TODAY HOROSCOPE: ఓ రాశివారికి ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ అవుతాయి

Today Horoscope: రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం

 

మేషం (అశ్విని , భరణి, కృత్తిక 1)

నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)

దినాధిపతులు

అశ్విని నక్షత్రం వారికి(దినపతి శుక్రుడు)

భరణి నక్షత్రం వారికి (దినపతి రాహు)

కృత్తిక నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:-చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. స్థిరాస్థికి సంబంధించిన విషయాల్లో ఒకటికి రెండు సార్లు ఆలోచించిన నిర్ణయాలు తీసుకోవడం మంచిది. సన్నిహితులతో ముఖ్యమైన విషయాలను పంచుకుంటారు. కుటుంబ సభ్యుల మద్య ఒక విషయం గురించి గొడవలు వస్తాయి. వ్యాపారం లాభాదాయకంగా ఉండదు. ఆర్థిక పరిస్థితి దిగజారుతుంది. 

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి , మృగశిర 1 2)

నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)

దినాధిపతులు

రోహిణి నక్షత్రం వారికి  (దినపతి కుజుడు)

మృగశిర నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:-మొదలుపెట్టిన పనులు అనుకున్న సమయానికే పూర్తవుతాయి. అన్నదమ్ములతో గొడవలు ఒకరి జోక్యంతో సర్దుమనుగుతాయి. వృత్తి ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపారం ప్రారంభానికి ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది. 

మిథునం (మృగశిర 3 4 ఆరుద్ర ,పునర్వసు 1 2 3)

నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)

దినాధిపతులు

ఆరుద్ర నక్షత్రం వారికి  (దినాధిపతి శని)

పునర్వసు నక్షత్రం వారికి  (దినపతి కేతువు )

దిన ఫలం:-వృత్తి వ్యాపారం విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు మీ భవిష్యత్తుకు లాభాదాయకంగా ఉంటాయి. ఇంట్లో శుభకార్యాలకు శ్రీకారం చుడతారు. ఇంట్లో ముఖ్యమైన పత్రాలను చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. మొదలుపెట్టిన పనుల్లో పనిభారం ఎక్కువ అవుతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. 

 

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి , ఆశ్లేష )

నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)

దినాధిపతులు

పుష్యమి నక్షత్రం వారికి  (దినపతి చంద్రుడు)

ఆశ్రేష నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-చిన్ననాటి స్నేహితులతో ఆనందమైన సమయాన్ని గడుపుతారు. వృత్తి ఉద్యోగులు అధికారులతో మాట పడాల్సి వస్తుంది. ఇంటి పెద్దలతో చిన్న చిన్న వివాదాలు వస్తాయి. ఒక ప్రణాళిక ప్రకారం.. మొదలుపెట్టిన పనులను అనుకున్న సమయానికే పూర్తి చేస్తారు. వ్యాపారాలు చిన్న పాటి లాభాలను పొందుతారు. 

సింహం (మఖ , పుబ్బ , ఉత్తర 1)

నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)

దినాధిపతులు

మఘ నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)

పూ.ఫల్గుణి నక్షత్రం వారికి (దినపతి రాహు)

ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  (దినపతి రవి)

దిన ఫలం:-ఈ రోజు శుభవార్తలు వింటారు. మీరు ఊహించని విధంగా ధన లాభం పొందుతారు. మీ మంచి తనంతో సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మొదలుపెట్టిన కార్యాలు సకాలంలో పూర్తవుతాయి.  రావలసిన బకాయిలను సకాలంలో వసూలు అవుతాయి. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. 

కన్య (ఉత్తర 2 3 4, హస్త , చిత్త 1 2)

నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)

దినాధిపతులు

హస్త నక్షత్రం వారికి  (దినపతి కుజుడు) 

చిత్త నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:-నూతన వ్యాపారాల ద్వారా అనుకున్న లాభాలను పొందుతారు. ఈ రోజు అన్ని రంగాల వారికి లాభాదాయకంగా ఉంటుంది. ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగులు వారి పనికి మంచి గుర్తింపును పొందుతారు. అద్యాత్మిక చింతన పెరుగుతుంది. 

తుల (చిత్త 3 4 స్వాతి  విశాఖ 1 2 3)

నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)

దినాధిపతులు

స్వాతి నక్షత్రం వారికి (దినాధిపతి శని)

విశాఖ నక్షత్రం వారికి(దినపతి కేతువు )

దిన ఫలం:-వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆస్థి కొనుగోలులో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. అనవసరమైన ఖర్చులు చేస్తారు. మీ కుటుంబ సభ్యులకు మీ ఆలోచనా విధానం నచ్చదు. ఉద్యోగులకు పనిబాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారులు సొంత ఆలోచనల పైన పనిచేయడం మంచిది. 

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ , జ్యేష్ఠ )

నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య)

దినాధిపతులు

అనూరాధ నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)

జ్యేష్ట నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-శత్రువులు మీ ముందు నిలబడలేరు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. బంధుమిత్రుల నుంచి ముఖ్యమైన విషయాలను తెలుసుకుంటారు. జీవితభాగస్వామి సలహాలు, సూచనలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. దూరపు బంధువులతో వివాదాలు వస్తాయి. నిరుద్యోగులు అనుకున్న ఉద్యోగాన్ని పొందుతారు.

 

ధనుస్సు (మూల,  పూ.షాఢ , ఉ.షాఢ 1)

నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)

దినాధిపతులు

మూల నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)

పూ.షాఢ నక్షత్రం వారికి  (దినపతి రాహు)

ఉ.షాఢ నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:-కుటుంబంతో కలిసి శుభకార్యాలకు వెళతారు. వృత్తి ఉద్యోగులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. రావాల్సిన డబ్బు వసూలు అవుతుంది. ఇంట్లో పరిస్థితులు మిమ్మల్ని ఒత్తిడికి గురిచేస్తాయి. వ్యాపారాన్ని విజయవంతంగా ప్రారంభిస్తారు. 

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం , ధనిష్ట 1 2)

నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)

దినాధిపతులు

శ్రవణా నక్షత్రం వారికి(దినపతి కుజుడు)

ధనిష్ఠ నక్షత్రం వారికి  (దినపతి గురుడు)

దిన ఫలం:- ఆదాయం తక్కువగా, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానం అందుకుంటారు. ఉద్యోగులు తమ పనితనంతో అధికారుల మన్ననలు పొందుతారు. నిరుద్యోగులు మంచి ఉద్యోగ అవకాశం పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనం చేసుకుంటారు. 

 

కుంభం (ధనిష్ట 3 4, శతభిషం , పూ.భాద్ర 1 2 3)

నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)

దినాధిపతులు

శతభిషం నక్షత్రం వారికి  (దినాధిపతి శని)

పూ.భాద్ర నక్షత్రం వారికి (దినపతి కేతువు )

దిన ఫలం:-మీరనుకున్న నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఒక ప్రణాళిక ప్రకారం మీ పనులన్నింటినీ పూర్తి చేస్తారు. ఈ రోజు అన్ని రంగాల వారికి సానుకూలంగా ఉంటుంది. వ్యాపారాలు ఒక మాదిరిగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నత పదవుల యోగం ఉంది. 

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర , రేవతి )

నామ నక్షత్రాలు (దీ-దూ- ఝ-దా-దే-దో-చా-చ)

దినాధిపతులు

ఉ.భాద్ర  నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)

రేవతి నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-అప్పుల భారం పెరుగుతుంది. బంధుమిత్రులతో గొడవలు వస్తాయి. ఇంటికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. మొదలుపెట్టిన పనుల్లో మరింత కష్టపడాల్సి వస్తుంది. అధికారులతో మాటపట్టింపులు వస్తాయి. 

2024-07-04T00:10:40Z dg43tfdfdgfd