వర్షాకాలంలో తినాల్సిన పండ్లు ఇవే.. వీటితో హెల్త్‌కి డబుల్ బెనిఫిట్

ఈ ప్రకృతిలో ప్రతి సీజన్‌లో వివిధ రకాల పండ్లు లభిస్తాయి. ప్రస్తుత వర్షాకాలం సీజన్‌లో మార్కెట్లో ఆల్‌బుకారా పండ్లు ఎక్కువగా కనిపిస్తాయి. వీటిని ప్లమ్ ఫ్రూట్ (Plum fruit), ప్లమ్ యాపిల్ అని కూడా పిలుస్తారు. ఇవి చూడటానికి చిన్న టమాటా సైజులో, ముదురు రంగులో ఉంటాయి. రుచి పుల్లగా, తీపిగా ఉంటాయి. అయితే ఈ సీజనల్ పండ్లు తింటే వర్షాకాలంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీని నుంచి పుష్కలంగా లభించే విటమిన్ C, శరీరానికి శక్తిని ఇస్తుంది. ఈ ఫ్రూట్‌లోని యాంటీఆక్సిడెంట్లు వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతాయి. ఆల్‌బుకారా పండ్ల ప్రయోజనాలు తెలుసుకుందాం.

ఆల్‌బుకారా పండ్ల ప్రయోజనాల గురించి పోషకాహార నిపుణులు, డయాబెటిస్ ఎడ్యుకేటర్ సిమర్‌ప్రీత్ కౌర్ ఓ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ షేర్ చేశారు. ప్లమ్‌ ఫ్రూట్ బరువు తగ్గించగలదు. శరీరాన్ని శుభ్రపరుస్తుంది, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది, ఐరన్ శరీరానికి ఎక్కువగా వంటబట్టేలా చేస్తుంది. ఇవి ఎముకలను బలంగా మారుస్తాయి. ఆల్‌బుకారా పండ్లు తింటే మలబద్ధకం సమస్య తగ్గిపోతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

ఫిట్‌నెస్ బ్లాగర్ రాధా ధీర్ కూడా ఆల్‌బుకారా పండ్ల ప్రయోజనాలను వివరిస్తూ ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ షేర్ చేశారు. వర్షాకాలంలో వీటి బెనిఫిట్స్ వివరించారు. ఈ పండులో పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తపోటు స్థాయిలను తగ్గిస్తుంది. స్ట్రోక్ వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది. ఒక కప్పు ఆల్‌బుకారా పండ్లలో 1 గ్రాము కంటే తక్కువ కొవ్వు ఉంటుంది.

ఆరోగ్యానికి మంచివి

వర్షాకాలంలో అనారోగ్యాలు వచ్చే అవకాశాలు ఎక్కువ. అయితే ఈ సీజన్‌లో లభించే ఆల్‌బుకారా పండ్లు రెగ్యులర్‌గా తింటే హెల్త్ ప్రాబ్లమ్స్ రిస్క్ తగ్గుతుంది. ఇందులో పుష్కలంగా లభించే విటమిన్ C రోగనిరోధక శక్తిని పెంచి, అనేక రకాల ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. ఈ పండులో ఉండే యాంటీఆక్సిడెంట్లు చాలా రకాల దీర్ఘకాలిక వ్యాధులకు చెక్ పెడతాయి. ఇవి కణాల నష్టాన్ని అడ్డుకుంటాయి. శరీరంలోని ఫ్రీ రాడికల్స్ ప్రభావాలను న్యూట్రలైజ్ చేస్తాయి. ఈ పండు శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గిస్తుంది. దీని వల్ల చాలా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

ప్లమ్ ఫ్రూట్‌లో ఉండే ఫైబర్, పొట్ట సమస్యలను దూరం చేస్తుంది. ఈ పండులోని ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. వీటిలోని సమ్మేళనాలు గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించి, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. వీటిలో ఉండే విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు మొత్తం ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. ఈ ఫ్రూట్ ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది. ఎముకల సాంద్రతను పెంచుతుంది, ఆస్టియోపొరోసిస్ వంటి ఎముక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

2024-07-04T09:20:04Z dg43tfdfdgfd