష్ట సంఖ్య 66, అదృష్ట రంగు స్టీల్‌ బ్లూ. లక్కీ పెన్ క్లారిటీ తెస్తుంది. తుల (Libra):మీ అవసరాలు, మీ భాగస్వామి అవసరాలపై దృష్టి పెట్టండి. పనిలో, సహకారం, డిప్లమసీ కీలకం. మీ విలువలకు అనుగుణంగా ఉండే ప్రాజెక్ట్‌లను వెతకండి. ఆరోగ్యం కోసం, పని, విశ్రాంతి మధ్య బ్యాలెన్స్‌ కనుగొనండి. సెల్ఫ్‌ కేర్‌కి ప్రాధాన్యం ఇవ్వండి. కృతజ్ఞత పాటించడం లేదా ప్రకృతిలో సమయం గడపడం వంటి మైండ్‌ఫుల్ యాక్టివిటీలు అంతర్గత శాంతిని కలిగిస్తాయి. సామరస్యం, అందాన్ని అందించే ట్రావెల్‌ డెస్టినేషన్లు సెలక్ట్‌ చేసుకోండి. మీ అదృష్ట సంఖ్య 12, మీ అదృష్ట రంగు పాస్టెల్ బ్లూ. లక్కీ చార్మ్‌ లేదా నెక్లెస్ కలిగి ఉండటం సమతుల్యత, సామరస్యాన్ని తీసుకురావచ్చు. వృశ్చికం (Scorpio):రిలేషన్‌షిప్‌లో ఇంటెన్సిటీని, వల్నెరబిలిటీని స్వీకరించండి. పనిలో, మీ సంకల్పం, ఆశయం విజయానికి దారి తీస్తాయి. మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి, కొత్త అవకాశాలకు సిద్ధంగా ఉండండి. ఆరోగ్యం కోసం, మీ శరీర అవసరాలను వినండి, శ్రేయస్సును ప్రోత్సహించే కార్యకలాపాల్లో పాల్గొనండి. ధ్యానం లేదా జర్నలింగ్ వంటి మైండ్‌ఫుల్ యాక్టివిటీస్ క్లారిటీని తీసుకురాగలవు. సెల్ఫ్‌ డిస్కవరీ, వ్యక్తిగత వృద్ధిని అందించే ట్రావెల్‌ డెస్టినేషన్లు ఎంచుకోండి. మీ అదృష్ట సంఖ్య 4, మీ అదృష్ట రంగు ఇండిగో. అదృష్ట నాణెం లేదా ఉంగరం పరివర్తనను తీసుకురావచ్చు. ధనస్సు (Sagittarius):మీ ఫ్రీ స్పిరిట్‌ని స్వీకరించండి, ఎక్సైటింగ్‌ రిలేషన్‌ కోసం వెతకండి. పనిలో, మీ ఉత్సాహం కొత్త అవకాశాలను ఆకర్షిస్తుంది. మీ లక్ష్యాలకు కట్టుబడి ఉండండి. ఆరోగ్యం కోసం, శారీరక, మానసిక శ్రేయస్సును ప్రోత్సహించే కార్యకలాపాల్లో పాల్గొనండి. కొత్త అభిరుచులను అన్వేషించడం లేదా కొత్తది నేర్చుకోవడం వంటి మైండ్‌ఫుల్ యాక్టివిటీలు ఆనందాన్ని కలిగిస్తాయి. మీకు ప్రయాణ ప్రణాళికలు ఉంటే, కొత్త ప్రదేశాలు, సంస్కృతులను అన్వేషించడానికి సిద్ధంగా ఉండండి. మీ అదృష్ట సంఖ్య 10, మీ అదృష్ట రంగు టీల్ బ్లూ. ట్రావెల్ టాలిస్మాన్ లేదా మ్యాప్ అదృష్టాన్ని తెచ్చిపెట్టవచ్చు. మకరం (Capricorn):నమ్మకం, కమిట్‌మెట్‌ ద్వారా రిలేషన్స్‌ పెంచుకోండి. పనిలో, క్రమశిక్షణ, అంకితభావం విజయానికి దారి తీస్తాయి. మీ లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించండి. ఆరోగ్యం కోసం, ఆరోగ్యకరమైన దినచర్యలను ఏర్పాటు చేసుకోండి. సెల్ఫ్‌ కేర్‌కి ప్రాధాన్యత ఇవ్వండి. యోగా లేదా ధ్యానం వంటి మైండ్‌ఫుల్ యాక్టివిటీలు ప్రశాంతత, స్థిరత్వాన్ని కలిగిస్తాయి. విశ్రాంతి, కొత్త ఎనర్జీని అందించే ట్రావెల్‌ డెస్టినేషన్లు ఎంచుకోండి. మీ అదృష్ట సంఖ్య 55, మీ అదృష్ట రంగు నేవీ బ్లూ. లక్కీ చార్మ్‌ లేదా బ్రాస్‌లెట్ అదృష్టాన్ని తెస్తుంది. కుంభం (Aquarius):మీ మనస్సును ఉత్తేజపరిచే రిలేషన్స్‌ వెతకండి. పనిలో, మీ క్రియేటివిటీ విజయానికి దారి తీస్తుంది. కొత్త ఆలోచనలు స్వీకరించండి. ఆరోగ్యం కోసం, మీ బ్రెయిన్‌, శరీరాన్ని యాక్టివ్‌గా ఉంచే కార్యకలాపాల్లో పాల్గొనండి. మేధోమథనం లేదా మేధోపరమైన చర్చలు వంటి మైండ్‌ఫుల్ యాక్టివిటీలు సంతృప్తిని తీసుకొస్తాయి. అన్వేషణ, లెర్నింగ్‌ అందించే ట్రావెల్‌ డెస్టినేషన్లు ఎంచుకోండి. మీ అదృష్ట సంఖ్య 88, మీ అదృష్ట రంగు ఎలక్ట్రిక్ బ్లూ. అదృష్ట లాకెట్టు స్ఫూర్తిని కలిగిస్తుంది. మీనం (Pisces):మీ అంతర దృష్టిని విశ్వసించండి. మీ హృదయం మీకు మార్గనిర్దేశం చేయనివ్వండి. పనిలో, మీ దయగల స్వభావం, కళాత్మక సామర్థ్యాలు ప్రకాశిస్తాయి. క్రియేటివిటీ, సానుకూల ప్రభావం కోసం అవకాశాలను వెతకండి. ఆరోగ్యం కోసం సెల్ఫ్‌ కేర్‌, మానసిక శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వండి. సెల్ఫ్‌ లవ్‌ లేదా క్రియేటివ్‌ హాబీలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. విశ్రాంతి, ఆత్మపరిశీలనను అందించే ట్రావెల్‌ డెస్టినేషన్లు ఎంచుకోండి. మీ అదృష్ట సంఖ్య 1, మీ అదృష్ట రంగు సీ బ్లూ. డ్రీమ్‌క్యాచర్ మీకు శాంతి, ప్రశాంతతను కలిగిస్తుంది. Disclaimer: ఈ కథనం ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. న్యూస్18 దీనిని ధృవీకరించలేదు. ఇది కచ్చితంగా వాస్తవమేనని చెప్పేందుకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు.


ఒక నెల రోజులు నాన్ వెజ్ మానేస్తే కలిగే మార్పులివే!

ఈరోజుల్లో చాలామంది నాన్ వెజ్ అంటే ఇష్టంగా తింటున్నారు. అయితే ఒక నెల పాటు నాన్ వెజ్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.