SKIN CARE: చర్మానికి మెరుపు తెచ్చి నల్లటి మచ్చలను పొగొట్టే నేచురల్ క్రీమ్ ఇంట్లోనే తయారు చేయండిలా

ముఖంపై మొటిమలు, మచ్చలు వంటివి ఎక్కువ మందిని వేధిస్తూ ఉంటాయి. ముఖ్యంగా యువతుల్లో మొటిమల సమస్య అధికంగా ఉంటుంది. మొటిమలు తగ్గిపోయాక నల్ల మచ్చలు మిగిలిపోతూ ఉంటాయి. చర్మం కూడా డల్ గా కనిపిస్తుంది. ఇది చర్మాన్ని మెరుపు లేకుండా చేస్తుంది. ఈ సమస్యలన్నీ తొలగిపోవాలంటే ఆలం పొడితో తయారు చేసిన ఈ క్రీమ్ ను అప్లై చేయాలి. ఈ క్రీమ్ ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఆలం పొడిని పటిక పొడి అని పిలుస్తారు. ఆన్ లైన్ మార్కెట్లో ఆలం పొడి (Alum Powder)ను అమ్ముతారు. వాటిని కొని ఇంట్లోనే మచ్చలు పొగొట్టే నేచురల్ క్రీమ్ తయారు చేసుకోవచ్చు.

నేచురల్ క్రీమ్ తయారీ

నిమ్మకాయ రసం- ఒక టీస్పూన్

తేనె- అర స్పూను

రోజ్ వాటర్ - ఒక స్పూను

ఆలం పొడి - ఒక స్పూను

పైన చెప్పిన వస్తువులన్నీ అందుబాటులోనే ఉంటాయి. ముందు రోజవాటర్ ను చిన్న గిన్నెలో వేసి అందులో ఆలం పొడి వేయాలి. కాసేపు అలా ఉంచితే ఆలం పొడి రోజ్ వాటర్లో బాగా కలిసిపోతుంది. ఇప్పుడు నిమ్మరసం, తేనె కూడా కలపాలి. అంతే క్రీమ్ రెడీ అయినట్టే ఒకసారి చేసుకుంటే ఆరు నుంచి ఏడు రోజుల పాటూ నిల్వ ఉంటుంది. దీన్ని ఫ్రిజ్ లో నిల్వ చేసుకోవచ్చు.

ముఖాన్ని బాగా కడిగిన తర్వాత ఈ క్రీమ్ ను అప్లై చేయాలి. అరగంట తర్వాత నీటితో ముఖం కడిగేసుకుని శుభ్రం చేసుకోవాలి. ఈ క్రీమ్ ను వారానికి రెండు మూడు సార్లు అప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది చర్మాన్ని శుభ్రపరచడంతో పాటు మచ్చలను తొలగించడానికి, సన్నని గీతలను తగ్గించడానికి సహాయపడుతుంది. చర్మానికి మెరుపును అందిస్తుంది. రెండు వారాల తరువాత మీరే చర్మంలోని మార్పును గుర్తిస్తారు.

ఆలం పొడి ప్రయోజనాలు

ఆలం పొడి చర్మాన్ని సహజంగా తెల్లగా మార్చడానికి పనిచేస్తుంది. దీని వల్ల చర్మంపై ఉన్న మచ్చలు తగ్గిపోయి చర్మం కాంతివంతం అవుతుంది. అలాగే చర్మంపై మెరుపు కనిపించడం ప్రారంభమవుతుంది. అదనంగా, ఆలం చర్మంపై ఉన్న పెద్ద రంధ్రాలను చిన్నవిగా చేస్తుంది. ఇది చర్మం వదులును తగ్గించి బిగుతుగా మారుస్తుంది. వృద్ధాప్య ప్రక్రియను నెమ్మదించేలా చేస్తుంది. అంతే కాదు చర్మం యవ్వనంగా కనిపిస్తుంది. తేనె చర్మాన్ని తేమవంతం చేస్తుంది. కాబట్టి ఆలంతో తయారు చేసిన ఈ నేచురల్ క్రీమ్ ను కొన్ని వారాల పాటు అప్లై చేస్తే చర్మం కాంతివంతంగా మారుతుంది.

2024-07-02T02:59:20Z dg43tfdfdgfd