నిధులివ్వకపోవడంతో రెంట్లతో నడుపుకున్నరు

నిధులివ్వకపోవడంతో రెంట్లతో నడుపుకున్నరు

  • నల్గొండ జడ్పీ గెస్ట్​హౌస్​, ఖాళీ స్థలాన్ని లీజుకు ఇచ్చిన పాలకవర్గం
  • ఆ  పైసలతోనే నెట్టుకొచ్చిన వైనం 

నల్గొండ : నల్గొండ జిల్లా పరిషత్​ పాలకవర్గం ఖజానాలో చిల్లిగవ్వ లేకపోవడంతో సొంత ఆస్తులనే లీజుకు ఇచ్చి ఐదేండ్లు ఎల్లదీసింది. డబ్బులు లేక స్వాతంత్ర్య దినోత్సవాన్ని, తెలంగాణ ఆవిర్భావ వేడుకులను కూడా ఘనంగా నిర్వహించుకోలేని పరిస్థితి ఉండేది. దీంతో మెయింటనెన్స్​ కోసం కొత్త జడ్పీ బిల్డింగ్​కట్టాక పాత బిల్డింగ్​ను ​ఆడిట్, ఆబ్కారీ, క్వాలిటీ కంట్రోల్​, పోక్సో కోర్టు, బీఎల్ఐసీ ఆఫీసులకు రెంట్​కు ఇవ్వాల్సి వచ్చింది. ఇందులోనూ కోర్టు నుంచి మాత్రమే నెలకు ఠంచన్​గా రూ.9వేలు రెంట్​వస్తోంది. మరొక రెండు శాఖలు అరొకరగానే అద్దె చెల్లించేవి.

 దీంతో పాటు గత బీఆర్ఎస్ ​ప్రభుత్వం స్టేషనరీ ఖర్చులు కూడా ఇవ్వకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడింది. చివరకు జడ్పీటీసీలు, చైర్మన్ ​కోసం నిర్మించిన గెస్ట్ హౌస్​ను ​లీజుకు ఇచ్చింది. ఇదే గెస్ట్​ హౌస్ ​ప్రాంగణంలో మెయిన్ ​రోడ్డుకు ఆనుకుని ఉన్న జాగను ప్రైవేటు వ్యక్తులకు లీజుకు ఇచ్చారు. ఇలా గత మూడేండ్ల నుంచి పత్రి నెలా వచ్చే రూ.70 వేలతో జడ్పీని నెట్టుకువచ్చారు. ఈ డబ్బులతోనే స్టేషనరీ ఖర్చులు, జనరల్ ​బాడీ, స్టాండింగ్ ​కమిటీ మీటింగు​లు జరిగినప్పుడు స్నాక్స్​, టీలు, టిఫిన్లు పెట్టేవారు. మూడు నెలలకోసారి నిర్వహించే జనరల్​బాడీ మీటింగులకు భోజన ఖర్చులు తడిసి మోపెడైనా ఇదే డబ్బులతో సర్దుబాటు చేశారు.  

10 కోట్లు ఇస్తామన్న కేసీఆర్​ 

నిధులు బాగా ఖర్చు చేసే జడ్పీలకు అదనంగా రూ.10 కోట్ల నిధులు ఇస్తామని అప్పటి సీఎం సీఎం కేసీఆర్ ​హామీ ఇచ్చారు. దీని సంగతి పక్కన పెడితే అసలు జడ్పీకి రావాల్సిన గ్రాంట్లన్నీ అప్పటి జిల్లా మంత్రి గుప్పిట్లోనే పెట్టుకున్నారు. డీఎంఎఫ్​టీ, ఉపాధి నిధులన్నీ మంత్రి కోటాలోకే మళ్లించారు. ఎస్ఎఫ్​సీ, సీనరేజ్, జనరల్​ ఫండ్ గ్రాంట్లు ఇవ్వడం బంద్​ చేశారు. కేంద్రం రిలీజ్​ చేసిన15 వ ఆర్ధిక సంఘం నిధులు తప్పా జడ్పీకి నయాపైసా రాలేదు. ఐదేండ్లలో ఒక్కో జడ్పీటీసీకి సగటున 

రూ.కోటికి మించి ఫండ్స్ ​రాలేదు. రెండేండ్లలో వచ్చింది కేవలం రూ.10 కోట్లు మాత్రమే. గతేడాది నవంబర్ ​నుంచి జడ్పీటీసీలకు ఇవ్వాల్సిన జీతాలను కూడా బీఆర్ఎస్​ ప్రభుత్వం ఆపేసింది.

©️ VIL Media Pvt Ltd.

2024-07-03T02:03:07Z dg43tfdfdgfd