Trending:


బ్రహ్మముడికి అంటే ఏమిటి? దానికి అంత ప్రాముఖ్యత ఉందా!

హిందువులు వివాహ వేడుకలలో అనేక ఆచారాలు, సంప్రదాయాలతో పాటిస్తుంటారు. తాళిబొట్టు కట్టడం, మెట్టెలు పెట్టడం, ఏడడుగులు నడవడం వంటి సంప్రదాయాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ ఆచారాల ద్వారా ఇద్దరు వ్యక్తులు పవిత్రమైన అనుబంధంలోకి అడుగు పెడతారు. హిందూ వివాహాల్లో అలాంటి ఒక ముఖ్యమైన సంప్రదాయం బ్రహ్మముడి (గత్‌బంధన్). ఈ ఆచారంలో వధువు దుపట్టాను వరుడు ధరించే పింక్ స్కార్ఫ్‌/కండువా/పంచెతో కలిపి ముడి వేస్తారు. ఇది వారి ఐక్యతను సూచిస్తుంది. జీవితాంతం కలిసి ఉండాలనే కోరికను సూచిస్తుంది. బ్రహ్మముడి ప్రాముఖ్యత : బ్రహ్మముడి అనేది జీవితాన్ని కలిసి గడపాలని నిర్ణయించుకున్న ఇద్దరి వ్యక్తుల మధ్య ఏర్పడిన పవిత్రమైన బంధానికి సింబల్‌గా నిలుస్తుంది. ఈ ఆచారంలో వరుడి కండువా (పొడవైన స్కార్ఫ్), మహిళ దుపట్టాను ఒక పవిత్రమైన దారంతో కలిపి ముడి వేస్తారు. ఈ ముడి ద్వారా తాము లైఫ్ లాంగ్ ఒకటిగా ఉంటామని వధూవరులు ప్రమాణం చేస్తారు. దీని ద్వారా ఒకరినొకరు గౌరవించుకుంటామని, ప్రేమించుకుంటామని కూడా ప్రామిస్ చేస్తారు. ఒక యువకుడు, ఒక యువతి ఒకరితో ఒకరు జీవితాన్ని పంచుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, ఆ బంధాన్ని పవిత్రంగా గుర్తించడానికి ఒక ముడిని కడతారు. ఇది వధూవరుల మధ్య జీవితాంతం నెలకొనే అవినాభావ బంధాన్ని సూచిస్తుంది. హిందూ వివాహాల్లో బ్రహ్మముడి : హిందూ వివాహంలో, వరుడి సోదరి బ్రహ్మముడిని కడుతుంది. ఈ ముడి ద్వారా వధువును కొత్త కుటుంబ సభ్యురాలిగా అంగీకరిస్తున్నామని వరుడు, అతడి కుటుంబ సభ్యులు తెలియజేస్తారు. పెళ్లిలో వధూవరులు తమ మెడల చుట్టూ కండువాలను మార్చుకోవడం ఒక ముఖ్యమైన ఆచారం. ఈ స్కార్ఫ్స్‌ వారి మధ్య ఏర్పడిన శాశ్వత బంధాన్ని సూచిస్తాయి. వరుడు తన భార్యకు కండువాను బహుమతిగా ఇవ్వడం ద్వారా, ఆమెను తన జీవితంలో ఒక భాగంగా స్వీకరిస్తానని, ఎల్లప్పుడూ రక్షిస్తానని, ఆమెను ప్రేమిస్తానని వాగ్దానం చేస్తాడు. వధువు తన భర్తకు తన స్కార్ఫ్‌ను బహుమతిగా ఇవ్వడం ద్వారా, అతడిని గౌరవిస్తానని, అతడికి విధేయురాలిగా ఉంటానని, అతనితో కలిసి జీవితాన్ని పంచుకుంటానని వాగ్దానం చేస్తుంది. మరణం వరకు ఒకరినొకరు ప్రేమించుకోవడానికి, గౌరవించుకోవడానికి, మద్దతు ఇవ్వడానికి వారు ప్రమాణం కూడా చేస్తారు. ఈ ఆచారం జరిగిన తర్వాత, కొత్త దంపతులు తాము మానసికంగా, భావోద్వేగపరంగా, శారీరకంగా ఒకరితో ఒకరు కలిసి ఉంటామని నమ్ముతారు. ఇది ఒకే ఆత్మగా మారిన ఇద్దరి వ్యక్తుల సంబంధాన్ని సూచిస్తుంది. బ్రహ్మముడి ద్వారా, వధూవరులు తమ ఆనందాలు, బాధలు, ఆస్తులు, బాధ్యతలను పంచుకునే జీవితాన్ని గడపాలని నిర్ణయించుకుంటారు. బ్రహ్మముడి సమయంలో వరుడి పొడవైన కండువాకు ఐదు పవిత్ర వస్తువులు జోడిస్తారు. అవి నాణెం, పువ్వు, బియ్యం, పసుపు, దుర్వా గడ్డి. ఈ వస్తువులు వారి జీవితంలో సంతోషం, శ్రేయస్సు, సమృద్ధిని సూచిస్తాయి. నాణెం డబ్బుపై ప్రతి ఒక్కరికీ సమాన హక్కు ఉందని, అందరి అవసరాలకు అనుగుణంగా దానిని ఉపయోగించాలని సూచిస్తుంది. పూలు, వధూవరులు ఒకరితో ఒకరు సంతృప్తిగా ఉంటారని సూచిస్తాయి. పసుపు, వధూవరులు ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారని సూచిస్తుంది. దుర్వా గడ్డిలాగా వధూవరులు ఇద్దరూ చిర యువ, ఉత్సాహంగా ఉండాలని సూచిస్తుంది. బియ్యం , జంటలో ఎవరూ ఆకలితో బాధపడకుండా ఉండేంతగా తినాలని సూచిస్తుంది. మూడు ముడులు : బ్రహ్మముడిలో మూడు ముడుల్లో ప్రతి ముడికి ఓ ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. మొదటి ముడి హక్కులను సూచిస్తుంది. దంపతులు ఒకరిపై ఒకరు హక్కులు కలిగి ఉంటారని ఈ ముడి అర్థం. రెండో ముడి బంధాన్ని తెలియజేస్తుంది. మూడో ముడి, ప్రపంచాన్ని సూచిస్తుంది. ప్రపంచంలోని అందరినీ గౌరవించాలని ఈ ముడి తెలుపుతుంది. అగ్ని దేవుడు పవిత్రత, శక్తికి చిహ్నం. కొత్త దంపతులు అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేయడం ద్వారా, దేవుడి ఆశీర్వాదాన్ని కోరుకుంటారు.


వర్షాకాలం.. స్పైసీ సమోసాలను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో తెలుసా

వర్షాకాలం.. స్పైసీ సమోసాలను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో తెలుసా రోజంతా పనిలో అలసిపోయినప్పుడు... సాయంత్రం రెండు సమోసాలు తిని, కప్పు చాయ్ తాగితే ఆ మజానే వేరు. గంటలుగా పడిన శ్రమ నిమిషాల్లో మాయమవుతుంది. అయితే బయట దొరికే సమోసాలు రెగ్యులర్ గా తింటే ఆరోగ్యం చెడిపోవచ్చు. అందుకే ఇంట్లోనే తయారు చేసుకుని తింటే రుచితో పాటు ఆరోగ్యమూ బాగుంటుంది. కానీ, ఎప్పుడూ ఒకే...


Mars Transit 2024: జూలై 12వ తేదీ నుంచి ఈ రాశుల వారి ఇల్లు డబ్బుతో నిండిపోబోతోంది..

Mars Transit 2024: జూలై 12వ తేదీన మిధున రాశిలోకి అంగారక గ్రహం సంచారం చేయబోతోంది దీని కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు అనుకున్న పనులు కూడా సులభంగా నెరవేరుతాయి.


Rahu Favourite Zodiac Sign: రాహువు ప్రభావంతో ఈ రాశులవారికి ముట్టిందల్లా బంగారమే!

Rahu Favourite Zodiac Sign 2024: రాహువు ప్రభావంతో అన్ని రాశులవారిపై ప్రత్యేమైన ప్రభావం పడుతుంది. దీని కారణంగా కొన్ని రాశులవారికి లాభాలు కలిగితే, మరికొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అయితే ఏయే రాశులవారిపై రాహువు ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు తెలుసుకోండి.


Shani Bhagwan: శనివారం రోజు ఈ తప్పులు అస్సలు చేయోద్దు.. జ్యోతిష్యులు ఏమంటున్నారంటే..?

Lord shani dev: శనిదేవుడిని కర్మ ప్రభువుగా చెప్తుంటారు. ఆయన మనం చేసిన మంచి, చెడులకు అదే విధంగా ఫలితాలు కూడా ఇస్తుంటారు. ద్వాదశ రాశులపై శనిప్రభావం ఎంతో కీలకంగా ఉంటుందని కూడా జ్యోతిష్యులు చెప్తుంటారు.


వివాహేతర సంబంధాలు పెరగడానికి కారణాలివే..

ప్రజెంట్ కొంతమంది వివాహేతర సంబంధాలు పెట్టుకుని తమ జీవితాలని నాశనం చేసుకుంటున్నారు. అసలు దీనికి గల కారణాలేంటో తెలుసుకోండి.


Malida Laddu Recipe : తెలంగాణ స్పెషల్ రెసిపీ మలీద ఉండలు.. బతుకమ్మ, బోనాలకు ఇవి ఉండాల్సిందే

Telangana Special Sweet for Bonalu : నోటికి రుచినే కాకుండా.. చేయడానికి సింపుల్​గా.. అమ్మవారికి నైవేద్యంగా పెట్టేవాటిలో మలిద ఉండలు కూడా ఒకటి. వీటిని తయారు చేయడం చాలా సింపుల్ కానీ.. వీటికి అంత ప్రాచుర్యం లేదు. తెలంగాణలో బతుకమ్మ, బోనాలకు దీనిని కచ్చితంగా చేసుకుంటారు. ఇదొక ట్రెడీషనల్ డిష్​గా అక్కడివారు చెప్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు గోధుమ పిండి -...


Saturday Astrology: ఏలినాటి శని ఉన్నవారు శనివారం ఈ పనులు చేస్తే మంచిది..!

Saturday Astrology: ఏలినాటి శని ఉన్నవారు శనివారం ఈ పనులు చేస్తే మంచిది..!


రాశిఫలాలు 08 జూలై 2024:ఈరోజు వజ్ర యోగం ప్రభావంతో ఓ రాశి వారు శత్రువులపై విజయం సాధిస్తారు..!

horoscope today 08 July 2024 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు వజ్ర యోగం ప్రభావంతో మిధునం, ధనస్సు రాశితో సహా ఈ రాశుల వారు అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...


ప్రపంచంలో అతిచిన్న మామిడి పండు ఇదే.. దీని సైజ్ తెలిస్తే షాక్ అవుతారు..!

పరిమాణంలో పెద్దదిగా, బరువుగా ఉండే మామిడికాయ గురించి అందరికీ తెలుసు. కానీ ఈ రోజు మనం ప్రపంచంలోనే అతి చిన్న మామిడి గురించి తెలుసుకుందాం. దీని సైజు ద్రాక్ష పండు అంత ఉంటుంది. ఈ ఏడాది మామిడి సీజన్ లో ద్రాక్ష ఆకారంలో ఉన్న మామిడి పండు రుచి ప్రజల నాడిని ఆకర్షించింది. ఈ ప్రత్యేకమైన మామిడి పేరు అంగుర్దానా. ఈ మామిడి 5 గ్రాముల బరువు మాత్రమే ఉంటుంది. అయితే రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. దీని రుచి ఒకసారి చూస్తే దాశేరి, కేసర్ మామిడిని కూడా మర్చిపోతారు. ఈ మామిడికి ప్రపంచంలోనే అతిచిన్న పండు హోదా లభించింది. లక్నోకు చెందిన ఎస్సీ శుక్లా తన తోటలో అంగుర్దా మామిడిని పండించాడు. ఈ మామిడి చెట్టు ప్రత్యేకత ఏంటంటే ఎవరైనా ఈ చెట్టుని చూస్తే.. అది ద్రాక్ష చెట్టు అనుకుంటారు. ఈ మామిడి పండ్లు జుమ్ఖాలలో వస్తాయి. జూలై నెలలో జరిగే మ్యాంగో ఫెస్టివల్ లో ఎస్ సి శుక్లా ప్రపంచంలోనే అతిచిన్న మామిడి అంగుర్దానాన్ని ప్రదర్శించనున్నారు. శుక్లా గత ఏడాది ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పేరిట యోగిరాజ్ మ్యాంగోను అని కొత్తరకం పండ్లను ప్రారంభించారు. ప్రధాని నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ప్రముఖ కవి కుమార్ విశ్వాస్, నటుడు అనుపమ్ ఖేర్, ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్, యోగా గురువు బాబా రాందేవ్, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కూడా ఎస్సీ శుక్లా మామిడి రుచిని ఆస్వాదించారు. అంగుర్దానా మామిడి గురించి ఎస్సీ శుక్లా మాట్లాడుతూ అంగుర్దానా సహజసిద్ధమైన మామిడి జాతి అని చెప్పారు. దాన్ని హాబీగా పెంచినట్లు వివరించారు. ఈ మామిడి పండ్లను దేశంలోని ప్రముఖులకు కూడా పంపించానన్నారు. అయితే దీనిని మార్కెట్లోకి విడుదల చేయట్లేదని పేర్కొన్నారు. ఎందుకంటే అమ్మకం చేయాలంటే వీటిని ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు.


Protein Foods : వీటిని తింటే ప్రోటీన్ పుష్కలంగా అందుతుంది..

​Protein Foods : బాడీకి ప్రోటీన్ చాలా ముఖ్యం. కొన్ని ఫుడ్స్‌లో ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఫుడ్స్ ఏంటో తెలుసుకోండి. ​


Nice Idea: మిద్దెపై తోట.. ఈ స్కూల్ కరెస్పాండెంట్ ఐడియా అదుర్స్..

ఏ ఒక్క ఆహార పదార్థాలు కూరగాయలు కొనాలన్న భయం. ఎటు చూసినా రసాయనాలతో పాటు కాలుష్యంతో కూడిన వాతావరణం, (కూరగాయలు) ఆహార పదార్థాలు నిత్యం తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. వీటిఫలితంగా అనారోగ్యంతో పాటు అనేక ప్రాణాంతక రోగాలను కొని తెచ్చుకుంటున్నామని వైద్యులు చెబుతున్నారు. కొంత కాలంగా వ్యవసాయ రంగంలో కూరగాయల సాగులో కొంత మార్పు కనిపిస్తోందనే చెప్పాలి. రైతన్నలు సైతం సేంద్రియ పంటల వైపు మొగ్గుచూపుతున్నారని వ్యవసాయ శాఖ అధికారులు కూడా చెబుతున్నారు. మరికొందరు గృహిణులు, విద్యావంతురాలు, మహిళలు సుందరమైన ఇంటి చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆరోగ్యమైన జీవితాన్ని ప్రతిఒక్కరూ కోరుకుంటారు.. ఇష్టపడతారు ఆస్వాదిస్తారని చెప్పాలి. అందులో భాగంగానే మహా నగరాల్లో, పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా మహిళమణులు (మిద్దె తోటలను)బంగ్లా పై సాగు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఆలోచింపజేస్తున్నారు. ఖాళీగా ఉన్న మిద్దెపై రూఫ్ గార్డెన్ లను ఏర్పాటు చేసి పండ్లు, పూలు, వెజిటేబుల్స్ (కూరగాయలు) పండిస్తున్నారు. ఎలాంటి రసాయన ఎరువులను వినియోగించకుండా కేవలం సేంద్రియ పద్ధతిలో సాగుచేస్తూ..ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటున్నామని రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పద్మనగర్ లో ఓ ప్రైవేటు స్కూల్ కరస్పాండెంట్ బుర్ర రాధాకృష్ణ ప్రసాద్ గౌడ్ తమ ఇంటిపై మిద్దె తోటను ఏర్పాటు చేసి మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్నారనే చెప్పవచ్చు. మిద్దెతోటల సాగుపై రోజురోజుకు పట్టణ ప్రజల్లో ఆసక్తి పెరుగుతుందనే చెప్పాలి. ఎందుకంటే గతంలో మనం కూడా చాలా వరకు మహానగరాల్లో ఇలాంటి వార్తా కథనాలను చూసాం. రసాయనాలతో పండించిన పంటలు అనారోగ్యాలకు గురిచేస్తున్నాయని, ఈ సమస్యకు మిద్దె తోటలే పరిష్కారమని సిరిసిల్ల పట్టణం పద్మానగర్ కు చెందిన బుర్ర రాధాకృష్ణ ప్రసాద్ గౌడ్ భావించామని లోకల్18కి తెలిపారు. తమకి కావల్సిన వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఫ్లవర్స్ ఇంటి మేడపైన పండించవచ్చునని, గత రెండు సంవత్సరాల క్రితమే మిద్దె తోట సాగును ప్రారంభించామని, కరోనా మహమ్మారి విపత్తు విజృంభించిన సందర్భంలో తనకు దొరికిన విలువైన సమయాన్ని బంగ్లా పై( మిద్దెతోట సాగుకు) ఉపయోగించుకున్నట్లు చెప్పారు.ఈ క్రమంలో తన ఇంట్లోకి కావలసిన నాణ్యమైన తాజా ఆకుకూరలు,కూరగాయలు,పండ్లు సాగు చేస్తుండడంతో ఆరోగ్యంతో పాటు ఆహ్లాదాన్ని పొందుతున్నారనే చెప్పాలి. ఆమె తమకున్న కొద్దిపాటి టెర్రస్‌ పై ఏర్పాటు చేసిన గార్డెన్‌లో ఇప్పుడు బీర, సొర, కాకర, టమాటా, బెండ, పచ్చిమిర్చి, వంకాయ, మునగ, చామగడ్డ, దొండ , చిక్కుడు తదితర కూరగాయలతోపాటు.. బచ్చలి కూర, పాలకూర, చుక్కకూర, మెంతి, పుదీనా, కొత్తిమీర, గోంగూర లాంటి ఆకుకూరలు పండుతున్నాయని, దానిమ్మ, సపోటా, జామ, బొప్పాయి, ద్రాక్ష, డ్రాగన్‌ ఫ్రూట్‌ వగైరా, ఆపిల్ ఇలా చాలారకాల ఫ్రూట్స్ పండిస్తున్నామని చెప్పారు. వీటితోపాటు మధుమేహం, కిడ్నీలో రాళ్ళు లాంటి ఎన్నో వ్యాధులకు ఉపయోగపడే రణపాల, తెల్లగజ్జర లాంటి ఔషద మొక్కలను పెంచుతున్నామని, వీటికి రసాయన ఎరువులు కాకుండా తమ ఇంట్లోని బెల్లం, ఆవుపేడ, బియ్యం నీళ్లు, పిండి పదార్థాలు, కుళ్లిన కూరగాయలు, పండ్ల తొక్కల లాంటి వ్యర్థ పదార్థాలను కంపోస్టు చేసి సేంద్రియ ఎరువులుగా వాడుతున్నామని వివరించారు. దాంతో రోజుకి కిలో నిండి రెండు కిలోల వరకు నాణ్యమైన తాజా ఆకుకూరలు, కూరగాయలు వస్తున్నాయని మిద్దె తోటల ద్వారా.. వీటిని నిత్య ఆహారంలో, వంటలకు ఉపయోగించడంతో సంపూర్ణ ఆరోగ్యవంతమైన జీవనాన్ని కొనసాగిస్తున్నామని, రుచికరమైన వెజిటేబుల్స్ కూర సిద్ధమవుతుందని చెబుతున్నారు. చాలామంది మిద్దె తోటలు ఏర్పాటు చేసుకోవాలంటే చాల ఖర్చుతో కూడుకున్నదన్న అపోహలో ఉంటారని, మన ఇంట్లోనే వృధాగా ఉన్న వస్తువులతో పెద్దగా ఖర్చు లేకుండానే సేద్యం చేసుకోవచ్చునని బుర్ర రాధ వివరించారు. కూరగాయల మొక్కల మధ్య సుగంధ ఔషధ మొక్కలు పెంచితే మంచిదని, అన్నింటికీ ఒకే రకమైన సేంద్రియ ఎరువులు కాకుండా మొక్కలకు తగిన సేంద్రియ ఎరువు అందిస్తే మొక్కల ఎదుగుదల బాగుంటుందని, ఔషద మొక్కలు వాడటం వల్ల తన భర్త కిడ్నిలోని 12 మిల్లీమీటర్ల రాయి పూర్తిగా తనకి కరిగిపోయిందని, ఇప్పుడు ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని ఆనందం వ్యక్తం చేస్తూ..లోకల్18కి తెలిపారు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం పచ్చటి మొక్కల మధ్య తిరగడం మనసుకు ఉల్లాసాన్ని ఆహ్లాదాన్ని ఉత్సాహాన్ని కలిగిస్తుందని, ఇలాగే మహిళలందరూ మిద్దెతోటలపై మొగ్గు చూపాలని, దాంతో ఎలాంటి రోగాలు దరిచేరవని, నాణ్యమైన తాజా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ సాగు చేసుకోవచ్చని చెప్తున్నారు. మనకున్న ఆసక్తికి కాస్త సృజనాత్మకతను జోడిస్తే మిద్దెతోటల పెంపకానికి ఎలాంటి ఇబ్బంది ఖర్చు ఉండదని చెప్తున్నారు. తోటలను పెంచడం హాబీగా మార్చుకోవాలని, మొక్కలను పెంచడంతోపాటు వాటితో అనుబంధాన్ని పెంచుకోవాలని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.


Bael Plant | మారేడు చెట్టు కింద ఆ పనిచేస్తే నిరుపేద కూడా సంపన్నుడవుతాడట..!

Bael Plant : హిందూధర్మంలో చెట్టును దైవంగా పూజిస్తారు. కొన్ని వృక్షాలు దేవతా వృక్షాలుగా కీర్తించబడుతాయి. ఇలా దేవతా వృక్షాలుగా కీర్తించబడే వాటిలో మారేడు చెట్టుకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. మారేడు చెట్టుని సంస్కృతంలో బిల్వ వృక్షం అంటారు. బిల్వ వృక్షం శివునికి అత్యంత ప్రీతికరమైనది. అందుకే మారేడు దళాలతో శివయ్యను పూజిస్తాం. బిల్వ పత్రంలోని మూడు ఆకులు శివుని మూడు కళ్ళకు ప్రతీకగా చెబుతారు.


Mutton Curry for Bonalu : పండుగ ఏదైనా ముక్క పడాల్సిందే.. మటన్ తినాల్సిందే బోనాలు స్పెషల్ రెసిపీ

పండుగైనా, ఏ అకేషన్​ అయినా.. తెలంగాణ వాసులు వండే వంటల్లో కచ్చితంగా మటన్ ఉంటుంది. ముక్క, చుక్కా కచ్చితంగా ఉండాలని చూస్తారు. ఏ దావత్​కి అయినా ఈ కాంబినేషన్ ఉండాల్సిందే. అందుకే బోనాలకు కూడా మటన్​ను బాగా వండుకుంటారు. మరి ఈ టేస్టీ రెసిపీని ఏ విధంగా వండాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటి? రైస్, బగారా రైస్, రోటీ, చపాతీలలోకు కాంబినేషన్ వచ్చేలా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. కావాల్సిన పదార్థాలు మటన్ మారినేషన్ కోసం మటన్ - అరకిలో పసుపు - పావు టీస్పూన్...


Weekly Horoscope | రాశి ఫలాలు (7.7.2024 నుంచి 13.7.2024 వరకు)

విందులు, వినోదాలకు హాజరవుతారు. తీర్థయాత్రలు, విహారయాత్రలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారులు కొత్త ఒప్పందాలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి.


కోరిన కోరికలు తీర్చే అమ్మ వారు.. ఈ గుడికి మీరెప్పుడైనా వెళ్లారా..

ఆషాడమాసం వస్తుందంటే చాలు అమ్మవారి ఆలయాలు నైన మనోహరంగా దర్శనమిస్తూ ఉంటాయి. ముఖ్యంగా భక్తులు కుటుంబాల సమేతంగా ఈ ఆలయాలకి వెళ్లి వంటావార్పు చేసుకుని ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ ఆషాడ మాసంలో అమ్మవారికి నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా రైతులకు పాడిపంట సుభిక్షంగా పండుతుందని దేవస్థానాల సైతం విశేష కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. అటువంటి విశేష కార్యక్రమాలు రాష్ట్రంలోనే విశేష భరితంగా జరిగే దివ్యక్షేత్రం ఎక్కడ ఉంది? అక్కడ ఏ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఒకసారి చూద్దాం. రాష్ట్రంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా కాకినాడ జిల్లాలో లోవకొత్తూరు ధారా తీగ కొండల నడుమ కొన్ని వందల సంవత్సరాల కిందట స్వయంభుగా శ్రీ తలుపులమ్మ అమ్మవారు కొలువై ఉన్నారు. నిజానికి ఈదివ్య క్షేత్రంకి వెళ్లే దాదాపు 5 కిలోమీటర్ల ముందే ఎత్తైన పచ్చని చెట్లు ఎటుచూసినా కొండలు ఆపై నల్లటి మబ్బులు ఇలా కొండపై కొలువైన అమ్మవారిని చూసే సమయంలో మనకి అనిపించే ఆహ్లాదకరమైన వాతావరణ సైతం ప్రత్యేకంగా మనసులను దోచేస్తుంది ఈ నేపథ్యంలో దాదాపు ఈ నెల ఏడవ తేదీ నుంచి మాసరోజులు అమ్మవారికి ఆషాడ మాస మహోత్సవాలు అత్యంత ఘనంగా ఈ ఏడాది నిర్వహిస్తామని దేవస్థాన కార్య నిర్వహణ అధికారి పి.విశ్వనాథరాజు తెలియజేశారు. ముఖ్యంగా ఈనెల ఏడవ తేదీన అమ్మవారిని మట్టి గాజులతో అలంకరించడం అదేవిధంగా 14వ తేదీన అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన లక్ష్యంకుమార్చన అదేవిధంగా 15వ తేదీన అమ్మవారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా మూల్ విరాట్ కు పంచామృత అభిషేకం కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. అదేవిధంగా 17వ తేదీన తొలిఏకాదశి సందర్భంగా గణపతికి అభిషేకం గరికపూజా గణపతిహోమం శ్రీఅమ్మవారికి లక్షతులసి పూజ కార్యక్రమం నిర్వహించడంతోపాటు ఆషాడ మాస మహోత్సవాల్లో అత్యంత ప్రీతిపాత్రమైన ఆధ్యాత్మిక కార్యక్రమం ఈనెల 21వ తేదీన అమ్మవారి ఆలయం,అమ్మవారి మూలవిరాట్ ప్రంగాణంతోపాటు పంచలోహ విగ్రహాల వద్ద కూరగాయలతో అలంకరించడం జరుగుతుందని తెలియజేశారు. అదేవిధంగా 28వ తేదీన అమ్మవారికి లక్ష పుష్పార్చన 31వ తేదీన ఏకాదశి సందర్భంగా గణపతి అభిషేకం గరిక పూజ గణపతి హోమం అమ్మవారికి లక్ష బిల్వార్చన అదే విధంగా జూలై 8వ తేదీన సప్తనది జిల్లాలతో సాయంత్రం నాలుగు గంటల నుంచి ఘటాభిషేకం కార్యక్రమం అనంతరం 9వ తేదీన అమ్మవారికి సుగంధ ద్రవ్యాలతో ఘటాభిషేకం వంటి కార్యక్రమాలు జరుగుతాయని ఆషాడమాస మహోత్సవంలో భాగంగా భక్తులంతా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందాలని ఆలయ ఈవో విశ్వనాథరాజు పిలుపునిచ్చారు.


Horoscope Prediction in Telugu 6 july 2024: ఈ రాశులవారిపై లక్ష్మీదేవి కరుణా కటాక్షాలుంటాయి - జూలై 06 రాశిఫలాలు

జూలై 06 రాశిఫలాలు మేష రాశి ఈ రాశికి చెందిన మార్కెటింగ్, సేల్స్ రంగాలకు చెందినవారు ఈరోజు దూరప్రాంత ప్రయాణం చేయాల్సి రావొచ్చు. కార్యాలయంలో రాజకీయాలు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి కానీ మీరు దూరంగా ఉండడం మంచిది. బంగారం , వజ్రాల మీద పెట్టుబడి పెట్టేవారికి కలిసొచ్చే సమయం ఇది. వృత్తిపరమైన , వ్యక్తిగత జీవితంలో సమతుల్యతను కాపాడుకోవడానికి ప్రయత్నించాలి. మిమ్మల్ని నిజంగా అర్థం చేసుకునే వ్యక్తికోసం అన్వేషిస్తారు. వృషభ రాశి మీ ప్రతిభను ప్రదర్శించడానికి ఇదే...


మీ పిల్లల చేతిరాత బాగుండాలంటే ఏం చేయాలో తెలుసా?

చాలా మంది పిల్లలు బాగా చదివినా, క్లాస్ ఫస్ట్ వచ్చినా.. చేతిరాత మాత్రం అస్సలు బాగుండదు. ఇంకేముంది బాగా రాయి అని తల్లిదండ్రులు పిల్లలను తిట్టడం, కొట్టడం చేస్తుంటారు. కానీ దీనివల్ల పిల్లల చేతిరాత మారదు. మరి వీళ్లు అందంగా మారాలంటే తల్లిదండ్రులు ఏం చేయాలో తెలుసా? పిల్లలు ఏ విషయాన్నైనా చాలా తొందరగా నేర్చుకుంటారు. అందుకే చిన్న వయసు నుంచి పిల్లలకు మంచి, చెడు విషయాల గురించి నేర్పించాలంటారు. ఈ సంగతి పక్కన పెడితే కొంతమంది పిల్లలు బాగా చదువుతుంటారు. క్లాస్...


50 మందిని పెళ్లి చేసుకున్న నిత్య పెళ్లి కూతురు..

50 మందిని పెళ్లి చేసుకున్న నిత్య పెళ్లి కూతురు.. తమిళనాడులో నిత్యా పెళ్లికూతురు బాగోతం వేలెడుగులోకి వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 50పెళ్లిళ్లు చేసుకుంది ఓ కిలాడీ లేడి. వివరాల్లోకి వెళితే, తమిళనాడు తిరుపూర్ కి చెందిన ఓ యువకుడు 35ఏళ్ళు వచ్చినా పెళ్లికాకపోవటంతో డేట్ ది తమిళ్ అనే వెబ్సైట్ ద్వారా సంధ్య అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు.అయితే,పెళ్లైన...


Pesarapappu uthappam: పెసరపప్పు వెజిటేబుల్ ఊతప్పం.. సులువుగా చేసేయండిలా..

Pesarapappu uthappam:పెసరపప్పు, బోలెడు కూరగాయలు వాడి చేసే ఊతప్పం రుచి చాలా బాగుంటుంది. ఒకసారి ప్రయత్నించి చూడండి.


Today Horoscope: ఓ రాశివారికి సంఘంలో విలువ పెరుగుతుంది

Today Horoscope: రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? ఎవరికీ శుభం జరుగుతుంది.. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి. ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం.. మేషం (అశ్విని , భరణి, కృత్తిక 1) నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ) దినాధిపతులు అశ్విని నక్షత్రం వారికి(దినపతి శుక్రుడు) భరణి నక్షత్రం వారికి (దినపతి రాహు) కృత్తిక నక్షత్రం వారికి (దినపతి రవి) దిన ఫలం:-ప్రయాణంతో...


మనసుకు బ్యూటీ ట్రీట్‌మెంట్‌

ముఖం నల్లబడితే ట్యాన్‌ ప్యాక్‌ వేస్తాం. మురికి పడితే స్క్రబ్‌ చేస్తాం. మరి మనసు మసకబారితే ఏం చేయాలి.


Healthy Paratha Recipe: ఇష్టమైన పరాఠాల్ని హెల్తీగా తయారు చేసుకునే విధానం

Healthy Paratha Recipe: పరాఠా అంటే ఇష్టపడనివారుండరు. ముఖ్యంగా ఉత్తరాదిన అత్యంత ప్రీతిపాత్రమైన ఫుడ్ ఇది. అందులోనూ ఆలూ పరాఠా అంటే మరింత క్రేజ్. కానీ పరాఠా తింటే లావెక్కిపోతారనే భయం కూడా వెంటాడుతుంటుంది. మరి ఏం చేయాలి...ఆ వివరాలు మీ కోసం..


కొందరి మూత్రం తెల్లగా పాలలా ఎందుకు ఉంటుంది? ఎర్రగా వస్తే ఏమవుతుంది?

మూత్రం రంగు మనలో ఆరోగ్య సమస్యలను సూచిస్తున్నప్పటికీ, మనం తినే ఆహారాలు, తీసుకునే మందులను బట్టి కూడా రంగు కొన్నిసార్లు మారుతుంటుంది. ముఖ్యంగా మనం తాగే నీటితో మూత్రం రంగు మారొచ్చు.


Tomato Ketchup: టమాటో కెచప్ తినడానికే కాదు, ఇలా ఇంట్లోనే వస్తువులను తళతళ మెరిపించేందుకు వాడవచ్చు

Tomato Ketchup: టమాటో కెచప్ పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లో ఉంటుంది. దీన్ని కేవలం తినడానికే కాదు, ఇంట్లోనే కొన్ని వస్తువుల మురికిని వదిలేసి మెరిసేలా చేయడానికి వినియోగించవచ్చు.


Toxic friendship: స్నేహితుల్లో ఈ లక్షణాలుంటే వాళ్లను దూరం పెట్టాల్సిందే..

Toxic friendship: స్నేహితుల్లో కొన్ని చెడు లక్షణాలుంటే వెంటనే వాటిని గమనించాలి. వాళ్లనుంచి దూరంగా ఉండాలి. లేదంటే వాళ్లని మార్చుకునే ప్రయత్నం చేయాలి.


అసలు జీవులకు మరణం ఎందుకు.. చావును జయించడం సైన్స్‌తో సాధ్యమేనా!

పుట్టినప్పుడు మనిషి... మిగతా జీవులకంటే చాలా నిస్సహాయుడు. తనను ఒకరు ఎత్తుకోవాలి, స్తన్యమివ్వాలి, గమనించుకోవాలి, రక్షించాలి. కానీ ఎప్పుడైతే తనకు ఊహ తెలుస్తుందో... అప్పటినుంచి తన ఉనికిని నిరూపించుకోవాలనే కసి మొదలవుతుంది.


చేతిలో ఈ రేఖ ఉంటే విడాకులు ఖాయం.. వివాహేతర సంబంధాలు కూడా చెప్పేస్తుందంట..!

హస్తసాముద్రికం ద్వారా మనిషికి వివాహ యోగం ఎప్పుడు వస్తుందో తెలుసుకోవచ్చు. ఇది పెళ్లి తర్వాత మీ వైవాహిక జీవితం గురించి కూడా చెబుతుందని జ్యోతిష్యులు అంటున్నారు. హస్తసాముద్రికం ప్రకారం, ఒక వ్యక్తి అరచేతిలో ఉన్న వివాహ రేఖ అతని వైవాహిక జీవితం గురించి చెప్పడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మీకు ఒకటి కంటే ఎక్కువ వివాహ రేఖలు ఉంటే అది వేరే అర్థాన్ని ఇస్తుంది. ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ వివాహ రేఖలు ఉన్నట్లయితే.. ఆ వ్యక్తి ఖచ్చితంగా రెండవ వివాహం చేసుకుంటారని అర్థం. అంతేకాకుండా వివాహ రేఖ ఎలా ఉంటే, వారి దాంపత్య జీవితం ఎలా సాగుతుందో చెపుతుందంట. అరచేతిలో వైవాహిక రేఖ విచ్చిన్నమైతే.. మీ వైవాహిక జీవితంలో విడాకులు తీసుకునే అవకాశాలు ఉన్నాయంట. ఒక వ్యక్తి వివాహ రేఖ ఎంత విచ్ఛిన్నమైతే, వారు తిరిగి వివాహం చేసుకునే అవకాశం అంత ఎక్కువగా ఉంటుందని పండితులు చెపుతున్నారు. మీ అరచేతిలో రెండు సమాంతర వివాహ రేఖలు ఉండి.. అవి చిటికెన వేలు, గుండె రేఖకు రేఖకు మధ్య ఉంటే. అలాంటి వ్యక్తులు రెండుసార్లు వివాహం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాంటి వ్యక్తి పెళ్లి తర్వాత విడివిడిగా జీవించే అవకాశం ఉన్నట్లు చెపుతున్నారు. అంతేకాదు చిన్న, సమాంతర వివాహ రేఖను కలిగి ఉన్నట్లయితే.. మూడవ వ్యక్తి మీ వైవాహిక జీవితంలోకి ప్రవేశించవచ్చని లేదా వివాహేతర సంబంధానికి అవకాశాలు ఉన్నాయని ఇది చూపిస్తుంది. ఇక వివాహ రేఖ హృదయ రేఖ వైపు వంగి ఉంటే అది వైవాహిక జీవితంలో సమస్యలను సూచిస్తుంది. వివాహ రేఖ హృదయ రేఖను దాటితే.. అలాంటి వారి వైవాహిక జీవితం చాలా దుర్భరంగా ఉంటుందంట. నాలుగు కంటే ఎక్కువ వివాహ రేఖలు ఉన్న వ్యక్తి చాలా చంచలంగా ఉంటాడు. ఇతర వ్యక్తులతో బాగా ప్రాచుర్యం పొందాడు. మరోవైపు మీ ప్రధాన మార్గం స్పష్టంగా, నిస్సారంగా లేకుంటే.. వివాహం తర్వాత ప్రజాదరణ పొందే అవకాశాలు చాలా ఉన్నాయంట. (గమనిక: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.)


Menu for diabetic: షుగర్ ఉన్నవాళ్లు రెస్టారెంట్‌కి వెళ్తే ఏం ఆర్డర్ చేసుకోవాలి? ఈ టిప్స్‌తో రుచితో పాటూ ఆరోగ్యం

డయాబెటిస్ ఉన్నవాళ్లు చిన్న చిన్న ఆనందాలకు దూరం అయిపోతారు. బయటికి వెళ్లినప్పుడు ఏం తినాలో తెలీక రెస్టారెంట్లకు వెళ్లడం మానేస్తారు. అది మంచిదే. కానీ వెళ్లాలనిపిస్తే అక్కడ ఏం తినొచ్చు, ఎలా ఆర్డర్ చేసుకోవచ్చో చూసేయండి.


Personal Finance Tips | డబ్బులు బాగా సంపాదిస్తున్నామని.. ఎక్కడ పడితే అక్కడ పెట్టుబడులు పెట్టొద్దు.. ఈ జాగ్రత్తలు మస్ట్‌గా ఫాలో అవ్వాల్సిందే!

Personal Finance Tips | కాకలు తీరిన ఆర్థికవేత్తలు కూడా కొన్నిసార్లు పెట్టుబడి దోవలో పక్కదారి పడుతుంటారు. బీకామ్‌లు, సీఏలు చదవని వ్యక్తుల మాటేమిటి? దండిగా సంపాదించే ఉద్యోగంలో కుదురుకోగానే ఏదో ఇన్వెస్ట్‌ చేయాలన్న తపన పుడుతుంది.


రోజూ 2 నానబెట్టిన బాదం పప్పులను తింటే ఏమౌతుందో తెలుసా?

బాదంలో మనల్ని హెల్తీగా ఉంచే ఆరోగ్యకరమైన కొవ్వులు,యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అవి మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ప్రతిరోజూ రెండు నానబెట్టిన బాదంపప్పులను తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. పోషకాలు: బాదం పప్పుల్లో మన శరీరానికి అవసరమైన రకరకాల ప్రోటీన్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ డ్రై ఫ్రూట్స్ లో విటమిన్ ఇ, మెగ్నీషియం, మంచి కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన మొత్తం ఆరోగ్యాన్ని...


Ramayanam: వనవాసంలో 14 ఏళ్లపాటు లక్ష్మణుడు నిద్రపోకుండా ఎలా ఉన్నాడు?

రామాయణం ప్రకారం సీతా-రాముళ్ల వనవాసం సమయంలో వారితో పాటుగా లక్ష్మణుడు కూడా ఉన్నాడని చెబుతాయి. అయితే వీరి వనవాసం 14 ఏళ్ల పాటు సాగింది. ఈ వసవాస సమయంలో లక్ష్మణుడు.. సీతకు రక్షణగా ఉండేందుకు 14 ఏళ్లపాటుగా నిద్రపోకుండా ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి. తాను నిద్ర రాకుండా ఉండేందుకు నిద్రాదేవిని లక్ష్మణుడు ప్రార్థించాడంట. తనకి బదులుగా తన భార్య ఊర్మిలకు నిద్ర ఇవ్వమని దేవతను కోరగా ఆమె దానికి అంగీకరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. నిద్ర దేవత ఇచ్చిన వరం కారణంగా లక్ష్మణుడు.. వనవాస యాత్ర మొత్తంలో ఒక్క క్షణం కూడా నిద్రపోకుండా ఉండగలిగాడంట. నిద్ర దేవి విశ్వం సృష్టికి ముందే ఉద్భవించిందని మార్కండేయ పురాణం చెబుతోంది. అయితే ఈ కాలంలో మధు, కైతబ్ అనే ఇద్దరు రాక్షసులు కూడా జన్మించారంట. వీరు బ్రహ్మ దేవుడిపైకి రావడంతో ఆయన విష్ణువుని సహాయం కోరుతాడు. అయితే ఆ సమయంలో విష్ణువు యోగ నిద్రలో ఉంటాడంట. అప్పుడు బ్రహ్మదేవుడు యోగమయుడిని ప్రార్థించగా.. అది విష్ణువు కళ్ళ నుంచి నిద్రను తొలగిస్తుంది. దీంతో విష్ణువు ఒక్కసారిగా కళ్లు తెరుస్తాడు. దీంతో విష్ణువు నిద్ర నుంచి మేల్కొని రాక్షసులను సంహరించి.. బ్రహ్మ దేవుడి ప్రాణాలు కాపాడుతాడు. దీంతో బ్రహ్మకు సహాయంగా వచ్చిన ఈ యోగమయుడు నిద్ర దేవిగా ప్రసిద్ధి చెందింది. Disclaimer: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.


ఈ అలంకరణలో అమ్మవారిని దర్శిస్తే.. ఎంత భాగ్యమో తెలుసా..

ఆ దివ్య అలంకరణలో దర్శనమిస్తున్న అమ్మవారిని ఈ పవిత్ర మాసంలో దర్శించుకుంటే ఆ జగత్ జ్జనని ఆ ముత్తైదువులకు సౌభాగ్యవరం అందిస్తుందట. అందుకే ఏడాదికి ఒకసారి నిర్వహించే ఆ అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి ఆ కొండకోనల్లో వెలిసిన దేవత ఆలయానికి తప్పక వెళ్తారట. ఇంతకీ ఆ దేవత ఎవరు ఆ అలంకరణ ఏంటి ఆ విశేషాలు ఒకసారి చూద్దాం.ప్రతినిత్యం లోకం బాగుండాలని పశుపక్షాదులు బాగుండాలని వివిధ దైవ క్షేత్రాలలో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ...


Sweet Lassi: పెరుగుతో ఇలా లస్సీ చేసుకోండి చాలా బాగుంటుంది..!

Lassi Recipe: లస్సీ ఇది పెరుగు, నీరు, మసాలా దినుసులు కొన్నిసార్లు పండ్లతో తయారు చేస్తారు. ఇది శరీరానికి చల్లగా ఉంచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఒక గొప్ప మార్గం. ఎలా తయారు చేసుకోవాలి అనేది తెలుసుకుందాం.


Fasting: వారానికి ఒక రోజు ఉపవాసం ఉంటే.. ఎక్కువ కాలం బతుకుతారంట..!

చాలా మంది పండుగ రోజుల్లో, పర్వదినాలలో ఉపవాసం చేస్తూ ఉంటారు. దైవారాధనలో ఉపవాసాన్ని ఓ దీక్షలా పాటిస్తారు. దీని వెనకు ఆధ్యాత్మిక పరమార్ధమే కాదు.. అతర్లీనంగా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఉపవాసం.. పర్వదినాల్లోనే కాకుండా.. వారానికి ఒక రోజు దీన్ని పాటిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని చెపుతుంటారు. ఆధ్యాత్మికంగానే కాదు.. సైన్స్ పరంగానూ ఉపవాసం పాటించడం మంచిదే అంటున్నారు నిపుణులు. రోజులో ఎక్కువ సేపు తినకుండా ఉంటే కేలరీలు ఎక్కువ ఖర్చు అవుతాయని, దానివల్ల తాత్కాలికంగా కనిపించే నీరసమే కానీ శరీరానికి చాలా మంచిదంటున్నారు. హిందూ ధర్మంలో ఎక్కువ మంది పాటించే ఉపవాసం చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పలు పరిశోధనలు చెపుతున్నాయి. ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్ అనే మీడియాలో ఓ పరిశోధన ఇలా వెల్లడించింది. సరైన సమయంలో తినకపోవడం, తరచూ భోజనవేళల్లో మార్పులు చేస్తుండటం శరీరానికి అదనపు బరువు పెరిగేలా చేస్తాయట. దీనికి వ్యతిరేకంగా రోజులో 18గంటల పాటు తినకుండా ఉండటమనేది జీవ క్రియలో మార్పులు తీసుకొస్తుందని వెల్లడించారు. ఉపవాసం చేయడం వల్ల బీపీ (రక్తపోటు) కూడా అదుపులో ఉంటుందని నిపుణులు చెపుతున్నారు. ఒక రోజంతా ఉపవాసం ఉంటే కొవ్వు మెటబాలిజంలో కలిసిపోతుంది. అలా శరీర బరువు తగ్గిపోతుంది. అంతేకాకుండా జీవ కణాల ఆరోగ్యం మెరుగై అదనపు ఆరోగ్యం వస్తుంది. ఎక్కువ కాలం బతకాలంటే అప్పడప్పుడు ఉపవాసం చేయాలని పరిశోధనలు చెపుతున్నాయి. మన పెద్దలు కూడా దీనిని దృష్టిలో పెట్టుకొనే ఉపవాసం అనే కాన్సఫ్ట్ పెట్టినట్లు భావిస్తున్నారు. అయితే ఈ ఉపవాసమనేది వైద్యుల సూచన మేరకు పాటించడం శ్రేయస్కరం. (గమనిక: ఈ ఆర్టికల్‌లో ఇచ్చినది ప్రజల విశ్వాసాలు, ఇంటర్నెట్‌లో సోషల్ సమాచారం మాత్రమే. దీన్ని తెలుగు న్యూస్ 18 నిర్ధారించట్లేదని గమనించగలరు.)


ప్రెగ్నెన్సీ రాకపోవడానికి అసలు కారణాలేంటో తెలుసా?

పిల్లలంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమే. పెళ్లైన ప్రతి జంట పిల్లల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తారు. గర్భం దాల్చారన్న వార్త వింటే ఇంటిళ్లిపాది ఆనందిస్తారు. కానీ ప్రస్తుత కాలంలో చాలా మంది పేరెంట్స్ కాలేకపోతున్నారు. ఇది ఎంతో బాధకు గురిచేస్తుంది. చాలా మంది గర్భం దాల్చడానికి ఎంతో ప్రయత్నిస్తారు. అయినా విఫలమవుతూనే ఉంటారు. అసలు గర్భం ఎందుకు దాల్చరు? దానికి కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. గర్భాశయ పరిమాణం: గర్భాశయం పరిమాణం నార్మల్ గా లేకపోతే కూడా గర్భం...


Plum Fruit: ఆల్‌బుఖరా పండ్లు ఎందుకు తినాలో మీకు తెలుసా?

Plum Fruit: ఆల్‌బుఖరా పండ్లు ఎందుకు తినాలో మీకు తెలుసా?


Budhaditya Yog: జూలై 16 నుంచి ఈ రాశులవారు ధన వంతులు కాబోతున్నారు!

Budhaditya Yog: జూలై 16వ తేదిన బుధాదిత్య యోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా కన్యా రాశితో పాటు కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ జరిగిపోతాయి. అయితే ఈ యోగం కారణంగా లాభాలు పొందే రాశులవారు ఎవరో ఇప్పుడు తెలుసుకోండి.


Male hormones: అమ్మాయిల్లో ఈ లక్షణాలుంటే శరీరంలో పురుష హార్మోన్లు పెరిగాయని అర్థం

Male hormones: మహిళల శరీరంలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అది హార్మోన్ల అసమతుల్యతకు సంకేతం. వాటిని సహజంగా ఎలా అదుపులో ఉంచుకోవాలో తెల్సుకోండి.


రోజూ ఉదయం 5 గంటలకే నిద్రలేస్తే ఏమౌతుందో తెలుసా?

రాత్రి తొందరగా పడుకుని ఉదయం తొందరగా నిద్రలేవడం వల్ల ఇంట్లో పనులన్నీ తొందరగా అయిపోవడంతో పాటుగా మన ఆరోగ్యానికి కూడా బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అయితే రోజూ ఉదయం 5 గంటలకు నిద్రలేస్తే ఏమౌతుందో తెలుసా? ఉదయం తొందరగా నిద్రలేచే అలవాటు చాలా తక్కువ మందికే ఉంటుంది. ఇంట్లో ఆడవాళ్లు తప్ప.. మగవారు పొద్దు పొద్దున్నే లేచే దాకలాలు చాలా అంటే చాలా తక్కువ. ఇక పిల్లలైతే ఇంకొంచెం సేపు ఇంకొంచెం సేపు అంటూ 9, 10 కి నిద్రలేస్తుంటారు. కానీ ఈ అలవాటు మన ఆరోగ్యానికి...


Lemon Ginger Tea: నిమ్మ అల్లం టీ ప్రయోజనాలు తెలుస్తే అసలు వదిలిపెట్టరు..!

Lemon Ginger Tea Benefits: నిమ్మ అల్లం టీ ఒక ప్రసిద్ధ పానీయం. ఇది రుచికరమైనది మాత్రమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. ఈ టీ జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి శ్వాసకోశ సమస్యలకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది.


ఈ వాసనలకు పాములు సుస్సు పోసుకుంటాయి.. నాగలోకంలో ఉన్నా అవి మీ దగ్గరకు రావు..!

ఎండవేడిమి నుండి ఉపశమనం కోసం ప్రజలు వర్షాకాలాన్ని చాలా ఇష్టపడతారు. అయితే, ఈ సీజన్ ఉపశమనంతో పాటు అనేక సమస్యలను కూడా తెస్తుంది. దీనివల్ల నీటి వల్ల వచ్చే వ్యాధులు, ఫుడ్ పాయిజనింగ్, ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉండటమే కాకుండా.. పాములు, తేళ్లు, జర్రిలు మొదలైన కొన్ని చాలా ప్రమాదకరమైన జీవులు ఇంట్లోకి ప్రవేశించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా గ్రామాలు, కొండ ప్రాంతాలు లేదా అటవీ ప్రాంతాలు మరియు గ్రౌండ్ ఫ్లోర్‌లో నివసించే వారు ఎంతో ప్రమాదంలో ఉన్నట్టే. అటువంటి పరిస్థితిలో ప్రమాదాన్ని నివారించడానికి కొన్ని చర్యలు తీసుకోవాలి. వర్షాకాలంలో పాములు, కీటకాలను ఇంటి నుండి దూరంగా ఉంచడానికి 10 మార్గాలను తెలుసుకుందాం. ముఖ్యంగా మీరు గ్రౌండ్ ఫ్లోర్‌లో నివసిస్తుంటే, మీ ఇల్లు కొండ ప్రాంతంలో లేదా అడవి, పార్క్ మొదలైన వాటికి సమీపంలో ఉంటే.. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. వర్షం పడితే తలుపులు, కిటికీలు మూసేయాలి. ఎందుకంటే పాములు ఈ ప్రదేశాల్లో ఎక్కవ సంచరిస్తుంటాయి. పాములంటే ప్రజల్లో భయం నెలకొంది. అందరూ పాములకు దూరంగా ఉండాలని కోరుకుంటారు, అయితే పాములను సురక్షితంగా తరిమివేయడం ఎలా.. పాములను పారిపోయేలా చేసే వాసన ఈ ప్రపంచంలో ఏదైనా ఉందా అంటే సమాధానం అవుననే వస్తుంది. పాములను తరిమిమీరు వేప నూనెను ఉపయోగించవచ్చు. వేపనూనెను నీళ్లలో కలిపి రోజూ ఇంటింటా స్ప్రే చేస్తే దోమదోషాలు తొలగిపోతాయి. ఇంటి తోటలో కూడా ఈ నీటిని పిచికారీ చేస్తూ ఉండండి. పాములను లేదా ఇతర జంతువులను మీ ఇంటికి దూరంగా ఉంచడానికి బ్లీచింగ్ పౌడర్‌ని ఉపయోగించవచ్చు. బయట మరియు తోటలో నిలబడి ఉన్న నీటిపై పిచికారీ చేయండి. ఈ నీటితో ఇంటిని శుభ్రం చేసుకోవచ్చు. కావాలంటే దాల్చిన చెక్క పొడి, వైట్ వెనిగర్ లేదా నిమ్మరసం కలిపి ఇంటి బయట పిచికారీ చేసుకోవచ్చు. పాములు వచ్చే అవకాశం ఉన్న ప్రదేశాలలో క్రమం తప్పకుండా పిచికారీ చేయాలి. పాములు ఇంట్లోకి రాకుండా ఉండాలంటే కిటికీలకు, తలుపులకు ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలను రాయండి. చాలా పాములు ఈవాసన చూసి పారిపోతుంటాయి. మీ ఇంటి తోటలో వెల్లుల్లి మరియు ఉల్లిపాయలను నాటడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. పాములు కొన్ని మొక్కలకు కూడా భయపడతాయి, అవి పారిపోతాయి. కాక్టస్, స్నేక్ ప్లాంట్, తులసి చెట్టు, నిమ్మ గడ్డి మొదలైనవి వర్షాకాలంలో తప్పనిసరిగా నాటాలి. ఇంటి ప్రధాన ద్వారం, కిటికీల దగ్గర ఈ మొక్కలను ఉంచాలి. ఈ మొక్కల వాసన కారణంగా, పాములు ఇంటి దగ్గరికి రావు. (గమనిక: ఈ కథనం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది.. న్యూస్ 18 తెలుగు దీనిని ధృవీకరించడం లేదు.)


Lucky Zodiacs: ఆషాడ మాసంలో అద్భుతమైన యోగాలు.. ఈ రాశుల వారికి బ్యాంకు బ్యాలెన్స్ రెట్టింపు..

Lucky Zodiac Signs In 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆషాడమాసం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది ఈ సమయంలో కొన్ని గ్రహాలు సంచారం చేయడమే కాకుండా సంయోగం చేస్తాయి. దీని కారణంగా ఎంతో శక్తివంతమైన యోగాలు ఏర్పడతాయి.. మీ యోగ ప్రభావాలతో కొన్ని రాశుల వారి విపరీతమైన ధన లాభాలు పొందుతారు.


Saturn Retrograde: శని తిరోగమనంతో ఈ 4 రాశులవారు పట్టిందల్లా బంగారమే..!

2024 Saturn Retrograde: శని తిరోగమనం వల్ల ఈ ఐదు రాశుల వారికి రాబోయే నెలలో అంతా శుభప్రదంగా ఉంటుంది. ఊహించని ధనలాభం, వాహన కొనుగోలు ,భూ లాభాలు వంటి లాభాలు కలుగుతాయి. మరి ఈ రాశులలో మీరు కూడా ఉన్నారా?


Rice Zempic:వెయిట్ లాస్ డ్రింక్ రైస్ జెంపిక్ అంటే ఏంటి? ఇంట్లోనే రెండు నిమిషాల్లో సిద్ధం..

Rice Zempic: బరువు తగ్గించడంలో రైస్ జెంపిక్ పానీయం మ్యాజిక్ లాగా పనిచేస్తుందని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. దీన్ని ఎవరు ప్రయత్నించొచ్చు? దీనివల్ల నిజంగా బరువు తగ్గుతామా అని తెల్సుకోండి.


పెళ్లి విషయంపై శ్రీముఖి రియాక్షన్.. అంటే..?

Sreemukhi Marriage శ్రీముఖి తాజాగా తన అభిమానులతో ముచ్చట్లు పెట్టింది. ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ వచ్చింది. కొందరు వయసు ఎంత అని అడిగితే.. ఇంకొందరు పెళ్లి ఎప్పుడు అని అడిగారు. ఇంకొందరు డ్యాన్స్ వీడియోలను షేర్ చేయమని అడిగారు.. బుల్లితెరను మత్రం వదిలి పెట్టకు.. నీ ఎంటర్టైన్మెంట్ మాకు కావాలి అంటూ శ్రీముఖిని వేడుకున్నారు. బుల్లితెరపై శ్రీముఖికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలానే నెట్టింట్లోనూ మిలియన్ల ఫాలోవర్లతో...


పరిచయం: అమ్మతో కలిసి..విమానం ఎక్కాలనుకున్నా..

పరిచయం: అమ్మతో కలిసి..విమానం ఎక్కాలనుకున్నా.. ఒక సినిమాలో హీరో, హీరోయిన్, విలన్ కాకుండా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఉంటుంది. అదే సపోర్టింగ్ యాక్టర్ రోల్. వాళ్లు ఆ కథకు ఎంత ఉపయోగపడతారనేది ఫిల్మ్ అవార్డులకు నామినేట్ అయినప్పుడు తెలుస్తుంది. అలాంటి సపోర్టింగ్ రోల్స్తో ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే యాక్టర్లు కొందరే ఉంటారు. వాళ్లలో ఒకరు ఛాయా కదమ్. మరాఠీ, హి...


Veggies Peels: ఈ తొక్కల్లోనే పోషకాలెక్కువ.. ముఖానికి వాడితే సూపర్ బెనిఫిట్స్..

Veggies Peels: వంటింట్లో మిగిలిపోయే కూరగాయల పొట్టును వృథాగా పడేయకండి. వాటితో చర్మ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవచ్చో చూడండి.


Wheat Grass Juice: షుగర్‌, అధికబరువు, థైరాయిడ్‌ సమస్యలకు గోధుమ గడ్డి జ్యూస్‌తో చెక్‌!

Wheat Grass Juice Benefits: గోధుమ గడ్డి రసం ఒక ఆరోగ్యకరమైన పానీయం. దీనిని గోధుమ మొక్కలతో తయారు చేస్తారు. దీని ఉదయం కాఫీ, టీ, పాలకు బదలుగా తీసుకోవడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు.


Mid Day Meal | పసుపన్నమే మధ్యాహ్న భోజనం.. విద్యార్థులకు శాపంగా పెండింగ్‌ బిల్లులు

భోజనం అంటే అంటే పప్పు, కూర, పచ్చడి, చారు, పెరుగు లాంటి కనీస ఆహార పదార్థాలు గుర్తుకు వస్తాయి. అయితే వీటి మాట దేవుడెరుగు. కనీసం చారు అన్నం కూడా లభించని దౌర్భాగ్య స్థితిలో ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కొట్టుమిట్టాడుతున్నారు.