బ్రెడ్‌ పకోడీ

కావలసిన పదార్థాలు

బ్రెడ్‌ ైస్లెసెస్‌: ఆరు, శనగపిండి: ఒక కప్పు, పచ్చిమిర్చి: ఆరు, జీలకర్ర: ఒక టీస్పూన్‌, కారం: ఒక టీస్పూన్‌, అల్లంవెల్లుల్లి పేస్ట్‌: అర టీస్పూన్‌, పసుపు, చాట్‌మసాలా, గరం మసాలా: పావు టీస్పూన్‌ చొప్పున, కొత్తిమీర, పుదీనా తరుగు: పావు కప్పు చొప్పున, వంటసోడా: చిటికెడు, ఉప్పు: తగినంత, నూనె: వేయించడానికి సరిపడా.

తయారీ విధానం

మిక్సీ జార్‌లో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లుపోసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి.

ఒక గిన్నెలో శనగపిండి, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్‌, పసుపు, చాట్‌ మసాలా, గరం మసాలా, ఉప్పు, వంటసోడ వేసి.. కొద్దిగా నీళ్లుపోసి బజ్జీల పిండిలా జారుగా కలపాలి. బ్రెడ్‌ ముక్కలపై పుదీనా మిశ్రమం రాసి ఒకదానిపై ఒకటి పెట్టి అంచులు కట్‌ చేసి.. మూలగా రెండు ముక్కలు చేసి పెట్టుకోవాలి. స్టవ్‌మీద కడాయి పెట్టి వేయించడానికి సరిపడా నూనెపోసి, వేడయ్యాక బ్రెడ్‌ ముక్కలను శనగ పిండిలో ముంచి విడివిడిగా వేయిస్తే వేడివేడి బ్రెడ్‌ పకోడీ సిద్ధం.

2024-07-03T19:23:42Z dg43tfdfdgfd