KETU TRANSIT: కేతువు సంచారంతో ఈ రాశులవారికి అడుగడుగునా డబ్బే..

Ketu Blessing Zodiac Sign 2024: జ్యోతిష్య శాస్త్రంలో శని, రాహువు, కేతువు గ్రహాల గురించి క్లుప్తంగా వివరించారు. ఈ మూడు గ్రహాలను కీడు గ్రహాలుగా పరిగణిస్తారు. ఈ గ్రహాలు సంచారం చేసినప్పుడల్లా వ్యక్తుల జీవితాల్లో దుష్ప్రభావాలతో పాటు ఆర్థిక ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇదిలా ఉంటే దాదాపు 15 నెలల తర్వాత ఈ గ్రహాలు రాశి సంచారంతో తిరోగమనం చేయబోతున్నాయి. దీని కారణంగా శుభ, అశుభ ప్రభావం ఏర్పడుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే జూలై 8 కేతువు హస్తా నక్షత్రంలోని రెండవ స్థానంలోకి సంచారం చేయబోతున్నాడు. అయితే కేతువు గ్రహం సంచారం చేయడం వల్ల కొన్ని రాశువారిపై ఎంతో ప్రత్యేకమైన ప్రభావం పడబోతోంది. దీంతో 3 రాశులవారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా కీర్తి, ప్రతిష్టలు కూడా లభిస్తాయి. అలాగే ఈ రాశులవారు ఎలాంటి పనులైనా చేయగలుగుతారు. దీంతో పాటు అదృష్టం కూడా రెట్టింపు అవుతుంది. అయితే ఈ సమయంలో ఏయే రాశులవారు ఎలాంటి లాభాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం. 

మేష రాశి:

ఈ నక్షత్ర సంచారం కారణంగా మేష రాశివారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా వీరికి ధైర్యం కూడా పెరుగుతుంది. అలాగే వృత్తి జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అంతేకాకుండా ఆదాయంలో పలు మార్పులు వచ్చి కొత్త ఆదాయ వనరులు కూడా లభిస్తాయి. అంతేకాకుండా గతంలో ఇతరులకు ఇచ్చిన డబ్బులు కూడా తిరిగి వస్తాయి. దీంతో పాటు ఆస్తి, వాహనాలు కూడా ఈ సమయంలో కొనుగోలు చేసే ఛాన్స్‌ ఉంది. దీంతో పాటు పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా భారీగా ఆర్థిక లాభాలు కలుగుతాయి. 

వృషభరాశి:

కేతువు సంచారంతో వృషభ రాశి వారికి విపరీతమైన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా వీరి ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. అంతేకాకుండా ఈ రాశివారు కొత్త ఆదాయ వనరులతో డబ్బులు కూడా పొందుతారు. అలాగే ఆర్థికంగా కూడా భారీ లాభాలు పొందుతారు. ఉద్యోగాలు చేసేవారికి కూడా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా కొత్త వాహనాలతో పాటు ఆస్తులు కూడా కొనుగోలు చేసే ఛాన్స్‌ ఉంది. దీంతో పాటు విద్యార్థులు ర్యాంక్‌లు కొట్టే ఛాన్స్‌ కూడా ఉంది. అంతేకాకుండా ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి ఈ సమయం చాలా బాగుటుంది. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

మకర రాశి:

కేతువు సంచారంతో మకర రాశివారికి ఊహించని ఆర్థిక లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా వీరికి ధైర్యం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా కష్టానికి తగిన ప్రతిఫలం కూడా లభిస్తుంది. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల విపరీతమైన లాభాలు కలుగుతాయి. అలాగే కష్టమైన పనులు కూడా సులభంగా చేయగలుగుతారు. కుటుంబ జీవితంలో వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అలాగే పోటీ పరీక్షల్లో సులభంగా విజయాలు సాధించే ఛాన్స్‌ కూడా ఉంది. అంతేకాకుండా ఎలాంటి పనులైనా సులభంగా చేస్తారు. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

2024-07-04T05:58:28Z dg43tfdfdgfd