పిల్లలు దొంగతనాలు చేస్తున్నారా.. ఇలా మాన్పించండి..

చిన్న పిల్లలు అప్పుడప్పుడు ఇంట్లో కొన్ని దొంగతనాలు చేస్తుంటారు. అలాంటి పిల్లల్ని ఎలా ఆ అలవాటుని మాన్పించాలో తెలుసుకోండి.

చిన్నతనంలో కొంతమంది దొంగతనాలు చేయడం మనం చూస్తూనే ఉంటాం. ఈ అలవాటు అలానే పెరిగితే పెద్దగా అయ్యేసరికి చాలా పెద్ద సమస్యగా మారుతుంది. అలా కాకుండా ఉండాలంటే చిన్నతనంలోనే వారిలో ఈ అలవాటుని మాన్పించాలి. అందుకోసం ఏం చేయొచ్చో తెలుసుకోండి. ఓపిక అవసరం..

మీ ముందు పిల్లలు దొంగతనం చేస్తుంటే చూసి కోప్పడడం, కొట్టడం లాంటివి చేయొద్దు. కాసేపు ప్రశాంతంగా ఉండండి. తర్వాత వారిని దగ్గరికి తీసుకుని దొంగతనం చేయడం తప్పు అని, దీని వల్ల ఫ్యూచర్‌లో చాలా సమస్యలొస్తాయని వారికి తెలియజేయండి. ఉదాహారణకి దొంగతనం చేస్తే జైలుకి పంపిస్తారని, అక్కడ చాలా బాధలు పెడతారని చెప్పండి. దీంతో వారిలో మార్పు వచ్చే అవకాశముంది.

క్షమించడం..

దొంగిలించే అలవాటు తప్పు అయినా వారు అలా చేసినప్పుడు మీరు చూస్తే కోప్పడకుండా క్షమించడం నేర్చుకోండి. దగ్గరికి తీసుకుని కౌగిలించుకోండి. వారితో ప్రేమగా మాట్లాడండి. దీంతో వారి చేత దొంగతనం చేయకుండా చేయగలమని గుర్తుపెట్టుకోండి.

టైమ్ స్పెండ్ చేయడం..

మీ పిల్లలతో మంచి టైమ్‌ని స్పెండ్ చేయండి. దీని వల్ల మీ ఇద్దరి మధ్య మంచి రిలేషన్ మెంటెయిన్ అవుతుంది. ఇది మీ బిడ్డని ప్రేమించేలా చేస్తుంది. వారు కూడా మీతో క్లోజ్‌గా ఉండి వారి ఆలోచనల్ని మీతో పంచుకుంటారు.

మీరే దాచిపెట్టండి..

వారు డబ్బుతీయడం, ఇతర వస్తువులు ఏం తీస్తున్నారో.. అది వారికి కనిపించకుండా జాగ్రత్తగా ఉంచండి. దీని వల్ల వారే కొన్ని రోజులు అలా చూసి చూసి ఏమీ కనిపించకపోయేసరికి సాధారణంగా ఉండడానికి అలవాటు పడతారు. అంతేకానీ, మీరే వారి చేతికి తాళాలివ్వొద్దు.

ఒప్పుకుంటే..

ఏదైనా సందర్భంలో దొంగతనం జరిగిందని గుర్తించి వారిని అడిగినప్పుడు నిజం చెబితే మెచ్చుకోండి. మీరు పోగొట్టుకున్న వస్తువుని ఇవ్వమని అడగండి. వారే ఇస్తారు. ఇలాంటి తప్పులు చేయడం మంచిది కాదని అర్థమయ్యేలా చెప్పండి.

మనది కాదని..

ఎప్పుడైనా సరే మన వస్తువులు, మన డబ్బే మనకి సొంతమని వారికి చెప్పండి. వేరేవారి వస్తువులు, డబ్బుని ముట్టుకునే హక్కు మనకి లేదని, మనం యజమానులం కాదని వారికి నమ్మకంగా చెప్పండి. అలా వేరేవారి వస్తువులని తాకడానికి ముందు అనుమతి తీసుకోవడం అలవాటు చేయండి. ఇలాంటి పనుల వల్ల మన వస్తువులని మనం కాపాడుకోవచ్చు.

​​​Read More : Pregnancy and Parenting News and Telugu News

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-07-03T12:36:32Z dg43tfdfdgfd