పది పాస్ అయిన వారికి భారీ శుభవార్త.. వెంటనే త్వరపడండి..

పిల్లల చదువుల కోసం తల్లి తండ్రులు ఎప్పుడు ఒక అడుగు ముందుగానే ఆలోచన చేస్తారు. ఎందుకంటే వారి భవిష్యత్తు కు బాటలు వేసేది చదువు ఒక్కటే కాబట్టి. కానీ కొంత మంది ఎంత మంచిగా చదివిన మంచి స్కూల్లో లేదా మంచి కాలేజీల్లో చదవటానికి ఇంట్లో సరిపడా వసతులు లేక అందుబాటులో లేక తక్కువ ఫీజు ఉన్నవాటిలో చేరి చదువుతుంటారు.కానీ ఇప్పుడు ఈ రోజుల్లో అలాంటి పరిస్థితులు ఇక్కడ లేవు. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో లేదా ప్రభుత్వ కాలేజీల్లో ప్రైవేట్ కి ధీటుగా వసతులు తో పాటు ఎడ్యుకేషన్ కూడా బాగుంటుంది.

దీంతో ప్రభుత్వ కాలేజీలో లేదా స్కూల్లో సీట్ రావడానికి చాలా కష్టం అవుతుంది. అలాంటిది రామగుండం లింగపురం గ్రామానికి చెందిన మోడల్ కాలేజి విద్యార్థులకి, వారి తల్లిదండ్రులకు శుభవార్తను అందించింది యాజమాన్యం. 10 వ తరగతి పూర్తయిన విద్యార్థుల కోసం స్పాట్ అడ్మిషన్ లు తీసుకుంటున్నట్లు మోడల్ కాలేజి ప్రిన్సిపల్ తస్నేమా బేగం తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఖాళీగా ఉన్న సీట్లకు స్పాట్ అడ్మిషన్ చేసుకుంటామని తెలిపారు.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

రేపటి నుంచి 4 రోజులు దంచికొట్టనున్న వర్షాలు.. ఈ జిల్లాల్లో భారీ వానలు!

10 వ తరగతి పూర్తి చేసుకుని ఇంటర్మీడియెట్ లో ప్రభుత్వ మోడల్ కాలేజీలో స్పాట్ అడ్మిషన్ కు ఖాళీగా ఉన్న సీటు ఇవే..Bipc 17 సీట్లు, CECలో 12 సీట్లు, అందుబాటులో ఉన్నాయి .ఈ సీట్లు భర్తీ చేసుకోవడానికి రామగుండం లొంగపురంలో ఉన్న ప్రభుత్వ మోడల్ స్కూల్ కి నేరుగా వచ్చి అడ్మిషన్లు తీసుకోవాలని యాజమాన్యం ప్రకటించింది. ఇంకెందుకు ఆలోచనలో ఉన్నారు. వెంటనే మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం వెంటనే ఈ మోడల్ కాలేజీలో అడ్మిషన్ తీసుకోండి. మరిన్ని వివరాలు కావాలన్న లేదా ఇంకేమైనా సందేహాలు ఉన్నా వెంటనే ఈ నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్.. 99513 57679 రామగుండం లింగాపురం మోడల్ కాలేజీ.

2024-07-04T15:35:59Z dg43tfdfdgfd