నాటిన మొక్కలను సంరక్షించాలి

  • మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి

పెనుబల్లి, జూలై 3 : వన మహోత్సవంలో మొక్కలు నాటడమే కాదు నాటిన ప్రతిమొక్కనూ సంరక్షించే బాధ్యతను ప్రతిఒక్కరూ తీసుకోవాలని రాష్ట్ర అటవీశాఖ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర రెవెన్యూ, ప్రజాసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. బుధవారం ఎమ్మెల్యే మాట్టా రాగమయితో కలిసి గొల్లగూడెం ప్లానిటేషన్‌లో వారు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హరితవనాలు ఎంతో అవసరమని, వనాలను పెంచాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. విద్యార్థులు, అటవీశాఖ అధికారులే కాకుండా మొక్కలు నాటే కార్యక్రమాన్ని సామాజిక బాధ్యతగా తీసుకోవాలన్నారు. అనంతరం ప్రాంగణంలో అడవి ఉత్పత్తుల విత్తనాలు స్టాల్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో అటవీశాఖ ప్రత్యేక కార్యదర్శి నదీంమొహమ్మద్‌, సీసీఎఫ్‌ భీమానాయక్‌, పీపీ సునీల్‌దత్‌, టీఎఫ్‌వో విక్రమ్‌సిద్ధార్థ్‌సింగ్‌, తెలంగాణ విద్య, మౌలిక వసతుల చైర్మన్‌ మువ్వా విజయబాబు, ఎఫ్‌డీవో మంజుల, అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌, ఎఫ్‌ఆర్‌వోలు స్నేహలత, అరవింద్‌, డీఆర్‌వో ఎంఆర్‌పీ. రావు, రాష్ట్ర నాయకులు మట్టా దయానంద్‌ విజయ్‌కుమార్‌, జడ్పీటీసీ చెక్కిలాల మోహన్‌రావు, ఆర్డీవో రాజేంద్రగౌడ్‌, తహసీల్దార్‌ గంటా ప్రతాప్‌, తదితరులు పాల్గొన్నారు.

బొగ్గు బ్లాకుల వేలాన్ని ఆపాలని మంత్రి పొంగులేటికి వినతి

సత్తుపల్లిటౌన్‌, జూలై 3 : బొగ్గు బ్లాకుల వేలాన్ని ఆపాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు దండు ఆదినారయణ సత్తుపల్లిలో కలిసి వినతిపత్రం అందజేశారు. అదేవిధంగా సత్తుపల్లి పట్టణంతో పాటూ వేంసూరు, పెనుబల్లి, కల్లూరు, తల్లాడ మండల కేంద్రాలో పేదలకు ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని, మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తడికమల్ల యోగు, లాల్‌మొహమ్మద్‌, షేక్‌ రంజాన్‌బీ, బీ.నాగవెంకటేశ్వరరావు, శివనాగమణి, హమీద్‌, అజయ్‌ పాల్గొన్నారు.

2024-07-03T21:56:33Z dg43tfdfdgfd